You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అహ్మదాబాద్: కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవ దహనం
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కోవిడ్ రోగులు ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది రోగులు మరణించారు.
గురువారం వేకువన 3 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి చీఫ్ ఫైర్ ఆఫీసర్ 'బీబీసీ'కి తెలిపారు.
ఈ ప్రమాదంలో 8 మంది మరణించారని ఆయన ధ్రువీకరించారు.
ఐసీయూలో 40 మంది
ఆసుపత్రి ఐసీయూలో పీపీఈ కిట‌్ ధరించిన సిబ్బంది ఒకరికి మొట్టమొదట మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని.. అక్కడే ఉన్న సిబ్బందికి ఇవి అంటుకోవడంతో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ప్రమాదం జరిగేటప్పటికి ఐసీయూలో 40 మందికి పైగా కోవిడ్ రోగులున్నారు.
హోం క్వారంటైన్‌లో అగ్నిమాపక సిబ్బంది
కాగా మంటలను అదుపు చేయడానికి వచ్చిన సుమారు 40 మంది అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అనంతరం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కోవిడ్ రోగులు ఉన్న ఐసీయూలోకి వెళ్లడంతో వీరంతా క్వారంటైన్‌కు వెళ్లారిప్పుడు.
ప్రమాదం జరిగిన ఆసుపత్రి ఐసీయూలోని రోగులను సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రికి మార్చారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడానని.. ఈ ప్రమాదంలో గాయపడినవారు కోలుకునేలా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించానని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)