You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. నీళ్లు విపరీతంగా వాడేసి ఎడారిలాగా మారిపోయిన నగరం.. తిరిగి పచ్చగా ఎలా మారిందంటే..

  2. టీ20 ప్రపంచకప్: టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా ఔట్.. సెమీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్

  3. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు - మంత్రి జోగి రమేశ్

    ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లును కూడా కూల్చిన దాఖలాలు లేనేలేవు అని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.

    ఆ గ్రామంలో రోడ్డు విస్తరణలో, డ్రైనేజ్ పనుల్లో భాగంగా అడ్డం వచ్చిన చిన్నచిన్న ఆక్రమణలను, ప్రహరీ గోడలను తొలగించడం జరిగిందని, ఇవిగో సాక్ష్యాలు.. అంటూ ఆక్రమణలను తొలగించిన ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.

    రోడ్డు విస్తరణ వల్ల తమ గ్రామం అభివృద్ధి చెందుతోందని, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని గ్రామస్తులంతా ఆనందంగా, సంతోషంగా ఉన్నారని జోగి రమేష్ అన్నారు..

  4. ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత - 'మరో దారి లేదు'.. ఎలాన్ మస్క్ సమర్థన

  5. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

  6. ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వం కూలుతుందని ధ్వజం

    జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు.

    ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం అంటూ అధికారులు శుక్రవారం నాడు పలు ఇళ్లను కూల్చివేశారు. ఆ గ్రామ ప్రజలు జనసేన ఆవిర్భావ సభ నిర్వహించటానికి స్థలం ఇచ్చారనే కక్షతోనే అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ, పోలీసు సిబ్బంది సాయంతో వారి ఇళ్లను కూల్చివేశారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.

    జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ గ్రామ ప్రజలను కలవటానికి శనివారం నాడు పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరగా.. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని గ్రామానికి కొంత దూరంలోనే నిలిపివేశారు. దీంతో పవన్ కల్యాణ్ కారు దిగి కాలినడకన బయలుదేరారు. కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఇప్పటం వెళ్లటానికి పోలీసులు అనుమతించారు.

    గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడ రోడ్డు వెడల్పు పేరుతో కూల్చివేసిన ఇళ్లను సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

    “జనసేన సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ప్రభుత్వం కచ్చితంగా కూలుతుంది. రోడ్లపై గుంతలు పూడ్చలేరు.. కానీ రోడ్ల విస్తరణ కోసం వైసీపీతో లేని ప్రజల ఇళ్లను కూల్చుతారు’’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

    ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు.. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు... మీ కూల్చివేత తథ్యం” అని హెచ్చరించారు.

  7. చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు10 జాగ్రత్తలు

  8. పంజాబ్‌లోని రాధా సోమి సత్సంగ్‌ డేరాను సందర్శించిన ప్రధాని మోదీ

    ప్రధనామంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు పంజాబ్‌లోని రాధా సోమి సత్సంగ్‌ బియాస్ డేరాను సందర్శించారు. సత్సంగ్ అధిపతి బాబా గురీందర్ సింగ్ ధిల్లాన్‌ను కలిశారు.

    ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సత్సంగ్ డేరా అధిపతిని ప్రధాని మోదీ దిల్లీలో కలిశారు.

    ఆయన శనివారం నాడు పంజాబ్‌లోని అమృత్‌సర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బియాస్ టౌన్‌లో గల డేరాకు వెళ్లారు.

    ప్రధాని మోదీ శనివారం నాడు పంజాబ్ నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌ వెళ్లనున్నారు. అక్కడ సుందర్ నగర్, సోలాన్‌లలో ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారు.

  9. లాటరీలో రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టిన ఆటో డ్రైవర్‌కు ఊహకందని కష్టాలు

  10. విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విషెస్

    భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బీసీసీఐ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన సాధించిన అద్భుతమైన రికార్డులను గుర్తు చేసింది.

    "477 అంతర్జాతీయ మ్యాచులు, 24,350 పరుగులు, 2011 ఐసీసీ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత" అంటూ బీసీసీఐ విరాట్ కోహ్లీ సాధించిన విజయాల జాబితాను ఇచ్చింది.

    "క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకరైన కోహ్లీకి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేసింది.

    ఇటీవల పాకిస్తాన్‌తో టీ20 విజయం తరువాత విరాట్ కోహ్లీ మళ్ళీ పతాక శీర్షికల్లోకి వచ్చారు. 34 ఏళ్ళ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించాడు.

    విరాట్ మళ్ళీ వచ్చాడు అంటూ ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

  11. స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి

  12. స్వతంత్ర భారతదేశపు ప్రప్రథమ ఓటరు మృతి

    స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఓటరు శ్యామ్ శరణ్ నేగి 106 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

    హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలం కాల్పాలో శనివారం ఉదయం ఆయన మృతిచెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కిన్నౌర్ జిల్లా కలెక్టర్ చెప్పారు.

    శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కును 34 సార్లు వినియోగించుకున్నారు. చివరిగా నవంబర్ 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ ఎన్నికల్లో తన నివాసం నుంచి పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేశారు.

  13. COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?

  14. పంజాబ్‌లో శివసేన నేత సుధీర్ సూరి హత్య, నదీమ్ షాద్, బీబీసీ న్యూస్

    పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శివసేన నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు.

    శుక్రవారం నాడు అత్యంత రద్దీ ప్రాంతమైన మాజితా రోడ్‌లోని గోపాల్ మందిర్ వెలుపల పార్టీ నేతలతో కలిసి నిరసన చేపట్టిన సుధీర్ సూరి మీద ఒక వ్యక్తి కాల్పులు జరిపారు.

    గాయపడిన సుధీర్ సూరి (58)ని ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆయన చనిపోయారు.

    ఈ ఘటనకు సంబంధించి స్థానిక దుకాణుదారు ఒకరిని అరెస్ట్ చేశామని, అతడిపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు.

    ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధీర్ సూరి హత్యకు సంబంధించి అన్ని కోణాలు, కుట్రల మీద దర్యాప్తు చేస్తామన్నారు.

    సిక్కు మతం మీద, సిక్కు మతస్తుల మీద సుధీర్ సూరి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని భారతదేశంతో పాటు, విదేశాల్లో ఉన్న సిక్కులు కూడా గతంలో ఆరోపించారు.

    హిందూ దేవతలను అవమానించారని ఆరోపిస్తూ సుధీర్ సూరి గోపాల్ మందిర్ వెలుపల నిరసన చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

    అమృత్‌సర్‌లో ఇటీవల మతపరమైన హత్యలు వరుసగా జరిగాయి.

    గత సెప్టెంబరులో స్వర్ణ దేవాలయం దగ్గర పొగాకు నములుతూ, మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని బహిరంగంగా హత్య చేశారు.

    గత ఏడాది ఈ ఆలయం దగ్గర దైవదూషణ చర్యకు పాల్పడటానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని కొట్టి చంపారు.

  15. జైలు నుంచి విడుదలైన హంతకులు, డ్రగ్ డీలర్లను సైన్యంలో చేర్చుకోవాలి: పుతిన్ చట్టం, పాట్రిక్ జాక్సన్ - బీబీసీ న్యూస్, లండన్

    యుక్రెయిన్‌లో యుద్ధం చేయటానికి రష్యాలో జైలు నుంచి విడుదలైన హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులను రిజర్వు సైన్యంలో కిరాయి సైనికులుగా చేర్చుకోవాలంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చట్టం చేశారు.

    తీవ్ర నేరాల్లో దోషులుగా నిర్ధారితులై జైలు శిక్ష అనుభవించి విడుదలైన పురుషులను కాన్‌స్క్రిప్ట్‌లుగా (తప్పనిసరిగా చేరాల్సిన సైనికులు) రిజర్వులో సైన్యంలో చేర్చుకోవాలంటూ ఆయన చట్టాన్ని సవరించారు.

    అయితే చిన్నారులపై లైంగిక నేరాలు, ఉగ్రవాదం దోషులను సైన్యంలో పనిచేయకుండా మినహాయించారు.

    యుక్రెయిన్ మీద సైనిక దండయాత్రలో రష్యా సైనికులు నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

    రష్యా బలగాలు పౌరులను పట్టుకుని కాల్చిచంపేయటంతో పాటు, కొందరు సైనికులు లైంగిక హింసకు పాల్పడటం వంటి యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన యుక్రెయిన్ మీద స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్ సెప్టెంబర్ నెలలో నివేదిక ఇచ్చింది.

    రష్యా బలగాలు పాల్పడిన వేలాది యుద్ధ నేరాలను తాము గుర్తించామని యుక్రెయిన్ స్వయంగా చెప్తోంది.

    పౌరుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు చేశామన్న వాదనను రష్యా తిరస్కరిస్తోంది. వేర్పాటువాదుల నియంత్రణలోని పౌరులపై యుక్రెయిన్ సైన్యం ఆర్టిలరీతో దాడులు చేస్తోందని ప్రత్యారోపణ చేస్తోంది. దీనిని యుక్రెయిన్ నిరాకరిస్తోంది.

    వాగ్నర్ కిరాయి సైన్యం సంస్థ.. ఖైదీల శిక్షను రద్దు చేయటానికి ప్రతిఫలంగా వారిని యుక్రెయిన్‌లో యుద్ధం చేయటానికి సైనికులుగా చేర్చుకుంటోందని సెప్టెంబరులో వార్తలు వచ్చాయి.

    సైన్యంలో పనిచేసినందుకు ప్రతిఫలంగా జైలు శిక్షలను రద్దు చేయటానికి రష్యా చట్టం అనుమతించదు. అయితే.. వాగ్నర్ అధిపతి యెవ్‌జెనీ ప్రిగోఝిన్ ఖైదీలతో మాట్లాడుతూ.. వారు తన బృందంలో సైనికులుగా పని చేస్తే ‘ఎవరూ తిరిగి కటకటాల వెనక్కి వెళ్లరు’ అని చెప్తుండటం ఒక వీడియోలో కనిపిచింది.

    శుక్రవారం నాడు వాగ్నర్ సంస్థ రష్యాలో తన తొలి అధికారిక ప్రధాన కార్యాలయాన్ని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో తెరిచింది.

  16. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  17. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంలో ఎవరి పాత్ర ఎంత?

  18. మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

  19. "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

  20. మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?