తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోనసీమ పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంపై వస్తున్న అభ్యంతరాలు సబబు కాదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
అంబేద్కర్ భారత రాజ్యాంగ పిత అని, కోనసీమకు ఆయన పేరు పెట్టి గౌరవించడంపై అభ్యంతరాలు లేవనెత్తడం, అల్లర్లు చెలరేగడం న్యాయం కాదని అన్నారు.
నిజానికి, ఆ ప్రాంతానికి మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని, ఆయన స్పీకర్ అయిన తరువాతే కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఏ కారణం చేతనో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోలేదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రపంచమంతా కొనియాడుతున్న అంబేద్కర్‌ను మనం గౌరవించాలని చెబుతూ, ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని మంత్రి పినపే విశ్వరూప్, శాసనసభ్యులు పొన్నాడ సతీశ్ తదితరులను కోరారు.

ఫొటో సోర్స్, UGC
'పాకిస్తాన్‌లోని మా తాతల గ్రామాన్ని ఈ జన్మలో చూడలేననుకున్నా.. మా తాతలాగే తయారై పాక్‌లో అడుగు పెట్టా.. ఆ తర్వాత..'
రాజ్యసభలో వెంకయ్య నాయుడికి వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, SANSADTV/ANI
ఈ నెల 10వ తేదీన భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా, నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆయనకు వీడ్కోలు పలికారు.
వెంకయ్య నాయుడితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని మోదీ అన్నారు. పార్టీ చీఫ్‌గా, క్యాబినెట్‌లో మంత్రిగా, దేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అందించిన సేవలను కొనియాడారు. వివిధ పదవులను ఆయన నిర్వహించిన తీరును దగ్గర నుంచి చూశానని అన్నారు.
వెంకయ్య నాయుడు ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేశారని, ఎప్పుడూ ఏ పనిని భారంగా భావించలేదని మోదీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వెంకయ్య నాయుడికి మంచి హాస్య చతురత ఉందని, మాతృభాషపై ఉన్న ఎనలేని అభిమానం కనబరుస్తారని ప్రశంసించారు.
"మాతృభాష కంటి చూపు లాంటిదని, పరభాష కళ్లజోడు లాంటిదని" వెంకయ్య నాయుడు చెబుతుండేవారని మోదీ గుర్తుచేసుకున్నారు.
ఆయన అన్న ప్రతి మాటకు ప్రాధాన్యం ఇచ్చామని, గౌరవించామని మోదీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

ఫొటో సోర్స్, Komatireddy Rajgopal Reddy/FACEBOOK
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు స్పీకరు పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందించారు.
మునుగోడు కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
స్పీకర్, రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైదొలగుతున్నట్టు రాజగోపాలరెడ్డి ప్రకటించారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఫొటో సోర్స్, Komatireddy Rajgopal Reddy/FACEBOOK
మల్లిక శెరావత్: ‘హీరోలతో రాజీపడకపోవడం వల్ల చాలా అవకాశాలు పోగొట్టుకున్నా’
రాజస్థాన్: ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి

ఫొటో సోర్స్, Mohar singh meena
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.
స్థానికుల కథనం ప్రకారం, సోమవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరుచుకోగానే తొక్కిసలాట మొదలైంది. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
“రాజస్థాన్‌లోని సీకర్‌లో ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన సంఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటు ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
"ఆలయంలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
ఖాటూ శ్యామ్‌జీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినదని, అక్కడకి విశేషంగా భక్తులు వస్తారని బీబీసీ రిపోర్టర్ మోహర్ సింగ్ మీణా తెలిపారు.
ఆయన అందించిన వివరాల ప్రకారం, ఏకదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం దర్శనం కోసం సుమారు లక్షన్నర మంది ప్రజలు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరవగానే రాత్రంతా వేచి ఉన్న భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. తెల్లవారుజామున సుమారు 4.30 నుంచి 5.00 మధ్య జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు భక్తులు గాయపడ్డారు.
"ఈ ఘటనలో 63 ఏళ్ల మహిళ మరణించినట్లు" సీకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కున్వర్ రాష్ట్రదీప్ తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022: జావెలిన్ త్రోలో పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీంకు స్వర్ణం.. భారత స్టార్ నీరజ్ చోప్రా గైర్హాజరు

ఫొటో సోర్స్, Getty Images
కామన్వెల్త్ గేమ్స్ 2022లో జావెలిన్ త్రోలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం 90.18 మీటర్లు త్రో చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్‌కు ఇది రెండో స్వర్ణం.
గాయాల కారణంగా భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు నీరజ్ చోప్త్రా 90 మీటర్లు దాటి త్రో చేయలేదు.
భారత ఉపఖండంలో జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన తొలి అథ్లెట్‌గా అర్షద్ నదీం రికార్డు సృష్టించాడు.
ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో నదీం అయిదవ రౌండ్‌లో 90.18 మీటర్ల దూరం విసిరి కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు నదీం అత్యుత్తమ ప్రదర్శన ఇదే.
ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పీటర్స్ జావెలిన్‌ను 88.64 మీటర్ల దూరంలో విసిరాడు. జూలియస్ యెగో (కెన్యా) 85.70 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి మూడో స్థానంలో నిలిచాడు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కామన్వెల్త్ గేమ్స్ 2022: మహిళల క్రికెట్‌లో భారత్‌కు రజత పతకం... ఆస్ట్రేలియాకు స్వర్ణం

ఫొటో సోర్స్, TWITTER
కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళా క్రికెట్‌లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఫైనల్స్‌లో 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారత జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే అన్ని వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, కేవలం 34 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది.
అంతకుముందు ఆదివారం, న్యూజీలాండ్ మహిళల జట్టు ఇంగ్లండ్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు స్థానం కల్పించడం ఇదే తొలిసారి. అలాగే, 24 సంవత్సరాల తరువాత క్రికెట్ ఈ గేమ్స్‌లోకి తిరిగివచ్చింది.
చివరిగా 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ టోర్మమెంట్ జరిగింది. అప్పట్లో 50 ఓవర్ల మ్యాచులు జరిగాయి. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి.
ఇందులో దక్షిణాఫ్రికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఆస్ట్రేలియా రజతం, న్యూజీలాండ్ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2022: మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లకు స్వర్ణాలు
భారతదేశంలో ముస్లిం వ్యతిరేక విద్వేష సంగీతం ఎలా పెరుగుతోంది?
మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు
పాప్ స్మియర్: మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఈ టెస్ట్ వెనుక ప్రేమ కథ మీకు తెలుసా?
మార్లిన్ మన్రో మరణం వెనుక దాగిన మిస్టరీ ఏమిటి, నాటి అమెరికా అధ్యక్షుడైన కెన్నడీ సోదరుల పేరు ఎందుకు వినిపిస్తుంది?
లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
అమ్మాయి ట్రాక్టర్‌తో పొలం దున్నితే ఊరికి అరిష్టమా, గ్రామబహిష్కరణ చేస్తామని యువతిని ఎందుకు బెదిరిస్తున్నారు
కామన్వెల్త్ గేమ్స్: మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లోకి సింధు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది.
ఇవాళ జరిగిన సెమీ ఫైనల్‌లో సింధు 21-19, 21-17తో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు.
గత కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్‌తో తలపడిన సింధు ఫైనల్‌కు కూడా చేరుకున్నారు. ఫైనల్ మ్యాచ్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కామన్వెల్త్ గేమ్స్: తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు బంగారు పతకం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, స్వర్ణపతకం సాధించిన జరీనా నిఖత్ 48-50కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో భారత్ చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలుచుకున్నారు. ఆమె తన ప్రత్యర్ధి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మెక్‌నావుల్‌ను ఓడించారు.
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గతంలో కూడా పలు పతకాలు సాధించారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఆధ్వర్యంలో ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించారు.
సీనియర్ విభాగంలో ఆమె వరల్డ్ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ సృష్టించారు.
తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు నిఖత్ జరీన్.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన భారత బాక్సర్లు నీతూ గంఘాస్, అమిత్ పంఘాల్

ఫొటో సోర్స్, @KirenRijiju
బ్రిటన్‌లోని బర్మింఘామ్‌లో జరుగుతున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో.. ఆదివారం సాయంత్రం భారత బాక్సర్లు రెండు స్వర్ణపతకాలు సాధించారు.
భారత బాక్సర్ నీతూ గంఘాస్.. మహిళల మినిమమ్ వెయిట్ విభాగంలో స్వర్ణపతకం గెలిచింది.
పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ గోల్డ్ మెడల్ సంపాదించాడు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రంలోనే నీతూ గోల్డ్ మెడల్ సాధించటం విశేషం. దీనికిముందు ఆమె రెండుసార్లు వరల్డ్ యూత్ మెడల్స్ గెలిచినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది.
అమిత్ పంఘాల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాక్సర్ రియారన్ మాక్‌డోనాల్డ్‌ను 5-0 పాయింట్లతో ఓడించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కామన్వెల్త్ గేమ్స్: భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతకం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతకం కామన్వెల్త్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-1 తేడాతో విజయం సాధించడం ద్వారా భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.
భారత జట్టు కెప్టెన్, గోల్ కీపర్ అయిన సవిత పునియా షూటౌట్‌లో నాలుగింటిలో మూడు గోల్స్ ను అడ్డుకుని, జట్టు విజయానికి దోహద పడ్డారు.
అంతకు ముందు ఇరుజట్లు 1-1 స్కోరుతో సమానంగా నిలవడంతో షూటౌట్ నిర్వహించారు.