మాలి: ఒకే కాన్పులో 9 మంది జననం.. అయిదుగురు ఆడబిడ్డలు, నలుగురు మగపిల్లలు

ఒకే కాన్పులో 9 మంది జననం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ఆఫ్రికా దేశం మాలిలో ఓ మహిళ ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చింది.

హలిమా సిసీ(25) అనే ఆమె మంగళవారం మొరాకోలోని ఓ ఆసుపత్రిలో అయిదుగురు ఆడ శిశువులు, నలుగురు మగ బిడ్డలకు జన్మనిచ్చినట్లు మాలి ఆరోగ్య మంత్రి ఫాంటా సిబీ చెప్పారు.

శస్త్రచికిత్స చేసి ఆమెకు కాన్పు చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.

తల్లి, తొమ్మిది మంది బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని.. కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తరువాత వారిని డిశ్చార్జ్ చేస్తారని మంత్రి తెలిపారు.

హలిమా సిసీ గర్భంలో 9 మంది ఉన్నట్లు తెలిసిన తరువాత అరుదైన కేసు అని గుర్తించి మాలి ప్రభుత్వ నేతలు ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఆమెకు మంచి వైద్యం అందించడం కోసం మొరాకోకి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

కాగా మొరాకోలో ఇలాంటి కాన్పు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ దేశ ఆరోగ్య మంత్రి అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

ఒకే కాన్పులో ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడంతో పాటు వారంతా ఆరోగ్యంగా ఉండడం అరుదైన విషయమని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)