You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు క్లీన్ చిట్.. పార్టీ చేసుకున్నంత మాత్రాన అనుమానించలేమన్న న్యాయమూర్తి

సనా తన ప్రవర్తనతో దేశ ప్రతిష్ట, భద్రతకు భంగం కలిగించారని అప్పట్లో అనేక మంది ఫిర్యాదు చేశారు. కానీ, సనా తన చర్యను సమర్థించుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. ధర్మాన: ‘మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది... సంస్కరణలు అర్థం చేసుకోక పోవడమే కారణం’

  2. చంద్రగ్రహణం ఈరోజు భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?

  3. రాహుల్ గాంధీ: భారత్‌ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి నడుస్తున్న తెలుగు వారు ఏం చెబుతున్నారు?

  4. అబార్షన్ కోసం గర్భిణులను రాష్ట్రాలు దాటిస్తున్న పైలట్

  5. ఏటా లక్షలాది మంది సందర్శించే ఈ గ్రామం రోజు రోజూ భూమిలో కుంగిపోతోంది.. ఎందుకు?

  6. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏంటి?

  7. ప్రతి వరల్డ్ కప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును ఓడిస్తున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఏంటి

  8. తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.

    అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రకు 24 నుంచి 26 వరకు విరామం ఇచ్చారు. ఆ సమయంలో దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లి ఖార్జున ఖర్గే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు.

    27 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం అయ్యింది. నవంబర్ 4వ తేదీన మరోసారి యాత్ర కు విరామం ఇచ్చారు.

    సోమవారం రాత్రి మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో తెలంగాణలో రాహుల్ యాత్ర ముగిసింది.

    మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించింది.

    తెలంగాణలో రాహుల్ గాంధీ 375 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

    ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది.

    19 అసెంబ్లీ నియోజక వర్గాలు, 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఈ యాత్ర సాగింది.

    కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ప్రవేశించిన మెట్రో సిటీ హైదరాబాదే. హైదరాబాద్ లో నవంబర్ 1,2 తేదీల్లో రాహుల్ పాద యాత్ర చేశారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరలేదు – రాహుల్ గాంధీ

    మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజలెవవరూ సంతోషంగా లేరని ఈ యాత్ర ద్వారా తనకు అర్థమైందని రాహుల్ గాంధీ అన్నారు.

    కొంతమందికి లాభం చేయాలన్నదే కేసీఆర్ ప్రయత్నమని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  9. శ్రీకాకుళం: స్థలం వివాదంలో మహిళలపై కంకర పోసిన ప్రత్యర్థులు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురం గ్రామంలో ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన ఘటన కలకలం సృష్టించింది.

    వారిపై కంకరు పోసిన తర్వాత...ఆ కంకరులో ఉండిపోయిన మహిళలు మమ్మల్ని రక్షించడంటూ కేకలు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

    మహిళలు ‘చచ్చిపోతున్నాం, కాపాడండి’ అంటూ వేడుకుంటుంటే... ‘చచ్చిపో పర్లేదు’ అనే వాయిస్ కూడా ఈ వీడియోలో వినిపిస్తోంది.

    వివాదం ఏంటి?

    శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రికి...అదే కుటుంబానికి చెందిన కొట్రా ఆనందరావు, కొట్ర రామారావు అనే వ్యక్తుల మధ్య ఆస్తి వివాదం ఉంది.

    ఈ వివాదంపై తాను కోర్టుకు కూడా వెళ్లినట్లు కొట్ర దాలమ్మ బీబీసీతో చెప్పారు. తమ స్థలం కొంత కబ్జాకు గురైందని దాలమ్మ అన్నారు.

    “హరిపురంలో మాకు కొంత స్థలం ఉంది. కుటుంబ పంపకాల్లో మాకు అది వచ్చింది. అయితే మాకు పంపకాల్లో వచ్చిన స్థలంలో కొట్ర ఆనందరావు, రామారావులు పునాది తీశారు. దానిపై మేం ఆడగడానికి వెళ్లాం. వెళ్లగానే మాపై అక్కడ ఉన్న ట్రాక్టరు మట్టిని పోసేశారు. దానిలో మేం కురుకుపోయాం. కాపాడండి అని అరుస్తూంటే...పట్టించుకోలేదు. కొద్ది సేపటి తర్వాత ఊరి జనాలు వచ్చి పారలతో తవ్వి, మమ్మల్ని ఆ మట్టి నుంచి బటయకు తీశారు. మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని దాలమ్మ చెప్పారు.

    ఏడేళ్లుగా వివాదం

    గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్నామని కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి చెప్పారు.

    2019లో ఈ స్థలం కోసం నిరాహార కూడా చేశామని చెప్పారు.

    తమకి హక్కులు కలిగి ఉన్న తమ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

    ఈ వివాదం మొదలై ఏడళ్లు అయ్యిందని, ప్రస్తుతం వివాదంపై కోర్టులో కేసు ఉందని చెప్పారు.

    “మా స్థలంలో పునాది తీశారు. పునాది తీసిన స్థలం విషయంలోనే కోర్టులో కేసు వేశాం. ఇప్పుడు అక్కడే నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఆడగడానికి వెళ్తే మాపై కంకరు పోశారు. అలాగే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి” అని మరో బాధితురాలు మజ్జి సావిత్రి చెప్పారు.

    కోర్టు ఆర్డర్ కోసం చూస్తున్నాం: పోలీసులు

    హరిపురంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య ఈ స్థలవివాదం చోటు చేసుకుందని మందస పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై. రవి కుమార్ బీబీసీతో చెప్పారు.

    మహిళలు ఇద్దరు తమపై కంకరు పోసిన విషయంపై ఫిర్యాదు చేశారని చెప్పారు.

    “దాలమ్మ, సావిత్రి ఇద్దరు కూడా వివాదమున్న స్థలంలో ఏదైనా నిర్మాణం చేపడుతన్నారనే విషయంలో చూసేందుకు వెళ్లామని, అక్కడికి వెళ్లగానే వారిపై ట్రాక్టరుతో కంకరుపోశారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి రీసిట్ కూడా అందించాం. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నందుకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. వారి ద్వారా కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి, కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాం” అని ఎస్పై రవికుమార్ చెప్పారు.

    అలాగే కొట్ర రామారావు, ఆనందరావులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి అందుబాటులోకి రాలేదు.

  10. ప్రపంచంలో తొలిసారి ల్యాబ్‌లో తయారు చేసిన రక్తాన్ని మనుషులకు ఎక్కించిన వైద్యులు.. ఈ రక్తం ఏంటి? ఎలా అభివృద్ధి చేస్తారు?

  11. పిల్లల గురించి, పిల్లల ముందే ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే ఏం చేయాలి?

  12. రష్యాలో 10 లక్షల మంది బలైన స్టాలిన్ కాలం నాటి చీకటి రోజులు మళ్ళీ వస్తాయా?

  13. బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?

  14. కారు ఎంత సేఫ్ అనేది నిర్ధారించే 'క్రాష్ టెస్ట్' ఎలా చేస్తారు?

  15. 'EWS కోటా రాజ్యాంగం ప్రకారం చెల్లుతుంది' - సుప్రీంకోర్టు

    ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

    ఈ కోటా కోసం రాజ్యాంగంలో చేసిన 103వ సవరణను చెల్లుతుందని, అది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది.

    "సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకే కాక ఎలాంటి వెనుబడిన వర్గాలవారికైనా రిజర్వేషన్ ఇవ్వవచ్చు. కాబట్టి, ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు. EWS రిజర్వేషన్ల నుంచి SC/ST, OBCలను మినహాయించడం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. అందుబాటులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ సీట్లకు అదనంగా EWS రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే" అని జస్టిస్ దినేశ్ మహేశ్వరి అన్నారు.

    అయితే, 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని మెజారిటీ అభిప్రాయాలతో బెంచ్‌లోని సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు.

    2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం EWS కోటాను అమలు చేసింది. దీని కోసం రాజ్యాంగంలో 103వ సవరణను చేసింది. అయితే, దీన్ని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహా పలువురు పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.

    దీనిపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

  16. క్రికెట్ వరల్డ్ కప్: భారత్-పాకిస్తాన్ ఆడిన 5 మరపురాని మ్యాచ్‌లు

  17. EWS కోటా కింద 10% రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

    ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకోనుంది.

    ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుబాటును సవాలు చేస్తూ 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

    ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించనుంది.

    2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. దీని కోసం రాజ్యాంగంలో 103వ సవరణను చేసింది.

    2019లో అమలు చేసిన EWS కోటాను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సహా పలువురు పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.

    చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పదర్వాలాలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 13న విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్ 27న తీర్పును రిజర్వ్ చేసింది.

  18. కేజ్రీవాల్: 'గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది'

    గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గితే, దిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై కేసులు కొట్టివేస్తామంటూ బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు.

    ఎన్‌డీటీవీ టౌన్‌హాల్ షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, "ఆప్‌ని విడిచిపెట్టి వస్తే, దిల్లీ ముఖ్యమంత్రి కావచ్చన్న వారి (బీజేపీ) ప్రతిపాదనను మనీశ్ సిసోడియా తిరస్కరించారు. ఇప్పుడు వారు (బీజేపీ) నన్ను సంప్రదించారు.. మీరు గుజరాత్‌ ఎన్నికల నుంచి తప్పుకుంటే, సత్యేందర్ జైన్, సిసోడియా ఇద్దరినీ విడుదల చేస్తామని, వారిపై ఉన్న అభియోగాలను ఎత్తివేస్తామని ఆఫర్ ఇచ్చారు" అని తెలిపారు.

    ఈ ప్రతిపాదన ఎవరు చేశారనే ప్రశ్నకు కేజ్రీవాల్ జవాబిస్తూ, "మాలో ఒకరి పేరును నేనెలా బయటపెట్టగలను.. వారి ద్వారానే నాకు ప్రతిపాదన వచ్చింది.. వారు (బీజేపీ) ఎప్పుడూ నేరుగా సంప్రదించరు. ఒకరి నుంచి ఒకరికి వెళుతూ, మనకు సందేశం చేర్చగల సన్నిహితుడిని చేరుకుంటారు" అని చెప్పారు.

    బీజేపీ ఏమంది?

    అరవింద్ కేజ్రీవాల్ వాదనలు పచ్చి అబద్ధాలని బీజేపీ పేర్కొంది.

    "ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, బీజేపీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు. కేజ్రీవాల్ దిల్లీ ప్రజలను, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన అధికారంలోకి రావడానికి సామాజిక కార్యకర్త అన్నా హజారేను ఉపయోగించుకున్నారు. తరువాత ఆయనను విడిచిపెట్టారు. ఆయన అధికారం కోసం ఎవరినైనా తప్పుదోవ పట్టించగలరు" అని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు.

  19. తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

  20. సూర్యకుమార్ యాదవ్ భార్య పెట్టిన 'రూల్' ఏంటి, దాన్ని పాటించడం వల్లే అతడు ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడా?