You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి
సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.
లైవ్ కవరేజీ
జీ20: మధ్యలో వెళ్లిపోయిన రష్యా విదేశాంగ మంత్రి
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ జీ20 సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించింది.
ఆయన ఇండోనేషియా నుంచి రష్యాకు బయలుదేరారు.
జీ20 సమావేశాలు రేపు ముగియనున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా దాడులు
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు ఇతర పట్టణాల మీద రష్యా మిసైల్స్‌తో దాడి చేసిందని ఆ దేశ అధికారులు తెలిపారు.
- రష్యా సుమారు 70 బాలిస్టిక్ మిసైల్స్‌ను యుక్రెయిన్ మీద లాంచ్ చేసినట్లు రక్షణశాఖ తెలిపింది.
- కీయేవ్‌లోని రెండు పౌర నివాసాలను మిసైల్స్ ఢీ కొట్టినట్లు నగర మేయర్ తెలిపారు.
- లెవివ్‌లో కూడా పేలుడు శబ్దాలు విన్నట్లు ఆ నగర మేయర్ వెల్లడించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లు తెలిపారు.
జీ20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు యుక్రెయిన్ మీద దాడులు జరుగుతున్నాయి.
జీ20 సమావేశాల్లో చాలా దేశాల అధినేతలు యుక్రెయిన్ మీద రష్యా దాడిని ఖండించారు.
జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయారా’ లేక ‘మోసపోయినట్లు నటించారా’?
ఎనిమిది నెలలుగా రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్‌లో ప్రజల జీవితం ఇప్పుడు ఎలా ఉంది?
తూర్పు గోదావరి జిల్లాలో కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు మృతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లోని దేవరపల్లి మండలం గౌరీపట్నంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తూ కెమికల్ ట్యాంకర్ పేలింది.
మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించారు.
ఒక్కసారిగా పేలుడు సంభవించి, మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దాంతో విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ సిబ్బంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలాన్ని తూర్పు గోదావరి జిల్లా అధికారులు సందర్శించారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతామని తెలిపారు.
కార్మికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టమ్ అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రమాద కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
ప్రాధమిక దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని మీడియాకు తెలిపారు.
ఇటీవల వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం ఆందోళనగా మారుతోంది.
నెల రోజుల క్రితం కాకినాడలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఐదుగురు కార్మికులు మరణించారు.
నాలుగు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు మూలంగా ముగ్గురు చనిపోయారు.
తాజాగా ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
వివిధ పరిశ్రమల్లో భద్రత మీద యంత్రాంగం దృష్టి సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ విజన్ డ్రగ్ పరిశ్రమ వద్ద ఆందోళన నిర్వహించాయి.
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
బిర్సా ముండా: ఈ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడి స్వగ్రామం ఎలా ఉంది, ఆయన వారసులు ఏం చేస్తున్నారు?
తూర్పు గోదావరి: కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు మృతి
తూర్పు గోదావరి జిల్లాలోని విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మార్గదర్శి కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ అధికారుల సోదాలు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు విజయవాడ సహా పలు కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలకు పూనుకున్నారు. రికార్డులు పరిశీలిస్తున్నారు. మార్గదర్శి సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు.
స్టాంప్ట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సోదాలకు దిగారు.
రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం చర్చనీయాంశం అవుతోంది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు.
ఆ కేసులను 2018 చివరిలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టేయడంతో దానిపై ఉండవల్లి సుప్రీంకోర్టుకి వెళ్లారు.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవుతూ మొన్నటి సెప్టెంబర్ లో పిటీషన్ వేసింది.
ఈనాడు గ్రూపునకు చెందిన రామోజీరావు చైర్మన్ గా, ఆయన కోడలు శైలజ ఎండీగా ఉన్న మార్గదర్శి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. పలు బ్రాంచీలు నిర్వహిస్తోంది.
అయితే మార్గదర్శి చిట్స్ నుంచి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించారన్నది ఫిర్యాదు.
అంతేగాకుండా మార్గదర్శి పేరుతో చిట్స్ నిర్వహణకు కూడా చట్టం ప్రకారం అనుమతి లేదని ఉండవల్లి సహా పలువురి వాదన.
ఈ నేపథ్యంలో మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ఏపీ ప్రభుత్వం ఆసంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం కీలక పరిణామంగా కనిపిస్తోంది.
క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి?
కొత్తిమీర: భారతదేశపు వంటల్లో మకుటం లేని మహారాణి
కృష్ణ: జయప్రద, విజయనిర్మలతోనే అత్యధిక సినిమాలు
పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు... 18 రోజుల తరువాత దిల్లీ సిటీలో విసిరేశాడు
గని ప్రమాదంలో 8 మృతదేహాల వెలికితీత
మిజోరంలోని హంహథియాల్ జిల్లా మౌదర్ గ్రామంలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు.
సోమవారం ప్రమాదం జరిగిన తరువాత, బీఎస్ఎఫ్ రెస్క్యూ టీమ్ ఫస్ట్ రెస్పాన్స్ యూనిట్‌గా సంఘటనా స్థలానికి చేరుకుంది.
మిజోరాం విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ అదనపు కార్యదర్శి లాల్ హరియత్‌పుయా సోమవారం మాట్లాడుతూ గని కూలిన సమయంలో దాదాపు 15 మంది ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు.
మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు గనిలో పనిచేస్తున్నారు.
G20: ‘నేటి ఎరువుల కొరత రేపటి ఆహార కొరత’- సదస్సులో భారత ప్రధాని మోదీ హెచ్చరిక
పదిహేడవ జీ20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహార, ఇంధన భద్రత సెషన్‌లో పాల్గొంటున్నారు.
“కోవిడ్ తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించే బాధ్యత మనపై ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు ఒక దృఢమైన సంకల్పాన్ని ప్రకటించడం, కలిసి రావడం తక్షణావసరం. ప్రపంచదేశాలనేతలు ప్రస్తుతం బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలపై ఉన్నారు. వీరంతా ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
రష్యా-యుక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి దౌత్యమార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
నేటి ఎరువుల కొరత రేపటి ఆహార సంక్షోభమని, దీనికి ప్రపంచం పరిష్కారంలేదని ప్రధాని మోదీ అన్నారు. ఎరువులు, ఆహార ధాన్యాల సరఫరా గొలుసును స్థిరంగా ఉంచేలా ప్రపంచ దేశాలు మధ్య ఒప్పందాలు జరగాలని ప్రధాని అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినందున, ప్రపంచ అభివృద్ధికి భారతదేశ ఇంధన భద్రత కూడా చాలా ముఖ్యమని మోదీ అన్నారు.
మోదీ - బైడెన్
ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన భారత ప్రధానమంత్రి మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలకరించారు. వారిద్దరు సమావేశం ప్రారంభానికి ముందువీరిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.
అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ కూడా ప్రధానితో మాట్లాడారు.
కంబోడియా ప్రధానికి కరోనా వైరస్
ఈ సదస్సులో పాల్గొనడానికి బాలీకి వచ్చిన కంబోడియా ప్రధాని హున్ సేన్ మంగళవారం నాడు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.
అంతకు ముందు ఆయన కంబోడియాలోని నామ్‌ఫెన్‌లో జరిగిన ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలు ప్రపంచదేశాల నేతలు పాల్గొన్నారు.
సోమవారం రాత్రి తనకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారని, వైద్యులు దీన్ని ధృవీకరించారని ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో హున్‌సేన్ పేర్కొన్నారు.
తాను తిరిగి కంబోడియాకు వస్తున్నానని, బ్యాంకాక్‌లో జరగనున్న జీ20 సదస్సు, ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సమావేశంలో పాల్గొనబోనని సేన్ చెప్పారు.
ఆదివారం ముగిసిన ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సదస్సుకు కంబోడియా ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ సేన్ పలువురు నేతలను కలిశారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్.. ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు
యుక్రెయిన్ x రష్యా: కీయేవ్ మీద మిసైల్స్ దాడిలో ఒకరు మృతి
‘సూపర్ స్టార్’ కృష్ణ: తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు
ఆయన్ను చూశాకే కృష్ణ హీరో కావాలనుకున్నారు.. అనుకున్నట్లే అయ్యారు