పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లైవ్ కవరేజీ

  1. బ్రేకింగ్ న్యూస్, భారత్ X బంగ్లాదేశ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

    భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే ప్రారంభమవుతోంది.

    టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

    తొలి వన్డేలో భారత్ మీద బంగ్లాదేశ్ గెలిచింది. ప్రస్తుతం మూడు వన్డేల సరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో లీడ్‌లో ఉంది.

  2. ప్రారంభమైన పార్లమెంట్ శీతకాల సమావేశాలు

    పార్లమెంట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

    నేడు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్షాల నేతలు పార్లమెంటులోని తమ చాంబర్‌లో భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాల మీద చర్చలు జరిపారు.

    అయితే గందరగోళం సృష్టించి, సభలు వాయిదా పడేలా చేయడం వల్ల విలువైన సమయం వృథా అవుతుందని ఈ విషయాన్ని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు గమనించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

    ఈ విషయంలో ప్రతిపక్షాల ఎంపీలు సైతం బాధపడుతున్నారని మోదీ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఏటీఎం నుంచి క్యాష్ కాదు గోల్డ్ కాయిన్స్ వస్తాయ్

    బేగంపేటలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను దేశంలోనే మొదటి గోల్డ్ కాయిన్ ఏటీఎంగా చెబుతున్నారు. దీన్నుంచి బంగారు నాణేలు తీసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియో చూడండి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  4. బట్టతల గురించి ఆ మూడు అపోహలేంటి, సైంటిస్టులు ఏం చెబుతున్నారు..?

  5. బ్రేకింగ్ న్యూస్, ఆర్‌బీఐ: రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంపు

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 6.25శాతానికి చేరింది.

  6. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయిన యువతి... కాపాడిన రైల్వే సిబ్బంది, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

    రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కు పోయిన యువతి

    ఫొటో సోర్స్, UGC

    దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతున్న సమయంలో శశికళ అనే యువతి రైలుకు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కు పోయింది.

    అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. గుంటూరు-రాయఘడ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన ఆ యువతి దువ్వాడ స్టేషన్‌లో రైలు ఆగుతున్న సమయంలో దిగేందుకు ప్రయత్నించింది.

    దిగుతూ ప్రమాదావశాత్తు ప్లాట్‌ఫాం, రైలు మధ్య శశికళ ఇరుక్కుపోయారు. దాదాపు గంటసేపు ప్రయత్నించి రైల్వే అధికారులు ఆ యువతిని బయటకు తీశారు.

    ప్రస్తుతం చికిత్స కోసం ఆ యువతిని గాజువాక ఆసుపత్రికి తరలించారు.

  7. పాకిస్తాన్ క్రికెటర్లకు ‘అనుమతి’ జారీ చేసిన భారత్

    పాకిస్తాన్ అంధ క్రికెట్ టీమ్‌కు చెందిన 34 మంది ప్లేయర్లకు భద్రతా పరమైన అనుమతులను కేంద్ర హోంశాఖ జారీ చేసింది.

    అయితే తాము సెక్యూరిటీ పరమైన క్లియరెన్స్ మాత్రమే ఇచ్చామని వారికి వీసాలు జారీ చేయడం అనేది కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ పరిధిలోని అంశమని తెలిపింది.

    ఈ నెల 17 వరకు భారత్‌లో అంధుల క్రికెట్ వరల్డ్‌ కప్-2022 జరగనుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకం గెలిచిన మీరాబాయి చాను

    ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి చాను వెండి పతకం గెలిచారు.

    స్నాచ్(87కిలోలు), క్లీన్ అండ్ జర్క్(113కిలోలు) కలిపి మొత్తం 200 కిలోలు ఆమె ఎత్తారు.

    చైనాకు చెందిన జియాంగ్ హీహువా 206 కేజీలు ఎత్తి బంగారు పతకం గెలుచుకున్నారు.

    ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మీరా బాయికి ఇది రెండో పతకం. 2017లో ఆమె బంగారు పతకం గెలిచారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  10. క్రయానిక్స్: మృత్యువును మోసం చేయడం ఎలా ?

  11. డ్రెస్‌కోడ్..వారానికోసారి ఇలా బట్టల్లేకుండా కాసేపు