You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?

  2. విశాఖపట్నం దగ్గర్లో ‘బాహుబలి’ జలపాతం

  3. 140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది

  4. ఉత్తరాఖండ్‌: జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్

  5. మునుగోడులో టీఆర్ఎస్ విజయం, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

  6. జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆ షాట్లు ఎలా కొట్టగలిగాడు?

  7. బ్యాంకుల్లో టీటీడీ నగదు డిపాజిట్లు రూ.15938 కోట్లు, బంగారం డిపాజిట్లు 10258 కేజీలు

    తిరుమల తిరుపతి దేవస్థానం నగదు, బంగారాన్ని ఏఏ బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ చేశామో వెల్లడిస్తూ టీటీడీ బోర్డు శ్వేత పత్రం విడుదల చేసింది.

    2022 సెప్టెంబర్ 30 తేదీ నాటికి 24 బ్యాంకులు, ఫైనాన్స్ కార్పొరేషన్లు, బాండ్లలో రూ.15398.68 కోట్లు డిపాజిట్ అయ్యాయి.

    అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5358.11 కోట్లు ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో 2122.85 కోట్లు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో కూడా వెయ్యి కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.

    బంగారం డిపాజిట్ల విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9819.38 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీలు బంగారం డిపాజిట్ అయ్యింది.

  8. బ్రిటన్‌ ప్రజలు కొత్త బట్టల కంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు?

  9. నలుగురు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిని కర్రలు, పైపులతో కొట్టిన వీడియో వైరల్... అసలేం జరిగింది?

  10. టీ20 వరల్డ్ కప్: సెమీ పైనల్స్‌కు చేరిన భారత్, పాకిస్తాన్... బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం

  11. పుట్టగొడుగులతో డిప్రెషన్‌ తగ్గిపోతుందా... తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

  12. రాహుల్ గాంధీపై బెంగళూరులో కేసు నమోదు.. భారత్ జోడో యాత్రలో అనుమతి లేకుండా కేజీఎఫ్-2 సంగీతం వాడారని ఫిర్యాదు

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని ఉపయోగించారంటూ ఆయన మీద బెంగళూరులో కేసు నమోదైంది.

    రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, సుప్రియా ష్రినేత్‌ల మీద కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.

    పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కన్నడ సినిమా కేజీఎఫ్-2 లోని సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ఎంఆర్‌టీ మ్యూజిక్ మేనేజర్ ఎం.నవీన్‌కుమార్ కాపీరైట్ చట్టం కింద బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    అలాగే.. జైరాం రమేష్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన రెండు వీడియోల్లో.. కేజీఎఫ్-2 సినిమాలోని రెండు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని కూడా ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఆ పాటల సంగీతం హక్కులు ఎంఆర్‌టీ మ్యూజిక్ సంస్థకు చెందుతాయి.

  13. బ్యాంకుల్లో టీటీడీ నగదు డిపాజిట్లు రూ.15938 కోట్లు, బంగారం డిపాజిట్లు 10258 కేజీలు

  14. భారత్ పరీక్షించిన అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఢీకొట్టగలిగే ఆయుధాలు పాకిస్తాన్ వద్ద ఉన్నాయా?

  15. దిల్లీకి కాలుష్యం: ‘మాస్కు వాడుతున్నా.. కరోనా భయంతో కాదు, కాలుష్యం డేంజర్ వల్ల..’

  16. పంజాబ్‌: రైతులు పంటవ్యర్థాలను కాల్చకుండా తీర్మానించిన మహిళా సర్పంచ్

  17. దావూద్ ఇబ్రహీం సహా అయిదుగురిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్

    అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహా డి-కంపెనీతో సంబంధాలున్న అయిదుగురిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అభియోగపత్రం నమోదు చేసింది.

    అయిదుగురిలో ఆరిఫ్ అబూబాకర్ షేక్, షబ్బీర్ అబూబాకర్ షేక్, మొహ్మద్ సలీమ్ ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్‌లను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

    మిగతా ఇద్దరు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌లు పరారీలో ఉన్నారు.

    ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అయిదుగురూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ఉగ్రవాద ముఠా డి-కంపెనీకి చెందినవారని ఎన్ఐఏ పరిశోధనలో తేలింది.

  18. ప్రైవేట్ పార్టీ వివాదం నుంచి ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్

    ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ప్రైవేట్ పార్టీ వివాదం నుంచి బయటపడ్డారు. ఆమె ఓ పార్టీలో పాల్గొన్నట్లుగా చూపించే వీడియో ఒకటి ఆగస్ట్‌లో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

    ఆ వీడియోలో ఆమె కొందరు సెలబ్రిటీలు, తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది.

    సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

    ఈ కేసు విచారించిన న్యాయమూర్తి ట్యూమస్ పోయెస్టీ.. ప్రధానిగా సనా తన విధి నిర్వహణను నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు.

    అధికారిక విచారణ అనంతరం మాట్లాడిన న్యాయమూర్తి.. ‘‘ప్రధానమంత్రిని అనుమానించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్లుగా కానీ, అధికారిక విధుల్లో అలక్ష్యం వహించినట్లుగా కానీ లేదు’ అన్నారు.

    కాగా తనపై వచ్చిన అనుమానాలను పోగొట్టడానికి ప్రధాని సనా అప్పుడే డ్రగ్ టెస్ట్ తీసుకున్నారు. ఆమె డ్రగ్స్ ఏమీ తీసుకోలేదని ఆ టెస్టులో తేలింది.

  19. ట్విటర్‌లో ఇద్దరు ‘ఎలాన్ మస్క్’.. నకిలీ ఖాతా సస్పెన్షన్

    ఆస్ట్రేలియాకు చెందిన హిందీ ప్రొఫెసర్ ఇయాన్ వూల్‌ఫర్డ్ ఖాతాను ట్విటర్ సస్పెండ్ చేసింది.

    ఇయనా తన ట్విటర్ ఖాతాలో పేరును ఎలాన్ మస్క్ అని మార్చుకోవడంతో పాటు బయో, డీపీ కూడా ఎలాన్ మస్క్ అసలు ఖాతాలో ఉన్నట్లుగా మార్చుకున్నారు.

    ఆ తరువాత ఆ ఖాతా నుంచి హిందీలో ట్వీట్లు చేయడం ప్రారంభించారు.

    భోజ్‌పురీ భాషలోనూ కొన్ని ట్వీట్లు చేశారు.

    ట్విటర్‌లో ఉద్యోగులను తొలగించడం నుంచి బ్లూ టిక్ కోసం 8 డాలర్లు చార్జ్ చేయాలన్న నిర్ణయం వరకు అన్నిటిపైనా ఆయన ట్వీట్లు చేస్తూ వచ్చారు.

    చాలామంది తొలుత ఎలాన్ మస్కే ఈ ట్వీట్లు చేస్తున్నారని అనుకున్నారు.

    కొందరు రెండూ వేర్వేరు అకౌంట్లని గుర్తించి ఇదెలా సాధ్యమో అర్థం కాక అయోమయంలో పడ్డారు.

    రెండూ వెరిఫైడ్ బ్లూ టిక్ అకౌంట్లు కావడం, ట్విటర్ యజమాని పేరుతోనే రెండూ ఉండడంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది.

    కొందరు అసలైన ఎలాన్ మస్క్ అకౌంట్‌నుట్యాగ్ చేస్తూ ఇయాన్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఎవరీ ఇయనా వూల్‌ఫర్డ్?

    ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న లా ట్రోబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇయాన్ హిందీ బోధిస్తారు.

    సోషల్ మీడియాలో ఆయన చాలా పాపులర్.

    తరచూ హిందీలో ఆయన చేసే ట్వీట్లకు భారతీయులు లైక్‌లు కొడుతుంటారు.

    శనివారం నాటి పరిణామాల తరువాత ట్విటర్ ఆయన ఖాతాను సస్పెండ్ చేసినట్లుగా చెబుతున్నారు.

    అయితే, ట్విటర్ నుంచి కానీ ఎలాన్ మస్క్ నుంచి కానీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు.

  20. చరిత్రలో అతి పెద్ద లాటరీ.. జాక్‌పాట్ రూ.13 వేల కోట్లు.. మూడు నెలలగా విజేతలే లేరు.. చివరికి ఏం చేశారంటే..