You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్‌లో చేరిక
కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.
లైవ్ కవరేజీ
PAK VS ZIM: ‘మా వద్ద నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు, కానీ మా క్రీడాస్ఫూర్తి నిజమైనది’ అని పాక్ ప్రధాని ఎందుకు అన్నారు?
ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘మిస్టర్ బీన్’ పేరు ట్రెండ్ అయింది.
సోషల్ మీడియాను వాడే సామాన్య పౌరులే కాకుండా దేశాధ్యక్షులు కూడా మిస్టర్ బీన్‌పై చర్చలో భాగమయ్యారు.
పాకిస్తాన్‌ను ఓడించిన తమ జట్టును జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డెంబుజో అభినందించారు. వచ్చేసారి తమ దేశానికి నిజమైన మిస్టర్ బీన్‌ను పంపించాలని పాక్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు. ‘‘ మా వద్ద నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ, మా క్రీడాస్ఫూర్తి నిజమైనది. మా పాకిస్తానీలకు తిరిగి నిలదొక్కుకునే ఆసక్తికరమైన అలవాటు ఒకటి ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్ కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు మీ జట్టు బాగా ఆడింది’’ అని ఎమర్సన్ ట్వీట్‌కు షరీఫ్ బదులు ఇచ్చారు.
పాక్ ఓటమి తర్వాత మిస్టర్ బీన్ పేరు ట్రెండ్ అవ్వడానికి కారణం ఒక పాత వివాదం.
పాకిస్తాన్‌కు చెందిన ఒక కళాకారుడు ఆసిఫ్ మహమ్మద్ ‘మిస్టర్ బీన్’ రూపంలో నటిస్తూ ఒకసారి జింబాబ్వేకు వెళ్లారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం, జింబాబ్వేకు ‘మిస్టర్ బీన్’ వేషంలో వెళ్లిన ఆసిఫ్ తానే నిజమైన మిస్టర్ బీన్ అంటూ అందరితో పరిచయం చేసుకున్నారు.
తర్వాత ఆయన నిజమైన మిస్టర్ బీన్ కాదని తెలియడంతో అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మ్యాచ్‌కు ముందు చసురా అనే ఒక జింబాబ్వే అభిమాని ట్వీట్ చేస్తూ..‘‘ జింబాబ్వే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మీరొకసారి రోవన్ అట్కిన్సన్‌కు బదులుగా ఫేక్ పాకిస్తానీ మిస్టర్ బీన్‌ను మా వద్దకు పంపించారు. మ్యాచ్‌లో దీనిపై పగ తీర్చుకుంటాం. వర్షం కురవాలని మీరు ప్రార్థనలు చేసుకోండి’’ అని అన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
భార్య పైనుంచి కారును నడిపారనే ఆరోపణలతో సినీ నిర్మాత అరెస్టు
కారుతో భార్యను తొక్కించారనే ఆరోపణలతో సినీ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాను మహారాష్ట్ర ఆంబోలీ పోలీసులు అరెస్ట్ చేశారు.
గురువారం కమల్ కిశోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో విచారణను ప్రారంభించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కమల్ కిశోర్ మిశ్రా తన భార్యపై నుంచి కారును నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ దాడిలో తన తలకు గాయాలయ్యాయని మిశ్రా భార్య చెప్పారు.
మిశ్రాపై సెక్షన్ 279, 338కింద కేసులు నమోదయ్యాయి.
అయితే, ఇప్పటివరకు దీనిపై కమల్ కిశోర్ మిశ్రా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
మిశ్రా ఐఎండీజీ పేజీ ప్రకారం, అతను ఇప్పటివరకు 5 సినిమాలను నిర్మించారు. శర్మాజీ కి లగ్ గయీ, హూతియాపా, ఫ్లాట్ నంబర్ 420, దెహాతీ డిస్కో, ఖలీ-బలీ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
డ్రై షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. డ్రై షాంపూలకు, మామూలు షాంపులకు తేడా ఏంటి?
అమెరికా: స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త మీద దాడి
ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ పూర్తి.. తెలుగు ఉద్యోగి విజయ గద్దె, సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు
సదర్: హైదరాబాద్‌లో 'దున్నపోతుల పండుగ' ఎందుకు చేస్తారు? 'నాన్-లోకల్' దున్నపోతులపై వివాదం ఎందుకు?
ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?
MCBT: ఇదొక మొసళ్ల బ్యాంక్, ఇక్కడ వేల మొసళ్లు పుట్టాయి
అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఏడాది తర్వాత ఎలా ఉన్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
కిమ్ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?
‘ఏడాదికి 7 లక్షల ఉద్యోగాలిస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్’
భారత జీడీపీలో యూట్యూబ్ వాటా ఏడాదికి రూ.6,800 కోట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపారు.
ఏడాదికి సుమారు 7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
‘భారత్‌లో క్రియేటర్ ఎకానమీ బాగా పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ భాషలన్నీ మా ప్లాట్ ఫాం మీద ఉన్నాయి. జెండర్ డైవర్సిటీ కూడా ఉంది.
కంటెంట్ తయారు చేసే వారు, దాన్ని యూజ్ చేసుకునే వారికి యూట్యూబ్ ఒక సురక్షితమైన ప్లేస్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని నీల్ మోహన్ వివరించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారతీయుల ప్రాణాలు హరిస్తున్నాయా, లాన్సెట్ నివేదికలో ఏముంది?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ, లేదా సిట్ విచారణకు అప్పగించాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్
బ్రేకింగ్ న్యూస్, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష
2019 నాటి విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
అలాగే రూ.2,000 జరిమానా కూడా విధించారు.
2019 ఎన్నికల సందర్భంగా మిలాక్ నియోజకవర్గంలో ఆజం ఖాన్ విద్వేష పూరిత ప్రసంగం చేశారనేది ఆరోపణ.
నాడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు ఒక రాజ్యాంగ సంస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు.
INDvsNED: నెదర్లాండ్స్ మీద 56 పరుగుల తేడాతో గెలిచిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ మీద 56 పరుగులతో టీం ఇండియా గెలిచింది.
భారత్ విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో నెదర్లాండ్స్ 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసింది.
భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్ల చొప్పున తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 66 పరుగులు చేయగా రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ మరొక సారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 51 పరుగులు కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముడుపోతున్నారో-తెలంగాణ ఫిరాయింపుల్లో మునుగోడు చాప్టర్
INDvsNED: నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ ఇండియా 20 ఓవర్లకు 179 పరుగులు చేసింది.
రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 66 పరుగులు చేయగా రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్ మరొక సారి తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 51 పరుగులు కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
భారత్‌లో ఇకపై మహిళా క్రికెటర్లకు పురుషు క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు
మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా ప్రకటించారు.
బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్లందరికీ ఇది వర్తిస్తుంది.
దీంతో ఇకపై బీసీసీఐ మహిళా క్రికెటర్లు టెస్టులకు రూ. 15 లక్షలు, వన్ డే మ్యాచ్‌లకు రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షల చొప్పున పొందుతారు.