You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరబిందో ఫార్మా ఎండీ అరెస్ట్?

    దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22, మనీ లాండరింగ్ కేసులో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

    వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపనీలో కీలక డైరెక్టర్ స్థానంలో కొనసాగుతున్నారు.

    గతంలోనూ పలుమార్లు ఆయనను ఈడీ ప్రశ్నించింది.

    హైదరాబాద్, దిల్లీ నగరాల్లోని శరత్ చంద్రారెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

    అరెస్ట్ చేసిన ఇద్దరిని ఈరోజు మద్యాహ్నం ఈడీ కోర్టులో హాజరుపరచనున్నట్టుగా సమాచారం.

  2. తాడేపల్లిగూడెం మండలంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు – ముగ్గురు మృతి

  3. టీ20 వరల్డ్ కప్: భారత్-ఇంగ్లండ్ మధ్య గత 20 ఏళ్ళలో జరిగిన 5 థ్రిల్లింగ్ మ్యాచ్‌లు

  4. సీఓపీ27: వాతావరణానికి మేలు చేసే జీవన విధానం ఎలా ఉంటుంది... అది భారత్‌కు సాధ్యమవుతుందా?

  5. సూర్యకుమార్ యాదవ్: 11ఏళ్ల నిరీక్షణ తర్వాత సూపర్ బ్యాట్స్‌మన్‌గా ఎలా విజృంభిస్తున్నాడు?

  6. ఊళ్లోకి వచ్చిన చిరుత ఓ కుక్క వెంట పడి, బైక్‌పై పంజా విసిరి, నానా బీభత్సం సృష్టించింది

  7. కులాల మధ్య పోరే ఇప్పటంలో వివాదానికి కారణమా?

  8. రాజాసింగ్‌ విడుదల

    గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు తెలంగాణ హైకోర్ట్ షరతులతో కూడిన విడుదల ఆదేశాలు మంజూరు చేసింది.

    ఆయనపై నమోదైన పీడీ యాక్ట్‌ను ఎత్తివేసింది.

    స్టాండింగ్ కమేడియన్ మునావర్ ఫారూకీ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయనపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు.

    ఆ తర్వాత రాజాసింగ్ బీజేపి నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.

    ఆగస్ట్ 25 నుంచి రాజాసింగ్ జైలులో ఉన్నారు.

    రాజాసింగ్ ను విడుదల చేయాలని, పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు.

    దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులతో రాజాసింగ్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.

    రాజాసింగ్ విడుదలయ్యే సందర్భంలో న్యాయవాది సహా అతని కుటుంబ సభ్యులు నలుగురికి మించి జైలు వద్దకు రావొద్దని, విడుదల సందర్భంగా ఎలాంటి ర్యాలీలు , సభలు ఏర్పాటు చేయొద్దని, మీడియాతో మాట్లాడవద్దని, భవిష్యత్తులో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, కామెంట్లను సోషల్ మీడియాలో పెట్టకూడదని హైకోర్ట్ షరతులు విధించింది.

  9. భారత్‌కు తనను అప్పగించొద్దన్న నీరవ్ మోదీ పిటిషన్ కొట్టివేసిన లండన్ కోర్ట్

    బ్రిటన్‌కు పారిపోయిన భారత వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అక్కడి ఓ కోర్టు కొట్టివేసింది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు రూ. 11 వేల కోట్ల మేర మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నీరవ్ మోదీ.

    ఈ కేసులో విచారణ నుంచి తప్పించకునేందుకు ఆయన బ్రిటన్ పారిపోయారు.

    కాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు.

    ఈ తీర్పును సవాల్ చేస్తూ లండన్‌లోని హై కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశారు.

    ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు.

    ఈ పరిణామాలపై నీరవ్ న్యాయవాదుల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, నీరవ్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది.

  10. ట్రోలింగ్‌పై రష్మిక మందన్న: ‘నన్ను అందరూ ఇష్టపడరని తెలుసు... ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అనుకోను...’

  11. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్: ‘బోనులోని పులులు బయటకు వచ్చాయి’

  12. ఆకాశంలో ఆర్మీ జవాన్ ప్రాణాలు కాపాడిన కేరళ నర్స్

  13. బ్రేకింగ్ న్యూస్, బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్‌కు బెయిల్

    బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌కు బెయిల్ లభించింది.

    కొద్ది నెలల కిందట మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.

    మహ్మద్ ప్రవక్త మీద ఆయన చేసి వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ తెలిపింది.

    కొంతకాలంగా ఆయన జైలులో ఉన్నారు.

    కొన్ని షరతులతో ప్రస్తుతం ఆయనకు బెయిల్ లభించింది.

  14. ‘‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’’ – చావ్లా రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దేశంలో దిగ్భ్రాంతి, ఆగ్రహం

  15. చైనా: ‘యుద్ధానికి సిద్ధమవ్వండి’... సైన్యానికి షీ జిన్‌పింగ్ ఆదేశం

    ‘యుద్ధానికి సిద్ధంగా’ ఉండాలంటూ తన సైన్యాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    చైనా జాతీయ భద్రతకు ప్రమాదం పెరుగుతోందని అన్న షీ జిన్‌పింగ్, ‘శక్తి సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. యుద్ధం చేయండి’ అంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పిలుపునిచ్చారు.

    69 ఏళ్ల షీ జిన్‌పింగ్ ఇటీవలే మూడోసారి చైనా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

    యుద్ధానికి సిద్ధమయ్యేందుకు చైనా సైన్యం మొత్తం పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుందని ఆయన అన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా షిన్హువా తెలిపింది.

    తైవాన్‌తో ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  16. అమెరికా ఎన్నికలు: డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ మధ్య హోరాహోరి పోటీ

    అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.

    హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 198 సీట్లు వారు గెలుచుకున్నారు.

    డెమోక్రాట్లు 173 సీట్లలో గెలిచారు.

    హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మెజారిటీ రావాలంటే 218 సీట్లు గెలవాలి.

    ఇక సెనేట్ విషయంలో పోటీ హోరాహొరిగా ఉంది.

    డెమోక్రాట్లు 48 సీట్లు గెలవగా రిపబ్లికన్లు 47 స్థానాలు కైవసం చేసుకున్నారు.

    సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లను కలిపి అమెరికా కాంగ్రెస్ అంటారు.

  17. 175 ఏళ్ళ నాటి ఆస్పత్రి భవనం కింద బయటపడిన సొరంగం

  18. బెంగళూరు ఎయిర్‌పోర్ట్: రూ.5 వేల కోట్లతో టెర్మినల్-2... 11న ప్రారంభించనున్న మోదీ

    బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన టెర్మినల్-2‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న ప్రారంభించనున్నారు.

    సుమారు రూ.5 వేల కోట్లతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు.

    ప్రయాణికులకు గార్డెన్‌లో నడుస్తున్నామనే భావన కలిగేలా ఈ టెర్నినల్‌ను డిజైన్ చేశారు.

    టెర్మినల్-2 అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించొచ్చు. ఏడాదికి 6 కోట్ల వరకు ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ హ్యాండిల్ చేయగలదని భావిస్తున్నారు.

    ఈ ఎయిర్‌పోర్టులో 100శాతం పునరుత్పాదక వనరుల నుంచి వచ్చిన విద్యుత్‌నే వాడుతున్నారు. టెర్మినల్-2ను కూడా ఇదే విధానంలో డెవలప్ చేశారు.

  19. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

    భారత సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి బాధ్యతలు చేపట్టారు.

    ఈమేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

    2016 మేలో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. గతంలో అలహాబాద్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.

  20. రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... విశాఖపట్నం వెళ్లే కొన్ని రైళ్లు రద్దు

    తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

    దీంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను పూర్తిగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.

    రద్దు

    12718: విజయవాడ-విశాఖపట్నం

    12717: విశాఖపట్నం-విజయవాడ

    17239: గుంటూరు-విశాఖపట్నం

    17240: విశాఖపట్నం-గుంటూరు

    22701: విశాఖపట్నం-విజయవాడ

    22702: విజయవాడ-విశాఖపట్నం

    07628: విజయవాడ-గుంటూరు

    07864: గుంటూరు-విజయవాడ

    17257: కాకినాడ పోర్ట్-విజయవాడ

    పాక్షికంగా రద్దు

    17258: కాకినాడ పోర్ట్-విజయవాడ

    కాకినాడ టౌన్-విజయవాడ మధ్య రద్దు చేశారు.

    07768: విజయవాడ-రాజమండ్రి

    తాడేపల్లిగూడెం-రాజమండ్రి మధ్య రద్దు చేశారు.

    ఆలస్యం

    12805: విజయవాడ-లింగంపల్లి

    రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.