పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లైవ్ కవరేజీ
బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ మీద భారత్ భారీ తేడాతో గెలుపు
ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 227 పరుగుల తేడాతో గెలిచింది.
410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 182 పరుగులకే ఆలవుట్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును ముందు నుంచే భారత బౌలర్లు దెబ్బ తీస్తూ వచ్చారు. దాంతో 182 పరుగులకే ఆ జట్టు అన్ని వికెట్లు కోల్పోయింది.
ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
ఫొటో సోర్స్, @Bhupendrapbjp
గుజరాత్ సీఎం కుర్చీలో భూపేంద్ర పటేల్ వరుసగా రెండోసారి కూర్చోనున్నారు.
ఈ మేరకు అహ్మదాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పలు పరిశీలకులుగా వెళ్లగా ఎమ్మెల్యేలంతా వారి సమక్షంలో భూపేంద్ర పటేల్‌నే సీఎంగా ఎన్నుకున్నారు.
పటేల్ మొన్నటి ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 1.92 లక్షల భారీ మెజారిటీతో గెలిచారు.
2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2021 సెప్టెంబరులో సీఎం పదవి చేపట్టారు.
అనంతరం తాజా ఎన్నికల్లో ఆయన రెండోసారి గెలిచి.. ఇప్పుడు మరోసారి సీఎం పదవి చేపడుతున్నారు.
రేబిస్‌ని రాబందులు ఎలా అడ్డుకుంటాయంటే
బ్రేకింగ్ న్యూస్, భారత్ X బంగ్లాదేశ్: విరాట్ కోహ్లీ సెంచరీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.
86 బంతుల్లో 104 పరుగులు తీశాడు. ఇందులో 1 సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి.
వన్డేలలో విరాట్ కోహ్లీకి ఇది 44వ సెంచరీ. మొత్తం మీద 72 సెంచరీలు పూర్తి చేశాడు.
బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు.
126 బంతుల్లోనే 200 పరుగులు తీశాడు. 10 సిక్సులు 24 ఫోర్లు కొట్టాడు.
ఇప్పటి వరకు భారత్ తరపున సచిన్ తెందూల్కర్, విరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేలలో డబుల్ సెంచరీలు చేశారు.
131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ సెంచరీ
ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ ఆతిథ్య జట్టుపై సెంచరీ సాధించాడు.
నేడు ప్రారంభమైన మూడో వన్డేలో, బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే, బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ అయిదో ఓఫర్‌లో మొదటి బంతికి శిఖర్ ధావన్‌ను ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ చేశాడు.
ఆ తరువాత విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు.
అప్పటికి ఇషాన్ కిషన్ 11 పరుగులు చేశాడు. భారత్ స్కోరు 15 పరుగుల వద్ద ఉంది. అక్కడి నుంచి ఇషాన్ కిషన్ చాలా జాగ్రత్తగా ఆడాడు.
13వ ఓవర్‌లో రెండో బంతికి అర్ధసెంచరీ పూర్తి చేసి, 24వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.
ఈ మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఇప్పటికే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు అయిదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.
తక్కువ ఖర్చులో బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, కొత్త టెక్నాలజీని రూపొందించిన స్టార్టప్
హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్, అనుచరులతో వచ్చి యువకుడి బీభత్సం
విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
ఫొటో సోర్స్, ANI
విజయవాడలో గులాబీరంగులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించాయని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
వాటిపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఉన్నాయి. ఈ కింది వాక్యాలు కనిపిస్తున్నాయి.
"దేశ రాజకీయాలలో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం
కక్ష రాజకీయాలకు స్వస్తి.. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా"
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.
పోస్ట్ of YouTube ముగిసింది
హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో శుక్రవారం యువతి కిడ్నాప్ ఘటన సంచలనం రేపింది.
దాదాపు 100 మంది ఇంట్లోకి చొరబడి 24 ఏళ్ల తమ కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లారని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు. అడ్డుకోబోయిన తమను దుండగులు కొట్టారని, ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు.
ఆ యువతిని పోలీసులు రక్షించారు. 8 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా మరికొందరు పరారీలో ఉన్నారని రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు చెప్పారు.
ఆ అమ్మాయి తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమయిందన్న కారణంతోనే ఆమెను నవీన్ రెడ్డి అపహరించారని స్థానికులు అంటున్నారు.
వైఎస్ షర్మిల హైదరాబాదులో తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.
లోటస్ పాండ్ వద్ద పోలీసులు చుట్టుముట్టారని, పార్టీ కార్యకర్తలను కూడా లోపలకు రానివ్వట్లేదని సమాచారం.
నిన్న బొల్లారం పోలీస్ స్టేషన్‌లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఫీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.
పాదయాత్రకి అనుమతి ఇచ్చి, అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపనని వైఎస్ షర్మిల చెబుతున్నారు.
పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"ఒక మహిళ 3500 కిమీ పాదయాత్ర చేస్తూ, ప్రజలకున్న సమస్యలు ఎత్తిచూపుతూ.. మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఎందుకివ్వలేదు, మైనారిటీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, అని మేం అడగడం తప్పా? ఇన్ని కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా? నర్సంపేటలో మేం ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే టీఆర్ఎస్ గూండాలే లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేశారు. మేం బాధితులం. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మా పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
"కేసీఆర్ మరోసారి నియంత అని నిరూపించుకున్నారు. గౌరవ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. న్యాయస్థానం అంటే కేసీఆర్‌కు గౌరవం లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడితే, మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
వైెెఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుల్ని విడుదల చేయండి. పాదయాత్రకు అనుమతి ఇవ్వండి. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు ఈ షర్మిల" అని ఆమె మీడియాతో అన్నారు.
షర్మిలకు అపోలో డాక్టర్ చంద్ర శేఖర్ వైద్య పరీక్షలు జరిపారు.
ఆమె మంచి నీళ్ళు కూడా తాగట్లేదని, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోందని, ఇదిలా కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ చంద్ర శేఖర్ చెప్పారు.
షర్మిలకు రక్తపరీక్షలు నివహించారని, సాయంత్రం మరో సారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీకున్న హక్కులు ఇవి...
ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
బోరుబావిలో 80 గంటలపాటు చిక్కుకున్న ఎనిమిదేళ్ల తన్మయ్ సాహు ప్రాణాలు విడిచాడు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో అద్నైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ అజయ కుమార్ సోనీ బాలుడు చనిపోయాడన్న విషయాన్ని ధృవీకరించారు.
"మాండ్వి ప్రాంతంలో బాలుడు బోరుబావిలో పడిన దగ్గర నుంచి, అతడిని రక్షించడానికి స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. బోరుబావికి సమాంతరంగా గుంట తవ్వి తెల్లవారు జామున 5.30 గంటలకి మా బృందాలు బాలుడిని చేరుకోగలిగాయి" అని ఇన్‌స్పెక్టర్ అజయ కుమార్ బీబీసీతో చెప్పారు.
రెస్క్యూ బృందాలు బాలుడి వద్దకు చేరుకునే సమయానికి, బాబు స్పృహ కోల్పోయి ఉన్నాడని, వెంటనే బేతుల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
అక్కడకు తీసుకెళ్లేసరికే బాబు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
గత నాలుగు రోజులుగా రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గుంట తవ్వి బాబును చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది.
ఆ ప్రాంతంలో భూమి అడుగున బాగా రాళ్లు ఉండడంతో గుంట తవ్వడం ఆలస్యమైందని హోమ్ గార్డ్స్ కమాండంట్ ఎస్ ఆర్ అజ్మి మీడియాతో చెప్పారు.
భారత్ X బంగ్లాదేశ్: 227 పరుగుల తేడాతో టీం ఇండియా గెలుపు
హెమ్‌జెనిక్స్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్ ఇది, దేనికి వాడతారు, ధర ఎంత?
స్టేటస్ సింగిల్: ‘ఎస్..మేం ఒంటరివాళ్లం’ అని గర్వంగా చెప్పుకునే మహిళల సంఖ్య భారత్‌లో పెరుగుతోందా?
గంగిరెద్దులను ఆడించేవారి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి...
పేగు క్యాన్సర్ గుర్తించడమెలా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?