You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే

  2. ఇప్పుడు నా తలపై భారం తొలగిపోయింది.. ఊరటగా ఉంది: సోనియా గాంధీ

  3. రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?

  4. బ్లాక్ డెత్: 700 ఏళ్ల కిందటి ప్లేగు మహమ్మారి మన ఆరోగ్యంపై ఇంకా ప్రభావం చూపుతోందా?

  5. ఉత్తరాంధ్ర గిరిజన కళల్ని ప్రపంచానికి చూపిస్తున్న యువ యూట్యూబర్స్

  6. కత్తితో బ్యాంకు దోపిడీకి వచ్చిన దొంగను ఎదుర్కొన్న లేడీ మేనేజర్

  7. రిషి సునక్ భార్య అక్షత మూర్తి ఎవరో తెలుసా?

  8. విరాట్ కోహ్లీ 'అహంకారి' అని వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా మీడియా తీరు మారిందా?

  9. రిషి సునక్: ‘పొరపాట్లను సరిచేస్తా.. దేశాన్ని భవిష్యత్తులోకి నడిపిస్తా’ - ప్రధానిగా తొలి ప్రసంగం

    బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునక్.. దేశ ప్రజలను ఉద్దేశించి తొలి అధికారిక ప్రసంగం చేశారు. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయన మాట్లాడారు.

    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాజు మూడో చార్లెస్ ఆహ్వానించారని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని చెప్పారు.

    తనకన్నా ముందు ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    ‘‘ఇప్పుడు మన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ అనంతర కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది’’ అని పేర్కొన్నారు.

    తనకన్నా ముందలి ప్రధాని చేసిన పొరపాట్లను సరిచేయటానికి తాను పనిచేస్తానన్నారు. ‘‘కావాలనో, దురుద్దేశాలతోనో జరిగిన తప్పులు కావు. సదుద్దేశాలే. కానీ అవి పొరపాట్లే’’ అని వ్యాఖ్యానించారు.

    మార్పు తీసుకురావటానికి లిజ్ ట్రస్ ఎంతో పనిచేశారని, కానీ కొన్ని పొరపాట్లు జరిగాయని అన్నారు.

    ఆ పొరపాట్లను సరిచేయటానికి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా తనను ఎన్నుకున్నారని చెప్పారు. ‘‘ఆ పని తక్షణమే మొదలవుతుంది’’ అన్నారు.

    తాను ఆర్థికమంత్రిగా ఉన్నపుడు ప్రజలను, వ్యాపారాలను కాపాడటానికి పలు పథకాల ద్వారా తను చేయగలిగిందంతా చేశానని పేర్కొన్నారు.

    ‘‘ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలోనూ అదే సానుభూతితో పనిచేస్తాను. తర్వాతి తరం వారి మీద తీర్చలేని అప్పుల భారం లేకుండా చూస్తాను’’ అన్నారు.

    ‘‘నేను మన దేశాన్ని మాటలతో కాకుండా చేతలతో ఐక్యం చేస్తాను. మీకు సేవ చేయటానికి అనునిత్యం పని చేస్తాను’’ అని హామీ ఇచ్చారు.

    బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా అద్భుత విజయాలు సాధించారని రిషి కీర్తించారు.

    తన ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ నిబద్ధత, నైపుణ్యత, పారదర్శకతతో పని చేస్తుందని చెప్పారు.

    ‘‘విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. నేను మీ విశ్వాసాన్ని సంపాదించుకుంటాను’’ అన్నారు.

    మరింత బలమైన జాతీయ ఆరోగ్య పథకం, ఉత్తమమైన స్కూళ్లు, సురక్షితమైన వీధులు, సరిహద్దుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, సైనిక బలగాల బలోపేతం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

    కోవిడ్ వల్ల, యుక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో తనకు పూర్తిగా తెలుసునని రిషి సునాక్ చెప్పారు.

    దేశాన్ని భవిష్యత్తులోకి నడిపించటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరాలకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. తన పార్టీలో అత్యుత్తమానికి ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వాన్ని నిర్మిస్తానన్నారు.

    ‘‘మనం ఉమ్మడిగా అద్భుతాలు సాధించగలం’’ అంటూ ప్రధానమంత్రిగా తన తొలి అధికారిక ప్రసంగాన్ని ముగించారు.

  10. రిషి సునక్: భారత్‌ను ఏలిన బ్రిటన్‌కు ప్రధాని అయిన రిషి గురించి ప్రజలు ప్రైవేటుగా ఏమనుకుంటున్నారు?

  11. మునుగోడు: మద్యం, డబ్బు ఏరులై పారుతోన్న ఈ నియోజకవర్గంలో... ఏళ్లుగా నీళ్లు రావడం లేదెందుకు?

  12. ఇక్కడ టెన్త్/ఇంటర్ పూర్తి చేస్తే ఆడపిల్లల్ని కుట్టుపని, బ్యూటీపార్లర్ పని నేర్చుకోమంటారు.. ఈ యువతి జడ్జి అవుతున్నారు

  13. రిషి సునక్: బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి హిందూ ప్రధాన మంత్రి - జీవిత ప్రస్థానం ఫొటోల్లో

  14. ‘కులాంతర వివాహం చేసుకున్నందుకు దాడి’

    తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పాత వీరాపురం దళితవాడలో మాల కులానికి చెందిన లీలావతి, 2022 ఫిబ్రవరిలో మాదిగ కులానికి చెందిన శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

    వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు అపరాధం కట్టాలని దళిత పెద్దలు డిమాండ్ చేశారు. వారిని లీలావతి ఎదిరించడంతో, ఆమెపై దాడి చేశారు.

  15. రిషి సునాక్: అల్లుడికి అభినందనలు తెలిపిన నారాయణ మూర్తి

    తన అల్లుడు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కాబోతున్న సందర్భంగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అభినందనలు తెలిపారు.

    రిషి సునాక్ తన దేశానికి, ప్రజలకు సాధ్యమైనంత మంచి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ ప్రధాని వంటి వారు రిషి సునక్‌కు అభినందనలు తెలిపారు.

    నారాయణ మూర్తి కూతరు అక్షతా మూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు.

  16. అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు

    అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌తోపాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిశ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    దీపావళి సందర్భంగా జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.

    ‘చీకటిని పారదోలే వెలుగుగా దీపావళిని గుర్తు ఉండిపోతుంది. అమెరికా ఏ ఒక్కరిదో కాదు. ఇది అందరిది. ఈ దీపాల పండుగను జరుపుకొనే వారికి దీపావళి శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

  17. ‘బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, పొరపాట్లను సరిదిద్ది, దేశాన్ని మెరుగైన భవిష్యత్తులోకి నడిపిస్తా’ - ప్రధానిగా రిషి తొలి ప్రసంగం

  18. SAvZIM: దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోందా? విజయానికి 13 పరుగుల దూరంలో జింబాబ్వేతో మ్యాచ్ ఎందుకు ఆగిపోయింది?

  19. గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూసివేస్తారు? శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఎందుకు తెరుస్తారు?

  20. రిషి సునక్ ఎవరు? బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు?