తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?

  2. చీరాల – పేరాల: 100 ఏళ్ళ కిందటి ఈ ఉద్యమం 11 నెలలకే ఎందుకు కుప్పకూలింది?

  3. బింబిసార రివ్యూ: రాక్ష‌సుడి నుంచి రాముడిగా మారిన ఓ రాజు క‌థ‌

  4. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించాక నిరుద్యోగం పెరిగిందా? తగ్గిందా?

  5. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

  6. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు

    మార్గరేట్ అల్వా

    ఫొటో సోర్స్, ANI

    ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.

    టీఆర్‌ఎస్ ఎంపీలు అందరూ ఆమెకు ఓటు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

  7. సొంత డబ్బుతో చెక్‌డ్యాం నిర్మించిన వృద్ధురాలు

    తమ ఊరిలో పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఓ ఆదివాసీ రైతు చేశారు.

    సొంత డబ్బులతో పెద్ద చెక్ డ్యాం నిర్మించి ఇచ్చారు.

    పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  8. 2022-23 ద్రవ్యోల్బణం 6.7శాతం

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొకసారి వడ్డీ రేట్లు పెంచింది.

    50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.4శాతానికి చేరింది. అగస్ట్ 2019 తరువాత వడ్డీ రేట్లు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

    అంతర్జాతీయంగా అలుముకుంటున్న ఆర్థికమాంద్యం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం, తైవాన్-చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థికవ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి.

    ఆర్‌బీఐ అంచనాలు:

    2022-23 ద్రవ్యోల్బణం: 6.7శాతం

    2023-24 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం: 5శాతం

    2022-23 జీడీపీ: 7.2శాతం

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. మండే ఎండలతో ఉద్యోగులకు సెలవులు

    ఇరాక్‌లో వేడికి అల్లాడిపోతున్న ప్రజలు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    ఇరాక్‌లో ఎండలు మండిపోతుండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు.

    ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నారు.

    సుమారు 10 ప్రావిన్సులలో పనులు నిలిపివేసినట్లు కర్దిస్తాన్‌24 రిపోర్ట్ చేసింది.

    ఇరాక్‌లో ఎండలు కొత్తకాదు కానీ ఈసారి మాత్రం బాగా మండిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

    పోర్టు ప్రాంతమైన బాస్రాలో నాలుగు రోజులు సెలవు ప్రకటించారు.

  10. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  11. థాయిలాండ్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు... 14 మంది మృతి

  12. ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?

  13. తెలంగాణ: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?

  14. భార్య కోరినట్లు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన భర్త

  15. అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి

  16. తైవాన్ యువతీయువకులు వీధి పోరాటాలు, తుపాకుల వాడకంలో ఎందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు?

  17. హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KCR

    హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

    ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ & హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్’ అని దీన్ని పిలుస్తున్నారు.

    నేరాలను నిర్మూలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం తెలంగాణ పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్

    ఫొటో సోర్స్, Facebook/KTR

  18. టాలీవుడ్: నిర్మాతలే సినిమా షూటింగులను నిలిపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనివల్ల ఎవరికి లాభం

  19. అచ్యుతాపురం గ్యాస్ లీక్: దుస్తుల పరిశ్రమలో విష వాయువులు ఎలా విడుదలయ్యాయి? దీని వెనుక ఏముంది

  20. దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలను కలుపుతున్న పాకిస్తానీ యూట్యూబర్