You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. అయోధ్యలో దీపావళి: లక్షల దీపాలతో వెలిగిపోయిన సరయూ నదీ తీరం

  2. బ్రిటన్ భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.. సుస్థిరత, సమైక్యత అవసరం: రిషి సునక్

    బ్రిటన్ గొప్ప దేశమని, కానీ భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్తూ.. ఈ తరుణంలో దేశంలో సుస్థిరత, సమైక్యత అవసరమని బ్రిటన్ కాబోయే ప్రధానమంత్రి రిషి సునక్ పిలుపునిచ్చారు.

    లండన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సహచర పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి రిషి సునక్ ప్రసంగించారు.

    టోరీ నాయకుడిగా తన తొలి ప్రసంగం చేస్తూ.. సహచర ఎంపీలు తనకు మద్దతిచ్చి నాయకుడిగా ఎన్నుకోవటం అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

    దేశంలోనూ, విదేశాల్లోనూ క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానిగా లిజ్ ట్రస్ గౌరవప్రదమైన నాయకత్వం అందించారని ఆయన కీర్తించారు.

    ‘‘నేను ప్రేమించే పార్టీకి సేవ చేయగలగటం, నేను ఎంతో రుణ పడి ఉన్న దేశానికి రుణం తీర్చుకోగలగటం నా జీవితంలో అత్యంత విశిష్ట అవకాశం’’ అని పేర్కొన్నారు.

    ‘‘నేను నిబద్ధతతో నిరాడంబరంగా మీకు సేవ చేస్తాననని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అన్నారు.

    బ్రిటిష్ ప్రజలకు అనునిత్యం సేవ చేయటానికి కృషి చేస్తానన్నారు.

  3. రిషి సునక్ ఎవరు, ఆయనకూ భారతదేశానికీ ఉన్న అనుబంధం ఏంటి?

  4. రిషి సునక్: బ్రిటన్‌ ప్రధాని కాబోతున్న తొలి బ్రిటిష్-ఆసియన్ నేత

  5. బ్రేకింగ్ న్యూస్, బ్రిటన్ కొత్త ప్రధాని కానున్న రుషి సునక్.. పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ మోర్డంట్

    బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునక్ ఖాయమయ్యారు. ప్రధాని పదవికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పెన్నీ మోర్డంట్ ప్రకటించటంతో రేసులో ఆయన ఒక్కరే మిగిలారు.

    దీంతో రుషి సునక్ టోరీ పార్టీ నేతగా ఎన్నికై, ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే.

    రిషి సునక్ రేపు అధికారికంగా ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని బీబీసీ లండన్ చీఫ్ పొలిటికల్ కరెస్పాండెంట్ నిక్ ఈర్డ్‌లీ తెలిపారు.

    పెన్నీ పోటీ నుంచి తప్పుకోవడానికి ముందు మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఆదివారం రాత్రి ప్రధాని పదవి బరి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

    పార్టీ ఎంపీల మద్దతు ఆశించినంతగా లభించకపోవటంతో పెన్నీ మోర్డంట్ వైదొలిగారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి కేవలం రుషి సునక్ ఒక్కరు మాత్రమే నామినేషన్ వేశారు.

    దాంతో, సెప్టెంబర్ నెలలో ప్రధాని పదవికి పోటీ చేసి ఓడిన రిషి సునక్ అక్టోబర్ నెలలో విజేతగా నిలిచినట్లయింది.

    కన్సర్వేటివ్ పార్టీ తదుపరి నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రిషి సునక్ అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

  6. 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ

  7. కార్గిల్: సైనికులతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

    ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

    కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించారు.

    అక్కడి సైనికులకు స్వయంగా స్వీటు తినిపించారు.

  8. బ్రిటన్ ప్రధాని ఎన్నిక: బోరిస్ జాన్సన్ మద్దతుదారులు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు?

    బ్రిటన్ ప్రధానమంత్రి పదివికి పోటీ నుంచి వైదొలగుతున్నట్లు మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీంతో అప్పటివరకూ ఆయనకు మద్దతునిచ్చిన టోరీ ఎంపీలు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    ఆ ఎంపీల్లో చాలా మంది మాజీ ఆర్థికమంత్రి రిషి సునక్‌ను సమర్థిస్తున్నట్లు ఆదివారం రాత్రి పొద్దు పోయాక, సోమవారం ఉదయం కనిపించిన ప్రాధమిక పరిణామాలు సూచిస్తున్నాయి.

    ఆయన తర్వాత ఆర్థికమంత్రి అయిన నిధిమ్ జహావి, మాజీ హోంమంత్రి ప్రీతి పాటిల్, ప్రస్తుత విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీలు ఇప్పటికే తమ ఓట్లను ఆయన వైపు మళ్లించారు.

    ప్రధానమంత్రి పదవికి ఎన్నికవాలంటే బ్రిటన్ కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటల లోపు.. మొత్తం 355 మంది టోరీ ఎంపీల్లో కనీసం 100 మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది.

    బోరిస్ జన్సన్‌కు మద్దతిచ్చిన ఎంపీల్లో చాలా మంది ఇప్పుడు తము ఎవరివైపు నిలుస్తున్నామనే విషయాన్ని ఇంకా బహిరంగంగా చెప్పలేదు. సోమవారం మధ్యాహ్నం లోగా వారు ఎటువైపు ఉన్నారనేది స్పష్టమవుతుంది.

  9. ‘సిట్రాన్గ్‌ తుపానుతో తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేదు’, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

    పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న సిట్రాన్గ్ తుపాను, బంగ్లాదేశ్‌లోని బరిసాల్ తీరానికి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీలోని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

    ఈ తుపాను గత 6 గంటలుగా 21 కి.మీ. వేగంతో కదులుతోందని రానున్న 12 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

    ఇది అక్టోబరు 25 తెల్లవారుజామున బరిసాల్‌కు సమీపంలో టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.

    ఈ తుపాను ప్రభాం తెలుగు రాష్ట్రాలపై ఉండదని, ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి కేంద్రం తెలిపింది.

  10. గ్రహణం విడిపోయే వరకూ అన్నం వండకూడదా... తినకూడదా?

  11. తెలంగాణ: ఆదివాసీల దండారీ పండగ, గుస్సాడీ నృత్యాల ప్రత్యేకతలు ఏంటి?

  12. ‘కూడు లేకపోయినా, కుళ్లిపోయి ఇంట్లోనే చచ్చిపోతాం కానీ, ఆ నది దాటి వెళ్లలేం’

    బ్రిడ్జి లేక నదులను దాటి వెళ్లే ప్రజల కష్టాలు మనం చాలానే చూసి ఉంటాం. కానీ బ్రిడ్జి ఉన్నా ఆ ఊరి ప్రజలు మాత్రం నదిలో దిగి వెళ్లాల్సిన పరిస్థితి. అసలిలా ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  13. రమీజ్ రాజా: ‘ఈ ఆట అనైతికమైదని క్రూరమైనది అవుతుంది’

    టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది.

    ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా స్పందించారు.

    పాకిస్తాన్ టీం ఆట తీరును ఆయన ప్రశంసించారు.

    ‘క్లాసిక్! మీరు కొన్ని సార్లు గెలుస్తారు. కొన్ని సార్లు ఓడిపోతారు. ఈ ఆట క్రూరమైనది, అనైతికమైనది అవుతుందనే విషయం మన అందరికీ తెలుసు.

    బ్యాటు, బాల్‌తో ఇంత కంటే ఎక్కువ చేయలేరు.

    మీ ఆట తీరును చూసి గర్విస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

    ఎంతో ఉత్కంఠంగా, నాటకీయంగా జరిగిన ఈ మ్యాచులో 4 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు తీశాడు.

  14. బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్

    బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు.

    గతంలో ఆయన బ్రిటన్ ప్రధానిగా పని చేశారు.

    బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో భారత సంతతి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు మెరుగైనట్లుగా కనిపిస్తోంది.

    తాను పోటీలో నిలబడటానికి తగిన మద్దతు ఉన్నప్పటికీ కానీ పోటీ చేయడమనేది సరైన పని కాదు అని బోరిస్ అన్నారు.

  15. విరాట్ కోహ్లీ: ‘ఆ షాట్ ఒక మానవమాత్రుడు కొట్టి ఉంటే ఔటయ్యేవాడు... విరాట్ కాబట్టి దాన్ని బౌండరీ దాటించి, సిక్స్‌గా మలిచాడు’

  16. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వల్ల ఆలస్యంగా టేకాఫ్ అయిన విమానం

    భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం విమానాన్ని కాస్త లేట్‌గా పైలెట్ టేకాఫ్ చేసినట్లు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తెలిపారు.

    ‘ముంబయి నుంచి ఛండీగడ్ వెళ్లే విమానంలో ఫైనల్ రెండు ఓవర్లు చూశాను. విమానంలోని ప్రయాణికులందరూ మ్యాచ్ చూస్తూ ఫోన్లకు తమ కళ్లను అప్పగించేశారు.

    క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే పైలెట్ అయిదు నిమిషాలు ఆలస్యంగా విమానాన్ని టేకాఫ్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేయలేదు.

    అశ్విన్ ఆఖరి షాట్ కొట్టగానే కేరింతలతో విమానం మారుమోగింది. ఇలాంటి దాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.

    రన్‌వే మీద టేకాఫ్ కోసం విమానం వేగంగా పరుగులు తీస్తున్నప్పుడే ఇదంతా జరిగింది’ అని ఆయన ట్వీట్ చేశారు.

  17. కత్తి దాడిలో ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్ రష్దీ

    ఈ ఏడాది అగస్టులో జరిగిన కత్తి దాడిలో గాయపడిన రచయిత సల్మాన్ రష్దీ, ఒక కంటి చూపును కోల్పోయినట్లు ఆయన ఏజెంట్ తెలిపారు.

    అలాగే ఆయన చేతుల్లో ఒకటి పని చేయదని వెల్లడించారు. ఆయన ఛాతీకి 15 కంటే ఎక్కువ గాయాలు అయ్యాయని రష్దీ ఏజెంట్ ఆండ్రూ వైలీ, స్పానిష్ పత్రికకు తెలిపారు.

    ప్రస్తుతం రష్దీ ఎక్కడ ఉంటున్నారు అనేది తాను చెప్పలేనని ఆండ్రూ అన్నారు.

    ‘ది సటానిక్ వెర్సెస్’ అనే పుస్తకం రాసినందుకు 1988 నుంచి సల్మాన్ రష్దీని చంపుతామంటూ బెదిరిస్తున్నారు.

    కొందరు ముస్లింలు ‘దైవ దూషణ’గా ఆ పుస్తకాన్ని చూస్తున్నారు.

    న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఏడాది అగస్టు 12న రష్దీ మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

  18. మయన్మార్ సంక్షోభం: కచ్చిన్ తిరుగుబాటుదారులపై వైమానిక దాడి – 50 మంది మృతి

  19. INDvPAK: భారత్‌ను గెలిపించిన చివరి ఓవర్ నాలుగో బంతిపై సోషల్ మీడియాలో చర్చ ఎందుకు జరుగుతోంది?

  20. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?