పవన్ కల్యాణ్: ‘వారాహి ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది’ అంటూ పవన్ ట్వీట్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ఫొటోలు, వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

లైవ్ కవరేజీ

  1. అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి, ఆలోచించడానికి కూడా మాకు అనుమతి ఉండదు’

  2. ‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో దాచుకుంటున్నారు’

  3. బ్రేకింగ్ న్యూస్, దిల్లీ లిక్కర్ కేసు: ముగిసిన కవిత సీబీఐ విచారణ

    కల్వకుంట్ల కవిత

    ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook

    దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ ఎం.ఎల్.సీ కల్వకుంట్ల కవితను, సీబీఐ అధికారులు ప్రశ్నించడం అయిపోయింది.

    సుమారు ఏడు గంటల పాటు కవితను ప్రశ్నించిన అధికారులు ఇప్పుడే ఆమె నివాసం నుంచి వెళ్లిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు

  5. కొండా సురేఖ: తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా

    కొండా సురేఖ

    ఫొటో సోర్స్, Facebook/Konda Surekha

    తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

    తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు స్థానం లభించకపోవడం మనస్తాపం కలిగించిందని ఆమె తన రాజీనామా లేఖలో రాశారు. అలాగే వరంగల్ నుంచి ఏ ఒక్క నేతకూ రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు లేకపోవడం బాధించిందని తెలిపారు.

    అందువల్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపిన లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు.

  6. ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు.. ట్రక్ నడుపుతూ అందరినీ పోషించిన 75 ఏళ్ల అబ్దుల్ మజీద్ మృతి

  7. డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు

  8. బట్టతల గురించి ఆ మూడు అపోహలేంటి, సైంటిస్టులు ఏం చెబుతున్నారు..?

  9. పని కోసం ఖతార్‌‌ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి

  10. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    వందే భారత్

    ఫొటో సోర్స్, @nitin_gadkari

    నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపారు.

    ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కూడా హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అనంతరం ప్రధానమంత్రి నాగపూర్‌లోని ఫ్రీడం పార్క్ మెట్రో స్టేషన్‌ను సందర్శించారు.

    మెట్రోలో ప్రధాని విద్యార్థులతో, ఇతర ప్రయాణికులతో సంభాషించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  11. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు కవితను ప్రశ్నిస్తోన్న సీబీఐ

    కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
    ఫొటో క్యాప్షన్, కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, కవిత నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం సమావేశం కావడానికి సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

    కవిత ఇంటి ముందు పోలీసులు

    దిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన వివాదంలో కవిత పేరును బీజేపీ నాయకులు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

    కాగా, కేసీఆర్ జాతీయ స్థాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే ఈ కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

  12. దిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన కవిత సీబీఐ విచారణ

  13. మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

  14. గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు కూడా బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?

  15. ఏనుగుపై వచ్చిన పెళ్లికూతురు

  16. హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా?

  17. డి.సురేశ్ బాబు: ఆర్ఆర్ఆర్‌ను తమిళనాడులో రిలీజ్ చేసినప్పుడు... అక్కడి హీరోలు నొచ్చుకున్నారు

    దగ్గుబాటి సురేష్ బాబు

    ఫొటో సోర్స్, FACEBOK/SURESH BABU

    తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల వివాదం మీద నిర్మాత డి.సురేశ్ బాబు స్పందించారు.

    దిల్ రాజు తమిళ్‌లో ‘వరీసు’ అనే సినిమాను నిర్మించారు. విజయ్‌ కథానాయకునిగా నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

    ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం మీద కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు.

    డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు అన్నీ ఇస్తే తెలుగు సినిమాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం చాలా కాలంగా నడుస్తోంది.

    నటుడు వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డి.సురేశ్ బాబు, డబ్బింగ్ సినిమాల వివాదం మీద స్పందించారు.

    ‘మన పుష్ప, బాహుబలి సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేశారు కదా. డబ్బింగ్ సినిమాల సమస్య నిరంతరం ఉండేదే. ఇప్పుడు సినిమాకు సరిహద్దులు లేవు. కేజీఎఫ్, కాంతారా సినిమాలకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది.

    ఇలాంటప్పుడు చిన్నచిన్న అడ్డంకులు వస్తాయి.

    జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను తమిళనాడులోని అన్ని థియేటర్లలో విడుదల చేశారు. అప్పుడు తమిళ హీరోలు కూడా నొచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ అనేది ఏంటో కూడా అంతవరకు తమిళ వాళ్లకు తెలియదు. మరి ఆరోజు మనం మాట్లాడ లేదు కదా?

    అవతార్ సినిమా హీరో ఎవరో మనకు తెలియకపోయినా ఊర్లోని అన్ని థియేటర్లు దానికి ఇచ్చేశాం. ఇది ఇలాగే జరుగుతుంది. దాన్ని మనం అంగీకరించాల్సిందే.

    హీరో ఫ్యాన్స్‌కు, సినిమా ప్రొడ్యూసర్‌కు కొంచెం బాధ ఉంటుంది. నా సినిమాకు మరిన్ని థియేటర్లు వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇలాంటి సమస్యలకు ఒక కచ్చితమైన పరిష్కారం రావడం కష్టం.

    ఇక్కడ డిస్ట్రిబ్యూటరే ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆయన(దిల్ రాజు)కు థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తెరల మీద సినిమాను విడుదల చేస్తున్నారు.

    ఇతర భాషల్లో తెలుగు సినిమాను ఎవరూ చిన్న చూపు చూడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాగానే ఆడాయి. ఒకప్పుడు చులకనగా చూసిన కన్నడ సినిమాలను నేడు మనం తెచ్చుకుంటున్నాం.

    చివరకు కంటెంటే ముఖ్యం. ఒకప్పుడు శివ, అరుంధతి సినిమాలు కూడా తమిళనాడులో బాగా ఆడాయి.

    థియేటర్లు దొరకడం లేదనేది పెద్ద సమస్య కాదు. ఇది మెల్లగా సర్దుకుంటుంది’ అని ఆయన అన్నారు.

  18. మన్నెగూడ కిడ్నాప్: సినిమా తరహాలో యువతి అపహరణ, ఏమిటీ కేసు?

  19. ‘రేసు గుర్రం మద్దాలి శివారెడ్డి’ మీద సోషల్ మీడియాలో విమర్శలెందుకు

  20. హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి