అహ్మదాబాద్: కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

ప్రమాదం జరిగిన ఆసుపత్రి

ఫొటో సోర్స్, Ani

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కోవిడ్ రోగులు ఉన్న ఒక ప్రయివేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది రోగులు మరణించారు.

గురువారం వేకువన 3 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి చీఫ్ ఫైర్ ఆఫీసర్ 'బీబీసీ'కి తెలిపారు.

ఈ ప్రమాదంలో 8 మంది మరణించారని ఆయన ధ్రువీకరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఐసీయూలో 40 మంది

ఆసుపత్రి ఐసీయూలో పీపీఈ కిట‌్‌ ధరించిన సిబ్బంది ఒకరికి మొట్టమొదట మంటలు అంటుకున్నాయని ఆయన చెప్పారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని.. అక్కడే ఉన్న సిబ్బందికి ఇవి అంటుకోవడంతో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

ప్రమాదం జరిగేటప్పటికి ఐసీయూలో 40 మందికి పైగా కోవిడ్ రోగులున్నారు.

ప్రమాదం జరిగిన ఆసుపత్రి

హోం క్వారంటైన్‌లో అగ్నిమాపక సిబ్బంది

కాగా మంటలను అదుపు చేయడానికి వచ్చిన సుమారు 40 మంది అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అనంతరం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

కోవిడ్ రోగులు ఉన్న ఐసీయూలోకి వెళ్లడంతో వీరంతా క్వారంటైన్‌కు వెళ్లారిప్పుడు.

ప్రమాదం జరిగిన ఆసుపత్రి ఐసీయూలోని రోగులను సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రికి మార్చారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడానని.. ఈ ప్రమాదంలో గాయపడినవారు కోలుకునేలా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించానని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)