పురుషుల టీ20
ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్
క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.
టాస్ గెలిచిన
ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఐదు ఓవర్లు
ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది.
మొహమ్మద్
రిజ్వాన్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.
బాబర్ వజీమ్ (11),
మొహమ్మద్ హారిస్ (0) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్‌లో భారత జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
దానికిముందు మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు వచ్చింది.
రెండు జట్లూ సెమీ ఫైనల్స్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లతోనే ఫైనల్‌లో తలపడుతున్నాయి.
పాకిస్తాన్ జట్టు: మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మొహమ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హఆరిస్ రవూఫ్
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్.