దిలీప్ కుమార్: బాలీవుడ్ అలనాటి నటుడు కన్నుమూత

దిలీప్ కుమార్

ఫొటో సోర్స్, India today

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్నుమూశారని ముంబయి హిందుజా ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు బీబీసీకి ధ్రువీకరించారు.

హిందుజా ఆస్పత్రి డాక్టర్ జలీల్ పార్కర్ దిలీప్ కుమార్ మృతిచెందారని బీబీసీకి తెలిపారు.

దిలీప్ కుమార్ బుధవారం ఉదయం ఏడున్నరకు తుదిశ్వాస విడిచారని ఆయన చెప్పారు.

వయసుతోపాటూ వచ్చే అనారోగ్య సమస్యల వల్లే ఆయన చనిపోయారని పార్కర్ తెలిపారు.

దిలీప్ కుమార్ ట్విటర్ హ్యాండిల్లో ఉదయం 8 గంటలకు ఆయన మృతి గురించి సమాచారం పెట్టారు.

ఈ ట్వీట్ ఆయన కుటుంబానికి మిత్రుడైన ఫైజల్ ఫారూఖీ చేశారు.

దిలీప్ కుమార్ కొన్ని నిమిషాల క్రితం తుదిశ్వాస విడిచారని దిలీప్ కుమార్ అధికారిక ట్విటర్‌లో ఫైజల్ ఫారూఖీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దిలీప్ కుమార్ మృతిచెందినట్లు హిందుజా ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్ ధ్రువీకరించినట్లు ఏఎన్ఐ కూడా ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దిలీప్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నారు. ఆయన వయసు 98 ఏళ్లు.

ఆయనకు వయసుతోపాటూ వచ్చే అనారోగ్య సమస్యలతో ముంబయిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామని గత వారం దిలీప్ కుమార్ మిత్రుడు ఫైజల్ ఫారూఖీ చెప్పారు.

దిలీప్ కుమార్ మరణం సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"దిలీప్ కుమార్ గారు ఒక సినిమా లెజెండ్‌గా గుర్తుండిపోతారు. ఆయన అసమాన ప్రతిభావంతులు. ఆ నటనతో ఆయన ఎన్నో తరాలను మంత్రముగ్ధులను చేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబం, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. RIP" అన్నారు.

అమితాబ్

ఫొటో సోర్స్, Ani

భారత సినీ చరిత్ర దిలీప్ కుమార్‌కు ముందు, తర్వాతగా నిలిచిపోతుంది- అమితాబ్ బచ్చన్

దిలీప్ కుమార్‌ మృతికి సంతాపం తెలుపుతూ అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ చేశారు.

"ఒక వ్యవస్థ వెళ్లిపోయింది. భారతీయ సినిమా చరిత్ర ఎప్పుడు రాసినా, దానిని దిలీప్ కుమార్ ముందు, దిలీప్ కుమార్ తర్వాత అనే రాస్తారు" అన్నారు.

"ఒక మహా అధ్యాయం ముగిసింది.. అది మళ్లీ జరగడం ఉండదు" అని కూడా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లు ఒకే ఒక్క సినిమాలో కలిసి నటించారు. 1982లో వచ్చిన శక్తి సినిమాలో ఇద్దరూ చేశారు.

ఈ సినిమాలో దిలీప్ కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా, అమితాబ్ ఆయన కొడుకుగా నటించారు.

ఆదర్శాల కోసం పోరాడే తండ్రీకొడుకుల కథతో ఈ సినిమా సూపర్ ‌హిట్‌గా నిలిచింది. ఇద్దరూ ఇందులో పోటీపడి నటించారు.

ఉద్దవ్

ఫొటో సోర్స్, Naveen

ఫొటో క్యాప్షన్, దిలీప్ కుమార్‌కు నివాళి అర్పిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

పెషావర్‌లో పుట్టిన దిలీప్ కుమార్

దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో పెషావర్‌లో పుట్టారు.

ఆయన అసలు పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, ఆయన తండ్రి ఒక పళ్ల వ్యాపారి.

దిలీప్ కుమార్‌ను నటి దేవికా రాణి వెండితెరకు పరిచయం చేశారు.

40వ దశకంలో ప్రముఖ నటి అయిన దేవికా రాణి ఆయనను మీకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉందా అని అడిగారు. ఆయన పేరును మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్‌గా మార్పించారు.

హిందీ ప్రముఖ కవి నరేంద్ర శర్మ ఆయనకు జహంగీర్, వాసుదేవ్, దిలీప్ కుమార్ అనే మూడు పేర్లు సూచించారు. యూసుఫ్ ఖాన్.. దిలీప్ కుమార్ అనే పేరు ఎంచుకున్నారు.

1944లో కెరీర్ ప్రారంభించిన దిలీప్ కుమార్ తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 63 సినిమాలు చేశారు.

కెరీర్ మొత్తంలో దిలీప్ కుమార్ ఒకే ఒక్కసారి ముస్లిం పాత్ర చేశారు.

అభిమానులు 'ట్రాజెడీ కింగ్‌'గా పిలుచుకునే దిలీప్ కుమార్ ఐదు దశాబ్దాల కెరియర్‌లో 'మొఘల్ ఎ ఆజం', 'దేవదాస్', 'నయా దౌర్', 'రామ్ అవుర్ శ్యాం' లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఆయన చివరగా 1998లో వచ్చిన 'కిలా' సినిమాలో కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)