తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. ‘నేడు థాయిలాండ్‌కు గోటబయ రాజపక్ష’

    శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష

    ఫొటో సోర్స్, Getty Images

    శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష థాయిలాండ్‌లో తాత్కాలికంగా కొంతకాలం ఉండనున్నట్లు అల్‌జజీరా, రాయిటర్స్ తెలిపాయి.

    ఈమేరకు నేడు ఆయన బ్యాంకాక్‌కు చేరుకోనున్నారు.

    శ్రీలంక దివాలా తీయడానికి గోటబయ విధానాలే కారణమంటూ జులైలో అక్కడి ప్రజలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.

    నాడు నిరసనలు ఉధృతం అవుతున్న తరుణంలో గోటబయ రాజపక్ష శ్రీలంక విడిచి పారిపోయారు. మాల్దీవుల మీదుగా జులై 14న సింగపూర్ చేరుకున్నారు.

    మానవీయ దృక్పథంతో గోటబయను తమ దేశంలో కొంత కాలం ఉండనిస్తున్నట్లు థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఒచా తెలిపారు.

    డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉన్న గోటబయ రాజపక్ష థాయిలాండ్‌లో 90 రోజుల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు.

  2. కోరుకొండ సుబ్బారెడ్డి: ఈ ఆదివాసీ నాయకుడిని బ్రిటిషర్లు ఉరితీసి, రాజమండ్రి కోటగుమ్మం దగ్గర వేలాడదీశారా?

  3. గత 24 గంటల్లో 16,299 కరోనా కేసులు

    గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 19,431 మంది కోలుకున్నారు.

    ప్రస్తుతం దేశంలో 1,25,076 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.58శాతంగా ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. అరవింద్ కేజ్రీవాల్: ‘ఉచితాలు రద్దు చేయాలంటున్నారు.. కేంద్రం దగ్గర డబ్బంతా ఎటు పోయింది?’

  5. 85 ఏళ్ళ వయసులోనూ వంటలు చేస్తూ బ్రిటన్‌లో రెస్టారెంట్ నడుపుతున్న ఇండియన్ బామ్మ

  6. హిందీ సినిమాలపై విద్వేష ప్రచారాల వెనుక ఎవరున్నారు?

  7. కరోనావైరస్: కోవిడ్ నిరోధానికి కోర్బివ్యాక్స్ బూస్టర్ డోసు తీసుకోవచ్చు - కేంద్రం అనుమతి

    కోర్బివ్యాక్స్

    ఫొటో సోర్స్, ANI

    కోవిడ్ మహమ్మారి మీద పోరాడటానికి కోర్బివ్యాక్స్ వ్యాక్సీన్‌ను బూస్టర్ డోసుగా ఉపయోగించవ్చునని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసే ఈ వ్యాక్సీన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చునని పేర్కొంది.

    దేశంలో 18 సంవత్సరాల పైబడిన వారు.. కోవ్యాక్సీన్ కానీ, కోవిషీల్డ్ కానీ రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత లేదా 26 వారాల తర్వాత కోర్బివ్యాక్స్ బూస్టర్ డోసు తీసుకోవచ్చు.

    ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. బాంబు పేలుడులో గాయపడి బోనులో బతికిన ఏనుగు మళ్లీ స్వేచ్ఛగా అడవిలోకి ఎలా వెళ్లిందంటే...

  9. ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

  10. అఫ్గానిస్తాన్‌లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్న గర్భవతులు, నవజాత శిశువులు...

  11. నిన్నటి దాకా తుపాకులు పట్టుకుని తిరిగాడు. ఇవాళ అర్బన్ డెవలప్‌మెంట్ వ్యవహారాలు చూస్తున్నాడు

  12. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆగస్టు 27ను జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు

    భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌ను రాష్ట్రపతి నియమించారని, ఆయన ఈ నెల 27న బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. 2014 నుంచి ఉదయ్ ఉమేశ్ లలిత్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారని, బార్ నుంచి నేరుగా ప్రధాన న్యాయమూర్తి అయిన వారిలో ఆయన రెండో వారని కూడా ఆ ప్రకటనలో తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. భార్యాభర్తలు గొడవపడితే అమ్మాయినే సర్దుకుపొమ్మంటారు, అబ్బాయిని ‘ఏం జరిగింది’ అని కూడా అడగలేరు, ఎందుకు

  14. వరవరరావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు.. ముంబయి విడిచి వెళ్లరాదంటూ షరతు

  15. చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుకు కాంస్య పతకం.. చరిత్ర సృష్టించిన హంపి, హారికల బృందం

    తానియా సచ్‌దేవ్, కోనేరు హంపి, ఆర్ వైశాలి, ద్రోణవల్లి హారిక ఉన్నారు

    ఫొటో సోర్స్, FIDE

    ఫొటో క్యాప్షన్, తొలి చెస్ ఒలింపియడ్ పతకం గెలిచిన భారత మహిళా జట్టులో (కుడి నుంచి) తానియా సచ్‌దేవ్, కోనేరు హంపి, ఆర్ వైశాలి, ద్రోణవల్లి హారిక ఉన్నారు

    ఈసారి చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం భారత మహిళల చెస్ జట్టుదేనని ఖాయంగా అనుకున్నారు. కానీ ఒకటిన్నర రోజులో పరిస్థితి తారుమారైంది. భారత బృందం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    అయినాసరే. భారత మహిళల బృందం చరిత్ర సృష్టించింది. ఎందుకంటే చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు ఒక పతకం గెలవటం ఇదే తొలిసారి.

    గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో పాటు.. తానియా సచ్‌దేవ్, ఆర్.వైశాలి, భక్తి కులకర్ణి వంటి హేమాహేమీలు, యువ క్రీడాకారిణిలతో కూడి బృందం ఈ ఘనతను సాధించింది.

    తమిళనాడులోని మామళ్లపురంలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో.. రష్యా కానీ, చైనా కానీ ఈ ఒలింపియాడ్‌లో పాల్గొనకపోవటం కూడా భారత జట్టుకు కలిసివచ్చింది. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న భారత క్రీడాకారిణిలదే బంగారు పతకమని అందరూ అంచనా వేశారు.

    అయితే ఫైనల్ రౌండ్‌కు ముందు భారత జట్టు అమెరికా చేతిలో 1-3 పాయింట్లతో ఓడిపోయింది. హంపి, వైశాలి తమ గేమ్‌లను డ్రా చేసుకుంటే.. తానియా, భక్తిలు ఓటమి పాలయ్యారు.

    ఫైనల్ రౌండ్ ముగిశాక.. యుక్రెయిన్‌కు గోల్డ్ మెడల్, జార్జియాకు సిల్వర్ మెడల్ లభించాయి. అప్పుడు కాంస్య పతకం భారత్‌కు దక్కాలా, అమెరికాకు ఇవ్వాలా అనే సందిగ్ధత తలెత్తింది.

    చివరికి పాయింట్లు ఇండియాకు ఫేవర్‌గా ఉండటంతో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అమెరికా నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

    2012లో ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో.. భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఒక స్థానం పెరిగి కాంస్య పతకం గెలుచుకోవటానికి దశాబ్దం పట్టింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. అబ్బాయిలు నెయిల్ పాలిష్ వేసుకున్నా, నగలు ధరించినా ‘గే’ అని అనుకోవాలా?

  17. బ్రేకింగ్ న్యూస్, బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం

    నితీశ్ కుమార్

    ఫొటో సోర్స్, ANI

    బిహార్ ముఖ్యమంత్రిగా 8వసారి నితీశ్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు.

    బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆయన మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు.

    నేడు లాలూ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఉజ్వల పథకం: వంట గ్యాస్‌ వాడకం ఆపేసి, మళ్లీ కట్టెల పొయ్యికి మొగ్గు చూపుతున్న నిరుపేద కుటుంబాలు

  19. బ్రేకింగ్ న్యూస్, భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ పొడిగింపు

    రచయిత వరవరరావు

    ఫొటో సోర్స్, Virasam.org

    భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ పొడిగింపు ఇచ్చింది.

    82 ఏళ్ల వరవరరావు అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

    జస్టిస్ ఉదయ్ ఉమేవ్ లలిత్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.

  20. హైదరాబాద్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ టీకాకు ఆమోదం

    కోవిడ్-19 వ్యాక్సిన్

    ఫొటో సోర్స్, Biologicale.com

    హైదరాబాద్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘బయోలాజికల్-ఇ’ రూపొందించిన ‘కార్బివ్యాక్స్’ కోవిడ్-19 టీకాను 18 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.

    కార్బివ్యాక్స్ అనేది బూస్టర్ డోస్. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు తీసుకున్న 6 నెలలకు కార్బివ్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

    దేశీయంగా తయారైన కార్బివ్యాక్స్‌కు ఆమోదం లభించడం ద్వారా మన సామర్థ్యం మరొకసారి తెలిసిందని బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల అన్నారు.