పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లైవ్ కవరేజీ

  1. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి, కీరవాణి, ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి

  2. తమిళనాడు: తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం

  3. ఫాదర్ స్టాన్ స్వామీ ల్యాప్‌టాప్‌లో తప్పుడు ఆధారాలు ఉంచారా? అమెరికా సంస్థ ఏం చెబుతోంది?

    ఫాదర్ స్టాన్ స్వామీ

    ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామీ ల్యాప్‌టాప్‌లో హ్యాకర్ల సాయంతో కొన్ని ‘ఆధారాల’ను ఉంచినట్లు అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ వెల్లడిచింది.

    వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం... ‘భీమీ కోరేగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామీకి వ్యతిరేకంగా కొన్ని పత్రాలను హ్యాకర్లు ఆయన ల్యాప్‌టాప్‌లో ఉంచారని ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ తెలిపింది. మొత్తం 44 డాక్యుమెంట్లు ల్యాప్‌టాప్‌లో ఉంచారు. మావోయిస్టులకు ఫాదర్ స్టాన్ స్వామీ రాసినట్లుగా చెబుతున్న లెటర్ కూడా వాటిలో ఒకటి.’

    గతంలో కూడా ఆర్సెనల్ కన్సల్టింగ్ ఇలాంటి ఆరోపణలే చేసింది.

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామీ(84) ఈ ఏడాది జులైలో కస్టడీలోనే చనిపోయారు.

  4. బ్రేకింగ్ న్యూస్, వైఎస్ షర్మిల పాదయాత్రకు హై కోర్టు అనుమతి

    తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చింది.

    తనను పాదయాత్ర చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ తాజాగా ఆమె ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు.

  5. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు జైలు శిక్ష, జరిమాన

    ఆంధ్రప్రదేశ్ హై కోర్టు... టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమాన విధించింది.

    ముగ్గురు ఉద్యోగుల రెగ్యులైజేషన్ మీద కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నెల రోజులు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హై కోర్టు తీర్పునిచ్చింది.

  6. కేరళ‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఈ ఇరాన్ మహిళా నిర్మాత జుట్టు కత్తిరించి పంపించారు ఎందుకు

  7. కింజరాపు రామ్మోహన్నాయుడు: ‘విశాఖ స్టీలు ప్లాంటులో నియామకాలు ఎందుకు ఆపేశారు?’

    కింజరాపు రామ్మోహన్నాయుడు

    ఫొటో సోర్స్, SANSAD TV - LOK SABHA/YouTube

    విశాఖపట్నం(దక్షిణ కోస్తా) రైల్వే జోన్‌కు పూర్తి నిధులు కేటాయించాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కోరారు.

    లోక్‌సభలో మాట్లాడిన ఆయన వాల్తేరు డివిజన్‌ను మూసివేయకుండా దాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. వాల్తేరు డివిజన్ దేశంలోనే ఎక్కువగా లాభాలు ఆర్జించే వాటిలో ఒకటని ఆయన తెలిపారు.

    ‘విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం మీద కేంద్రం మరొకసారి ఆలోచించాలి. ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించాక నియామకాలు, ప్రమోషన్లు వంటివి నిలిపి వేశారు. వాటిని ఆపాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు.

  8. సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వ‌కీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి

  9. వైఎస్ షర్మిల: ‘పోలీసులు నన్ను హై కోర్టుకు వెళ్లనివ్వడం లేదు’

    పాదయాత్ర కోసం తెలంగాణ హై కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులు తనను అనుమతించడం లేదని వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.

    ‘మేం హై కోర్టుకు వెళ్తాం. కానీ కోర్టుకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు అడ్డుకుంటున్నారు. ఇది తాలిబానా? లేక అఫ్గానిస్తానా?’ అని షర్మిల అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. గత ఆర్థికసంవత్సరంలో రూ.1.74 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్

    గత ఆర్థికసంవత్సరం(2021-22)లో రూ.1,74,966 కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    రైటాఫ్ చేసిన రుణాలలో రూ.33,534 కోట్లు రివకరీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తెలిపిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయక మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. అమిత్ షా: ‘చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు తీసుకున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్’

    రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ రూ.1.35 కోట్లు ఇచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.

    ‘2005-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకే హోంశాఖ ఆ ఫౌండేషన్ మీద ఆంక్షలు విధించింది. ఈ విషయం చర్చకు రాకుండా ఉండేందుకు భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ మీద పార్లమెంటులో రాద్ధాంతం చేసింది’ అని అమిత్ షా మీడియాతో అన్నారు.

    ఇటీవల రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కున్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

    నేడు పార్లమెంటులోని క్వశ్చన్ అవర్‌లో దీని మీద చర్చ ఉందని, దీని నుంచి కాంగ్రెస్ తప్పించుకునేందుకు ఆ పార్టీ పార్లమెంటులో గందరగోళం సృష్టించిందని అమిత్ షా విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ‘సలాం హారతి’ పేరు మార్పు వివాదం ఏమిటి? హిందూ దేవాలయాల్లో టిప్పు సుల్తాన్ దీన్ని ప్రవేశపెట్టారా

  13. ఆంధ్రప్రదేశ్: ‘వృద్ధాప్య పెన్షన్ రూ.2,750కి పెంపు’

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్

    ఫొటో సోర్స్, YSRCP Social Media/Facebook

    వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మొత్తం 62.31 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు.

    జిందాల్ స్టీల్‌తో కలిసి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఏపీ జ్యూడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీ‌ వంటి ఇతర నిర్ణయాలు కూడా కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు.

  14. చైనా విదేశాంగశాఖ: భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉంది

    చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్

    ఫొటో సోర్స్, EPA

    భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ప్రకటించారని వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

    ఈ నెల 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది.

  15. అరుణాచల్ ప్రదేశ్‌: 'చైనా సైన్యం వాస్తవాధీన రేఖ మీదకు వచ్చింది.. మన సైన్యం తిప్పికొట్టింది'

  16. గ్రీన్‌ల్యాండ్ ఆదివాసీ మహిళలు: ‘నా అనుమతి లేకుండానే నాకు గర్భం రాకుండా చేసేశారు.. ప్రతీసారి నెలసరి వచ్చినా గర్భవతి అయ్యే దాన్ని కాదు’

  17. అరుణాచల్‌: 'తవాంగ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ఎవరూ చనిపోలేదు' - రాజ్‌నాథ్‌ సింగ్‌

    రాజ్‌నాథ్‌ సింగ్‌

    ఫొటో సోర్స్, sansad tv

    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో మాట్లాడారు.

    "2022 డిసెంబర్ 9న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సేలో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కానీ భారత సైన్యం వారిని అడ్డుకుంది. ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. మనవైపు సైనికులు ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. భారత సైనిక కమాండర్లు సకాలంలో జోక్యం చేసుకోవడంతో, చైనా సైన్యం వెనక్కు మళ్లింది" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ సభకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    "డిసెంబరు 9న, చైనాకు చెందిన పీఎల్ఏ దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్సే వద్ద వాస్తాధీన రేఖను ఆక్రమించాయి. స్టేటస్ కో మార్చడానికి ప్రయత్నించాయి. మన దళాలు దీన్ని తిప్పికొట్టాయి. పీఎల్ఏ మన భూభాగంలోకి చొరబడకుండా నిలువరించాయి. వారిని వెనక్కు మళ్లేలా చేశాయి" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    "ఈ ఘటన తరువాత డిసెంబర్ 11న ఏరియా స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, ఈ ఘటనపై చర్చించారు. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్దారన్న వాదనలను తిరస్కరించింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించమని చెప్పింది" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    అంతకుముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం మన భూభాగంలో ఒక అంగుళం భాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు.

    "డిసెంబర్ 8-9 మధ్య రాత్రి (అరుణాచల్ ప్రదేశ్‌లో) మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమాన్ని అభినందిస్తున్నాను" అని అమిత్ షా అన్నారు.

  18. పాకిస్తాన్: 'అమ్మాయిలు సైకిల్ తొక్కడం ‘అశ్లీలం’, మత సంప్రదాయాలకు విరుద్ధం, ఇస్లాం ప్రమాదంలో పడుతోంది'

  19. రాజస్థాన్: ఒకే కోచింగ్ సెంటర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య

    రాజస్థాన్

    ఫొటో సోర్స్, Getty Images

    మోహర్ సింగ్ మీణా

    బీబీసీ కోసం

    రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వీరిలో ఇద్దరు విద్యార్థులు బిహార్‌కు చెందినవారు కాగా, ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.

    "ముగ్గురూ అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే. ఇద్దరు విద్యార్థులు కోటాలో తల్వండి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) 'కృష్ణ కుంజ్‌'లో ఉంటున్నారు. పీజీలోని రెండు వేర్వేరు గదుల్లో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఒకరు బిహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందిన అంకుష్ ఆనంద్ కాగా, మరొకరు బిహార్‌లోని గయా జిల్లాకు చెందిన ఉజ్వల్ కుమార్. ఇద్దరికీ సుమారు పదిహేడేళ్లుంటాయి. ఉజ్వల్‌కుమార్‌ ఇంజినీరింగ్‌కు ప్రిపేర్‌ అవుతుండగా, అంకుష్‌ నీట్‌కు సిద్ధమవుతున్నాడు" అని కోటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసర్ సింగ్ షెకావత్ బీబీసీతో చెప్పారు.

    "కున్హాడీ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న 17 ఏళ్ల ప్రణవ్ వర్మ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మధ్యప్రదేశ్‌లోని శివపురి నివాసి. కోటాలో ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు" అని ఎస్పీ చెప్పారు.

    ఉజ్వల్ కుమార్ ఇద్దరు అక్కలు కోటలోనే ఉంటున్నారని, వారు ఉజ్వల్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా, స్పందించకపోవడంతో ఆత్మహత్య విషయం తెలిసిందని ఎస్పీ తెలిపారు.

    రాజస్థాన్‌

    ఈ నేపథ్యంలో, ఎస్పీ కేసర్ సింగ్ షెకావత్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, పీజీ లేదా హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో ఈ కమిటీ విచారించనుంది. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అనే అంశంపై దర్యాప్తు చేయనున్నారు.

    ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య వ్యవహారంలో ఇన్‌స్టిట్యూట్ ఏమీ మాట్లాడకుండా తప్పించుకుంటోంది. అయితే, ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ఒక వ్యక్తి బీబీసీతో మాట్లాడారు. ఆయన, తన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

    "పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఈ ముగ్గురు పిల్లలూ మా ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారు. కోటాలో రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటే, లక్షన్నర మంది విద్యార్థులు అలెన్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదువుతున్నారు" అని ఆయన చెప్పారు.

  20. వాంగ్ వెన్బిన్: భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ‘సాధారణం’గానే ఉంది