తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
ఆంధ్రప్రదేశ్: ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధులు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆదివాసీ తెగలు కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు చేశాయి. చెంచుల్లోని కొందరు పోరాట యోధులకు ఇటీవల అధికారిక గుర్తింపు దక్కింది.
నల్లమల అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యాలను ఎదిరించిన ఇద్దరు చెంచు జాతి వీరుల విగ్రహాలను ఇటీవలే ఏర్పాటు చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.
పోస్ట్ of YouTube ముగిసింది
గోదావరికి పెరుగుతున్న వరద, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, UGC
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, శబరి నదులు
ఏకకాలంలో పొంగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి
భారీగా వరదప్రవాహం గోదావరికి చేరుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వానల వల్ల శబరి పొంగుతోంది. వరద
నీరు వచ్చి చేరడంతో పోలవరం విలీన మండలాల్లో ఇప్పటికే వందల గ్రామాలకు నీరు చేరుతోంది.
ఈ ముప్పు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి బుధవారం
ఉదయం 7గం.ల ప్రాంతంలో 50 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇది 55 అడుగుల వరకూ
చేరుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి భద్రాచలం వద్ద వరద
చేరుకుంటుందని అధికారికంగా అంచనా వేస్తున్న తరుణంలో దిగువన శబరి నదీ ప్రవాహం కూడా
చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు,
పోలవరం,
దేవీపట్నం
మండలాల్లోని వందల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.
జులైలో వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోని గ్రామాలకు మరోసారి
వరద ముప్పు మూలంగా తల్లడిల్లిపోతున్నారు.
ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం 10లక్షల క్యూసెక్కులకు
చేరుకుంది. దాంతో ఎగువన అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లా వాసులతో పాటుగా తూర్పు, పశ్చిమ
గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా కలవరం మొదలయ్యింది. లంక
గ్రామాలను మరోసారి ఖాళీ చేయించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
జులై వరదల నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన
కేంద్ర బృందం నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనుంది.
హలో, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్
కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన హంపి, హారికల బృందం
డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు: మళ్లీ అధ్యక్ష పదవికి పోటీపడకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందా?
డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు..
ధన్యవాదాలు!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
ఈనాటి ముఖ్యాంశాలు
నేటి ముఖ్యాంశాలు
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తాము ఎన్డీయే కూటమి నుంచి
తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహఘట్‌బంధన్ సహకారంతో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
చైనా తమ దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తైవాన్ ఆరోపించింది. సైనిక విన్యాసాల పేరుతో
తమ భూభాగంలో చైనా ఆయుధాలు ప్రయోగిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ ఆరోపించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా
వాంకిడి, కెరామెరి, కాగజ్ నగర్‌లలో అత్యధిక వర్షాపాతం నమోదయింది.
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది.
18 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు చేసింది.
ఒక బీరువాను బలవంతంగా తెరిచారని ట్రంప్ ఆరోపించారు.
బర్మింగ్‌హామ్ నుంచి పతకాలతో భారతదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు
దిల్లీ విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
అబార్షన్ హక్కు విషయంలో అమెరికాలో ఆందోళనలు, భిన్న వాదనలు
విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త
ఆదివాసీ సంప్రదాయంలో ఘనంగా ఆధునిక వివాహాలు... ఇదే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్
తెలంగాణ: ములుగులో సినిమా ఫక్కీలో లాయర్ మల్లారెడ్డి హత్య... ఎవరు చంపారు, ఎందుకు చంపారు?
బిహార్: సీఎం పదవికి నితిశ్ కుమార్ రాజీనామా, ఎన్డీఏకు గుడ్ బై... ఇప్పుడేం జరుగుతుంది?
కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
బ్రేకింగ్ న్యూస్, బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
ఫొటో సోర్స్, Getty Images
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి నితీశ్ తన రాజీనామాను సమర్పించారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం నితీశ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ, తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఎన్డీయే నుంచి విడిపోవాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు చెప్పారు.
బీజేపీతో విభేదాల నేపథ్యంలో జేడీయూ మంగళవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
"ఎన్డీయే నుంచి బయటకు రావాలన్నదే అందరి కోరిక. మేం దానిని అంగీకరించాం. తరువాత గవర్నరును కలిసి నా రాజీనామా పత్రాన్ని అందించాను" అని నితీశ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
రాజీనామా తరువాత ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తున్నారు.నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వానికి మద్దతిస్తామని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి.
గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీశ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నితీశ్, తేజస్వి యాదవ్‌తో చర్చిస్తారని భావిస్తున్నారు.
50 ఏళ్ల కిందట తమిళనాడులో చోరీకి గురైన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్‌లో గుర్తింపు
ఫొటో సోర్స్, TAMIL NADU POLICE
ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లో లభించిన పార్వతీ దేవి విగ్రహం
తమిళనాడులో 1971లో చోరీకి గురైన ఓ విగ్రహం న్యూయార్క్‌లో దొరికిందని పోలీసులు వెల్లడించారు.
12వ శతాబ్ధానికి చెందిన పార్వతీ దేవి విగ్రహాన్ని బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్‌లో గుర్తించారు.
లండన్ కేంద్రంగా బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్ ప్రైవేట్ వేలాలు నిర్వహిస్తుంటుంది.
ఈ విగ్రహాన్ని తిరిగి తమిళనాడుకు పంపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
దేశం నుంచి మాయమైన, ఎత్తుకుపోయిన విగ్రహాలు, విలువైన చారిత్రక సంపదను వెనక్కి తెప్పించేందుకు భారత ప్రభుత్వం
కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
2014 నుంచి దాదాపు 200కు పైగా విలువైన ప్రాచీన సంపదను వెనక్కి తెచ్చినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రస్తుతం గుర్తించిన పార్వతి విగ్రహం తమిళనాడులోని నాదనపురేశ్వరర్ శివన్ ఆలయంలో 1971 నుంచి కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు.
2019 సంవత్సరంలో నాదనపురేశ్వరర్ ఆలయ అధికారులు ఈ విగ్రహం గురించి తమిళనాడు పోలీస్ శాఖలోని విగ్రహాల రికవరీ విభాగానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఆలయం నుంచి కనిపించకుండా పోయిన 5 విగ్రహాలలో ఈ పార్వతీదేవి విగ్రహం ఒకటి. దీని విలువ సుమారు రూ.1 కోటి 69 లక్షలు ఉంటుందని అంచనా.
తెలంగాణలో వర్షాలు... కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో గాలులకు రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది
తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన
24 గంటల్లో అత్యధికంగా కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 9
సెం.మీ,
కెరామెరిలో 7 సెం.మీ, కాగజ్ నగర్ 6 సెం.మీ వర్షాపాతం
నమోదైంది.
ఎగువ
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల నుంచి వరద ప్రవహాం వస్తుండటంతో, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లను ఎత్తి 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ
గోదావరిలోకి వదులుతున్నారు.
ఎస్సారెస్పీ
(శ్రీరాంసాగర్) ప్రాజెక్ట్‌కు 43 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 గేట్ల ద్వారా
16,656 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, కాళేశ్వరం
తెలంగాణ అభివృద్ది, ప్రణాళిక సొసైటీ (TSDPS) అందించిన వివరాల ప్రకారం, గడిచిన 24 గంటలలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా రాజేంధ్రనగర్‌లో 1.2 సెం.మీ వర్షం కురిసింది.
ఈ రోజు కుమ్రం భీము ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. రెంజు రోజుల పాటు ఈ తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
TSDPS వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం 1.00 వరకు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి 2.7 సెం.మీ, చీమన్ పల్లి 2.6 సెం.మీ, బెల్లాల్ 2.5 సెం.మీ, ఎడపల్లి 2.3 సెం.మీ వర్షం కురిసింది.
ఫొటో సోర్స్, UGC
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు వరద పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గోదావరి మట్టం 11 మీటర్లకు చేరింది. 12.5 మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
బిహార్: జేడీయూ, ఆర్జేడీ మధ్య పొత్తు పెరుగుతోందా?
ఫొటో సోర్స్, ANI
బిహార్‌లో అధికార బీజేపీ, జేడీయూ కూటమిలో మరోసారి పొరపొచ్చాలు తలెత్తాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తమ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యాయి.
అలాగే, హిందుస్థానీ అవామ్ మోర్చా, కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీ.
నితీశ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంభాషణ తరువాతే నితీశ్ కుమార్ ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు.
ఆర్జేడీ, నితీశ్ కుమార్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈమధ్య కాలంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సందర్భాలు లేవు. బహిరంగ ప్రకటనలలో కూడా ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉన్నారు.
నితీశ్ కుమార్ తేజస్వి నివాసానికి ఇఫ్తార్ పార్టీకి వెళ్లారు. తరువాత తేజస్వి కూడా ముఖ్యమంత్రి నివాసంలో కనిపించారు.
ఆర్జేడీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్బాల్ అహమ్ షమీ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, బిహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. బీజేపీపై కలిసికట్టుగా పోరాడతామని అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నితీశ్ కుమార్
ఇటీవల తేజస్వి యాదవ్ బిహార్‌లో ద్రవ్యోల్బణంపై నిరసన ప్రదర్శన చేశారు. ఆయనకు నిరసన తెలిపే హక్కు ఉందని జేడీయూ తేజస్వికి మద్దతిచ్చింది.
లాలూ యాదవ్ సన్నిహితుడు భోలా యాదవ్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. అప్పుడు కూడా జేడీయూ ప్రతికూలంగా స్పందించకుండా, మౌనం వహించిది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జేడీయూ,ఆర్జేడీలో అవినీతి పేరుకుపోయిందని దాడికి దిగుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు.
సోమవారం జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశామని, ఆర్‌సీపీ సింగ్ రాజీనామా తరువాత పరిస్థితులపై ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకునేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, తేజస్వి యాదవ్
మరోవైపు, రాష్ట్రీయ జనతాదళ్ కూడా మంగళవారం తన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
నితీశ్ కుమార్ ఆర్జేడీతో చేయి కలుపుతారన్న వార్తలపై బిహార్ ఆర్జేడీ చీఫ్ జద్గానంద్ సింగ్ మాట్లాడుతూ, అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, అవన్నీ ఊహాగానాలని అన్నారు.
మరోవైపు, ఒప్పందం దాదాపు ఖాయమైందని, నాయకత్వ విషయంలో స్వల్ప భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తేజస్వి యాదవ్ ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీల్ దాదాపు ఖాయమని, నితీశ్ కుమార్, ఆర్జేడీతో చేతులు కలుపుతున్నారని బిహార్ ఆర్జేడీ నేత ఒకరు బీబీసీతో అన్నారు.
243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 77, జేడీయూకి 45, జితన్ రామ్ మాంఝీకి 4, ఆర్జేడీకి 79, కాంగ్రెస్‌కు 19, సీపీఐ-ఎంఎల్‌కు 12, సీపీఐకి 4, ఒవైసీకి 4 స్థానాలు ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.
బిహార్‌లో రాజకీయ ప్రకంపనలు.. గవర్నర్‌ను కలవనున్న నితీశ్ కుమార్
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నితీశ్ కుమార్
బిహార్‌లో రాజకీయ కలకలం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారని ఏఎన్ఐ తెలిపింది.
నితీశ్ కుమార్ రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చెందిన మొత్తం 16 మంది మంత్రులు కూడా గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లవచ్చు.
నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతివ్వవచ్చని కూడా అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, వెంకయ్య నాయుడు
2017 మొదట్లో ఉప రాష్ట్రపతి పదవికి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీంతో మీరు ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా? అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది.
దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. ‘‘నేను రాష్ట్రపతినో లేదా ఉప రాష్ట్రపతినో కావాలని అనుకోవడం లేదు. ఉషాపతిగా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, వెంకయ్య నాయుడు భార్య పేరు ఉష అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.
‘‘ఉషాపతి’’ లాంటి చతుర్లు, కవితాత్మక పదప్రయోగాలకు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రాజకీయ వర్గాల్లో దీని గురించి తరచూ మాట్లాడుకునేవారు.