నేను ‘మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా-ట్విటర్ లో వెల్లడించిన సమంత
‘‘నేను గత కొన్ని నెలల నుంచి ‘మయో సైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆటో ఇమ్యూనిటీ కండీషన్ చికిత్స తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా’’ అంటూ సినీనటి సమంతా ఒక ట్వీట్ చేశారు.
ఈ వ్యాధి చికిత్సకు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయమే పట్టేలా ఉందని ఆమె తన సుదీర్ఘ ట్వీట్‌లో అన్నారు.
తాను గతంతో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని ఆమె ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఒక్కోసారి ఇలాంటి సమస్యలను ఎదుర్కోగలనా అని ఆందోళన కలిగేదని, అయితే, ఎలాగోలా తాను వాటి నుంచి బయటకు వచ్చానని సమంత అన్నారు. ఈ వ్యాధి వేగంగానే తగ్గిపోతుందని డాక్టర్లు కూడా భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
యశోద సినిమా ట్రైలర్ వస్తున్న ఆదరణ పట్ల సమంత సంతోషం వ్యక్తం చేశారు.
సమంతా ఈ ట్వీట్ లో ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె చేతికి ప్లాస్టర్, సెలైన్ పైప్ కనిపిస్తోంది.