You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కెనడా కాల్పులు: కనిపించిన వాళ్ళందరినీ కాల్చుతూ పోయాడు... 16 మందిని చంపేశాడు
కెనడాలోని నోవా స్కొయా ప్రాంతంలోని ఓ వ్యక్తి పోలీసు దుస్తులు ధరించి వారి వాహనాన్ని పోలిన వాహనంలో వచ్చి 16 మందిని పొట్టనబెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళా పోలీసు ఉద్యోగి కూడా ఉన్నారు.
సుమారు 12 గంటల పాటు నిందితుని కోసం గాలించారు పోలీసులు. చివరకు దాడి చేసిన వ్యక్తి కూడా మరణించారు. శనివారం ఈ దాడి జరిగిన తర్వాత పొర్టాపిక్యూ పట్టణ పరిసరాల్లో ప్రజలందరూ పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.
మరణాలపై కొనసాగుతున్న సస్పెన్స్
పోలీసు వాహనాన్ని పోలి ఉన్న వాహనంలో అనుమానితుడు తిరుగుతున్నాడని పోలీసులు మొదట చెప్పారు.
నోవా స్కొటియాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలపై ఆ వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో ఎంత మంది చనిపోయారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు ఆదివారం అన్నారు.
మరణించిన వారిలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆమె మృతి పట్ల సహచర అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
“మొదట్లో గన్ మెన్ ఎవర్నో ఉద్ధేశించి కాల్పులు జరుపుతున్నాడని ఆమె భావించారు. కానీ, ఆ తర్వాత ఆయన కనిపించిన వాళ్లందర్నీ కాల్చుతూ పోయాడు.” అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ బెరెండా లూకీ సీబీసీ న్యూస్‌కి చెప్పారు.
“ఇదో అత్యంత భయానక పరిస్థితి.” అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి 51 ఏళ్ల గార్బియెల్ వోర్ట్మన్ అని నోవా స్కోటియా పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆయన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు ఉద్యోగి కాదని, బహుశా వారికి చెందిన యూనిఫాం వేసుకొని ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
పోలీసుల వాహనాలతో పోల్చినప్పుడు అనుమానితుడు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ నెంబరు తేడా ఉందని విచారణలో తేలింది.
కాల్పులు మొదలుపెట్టిన కాసేపటి తర్వాత గన్ మెన్ చిన్న సిల్వర్ కలర్ షవర్లే ఎస్‌యూవీ వాహనంలోకి మారాడు.
అయితే, అనుమానిత గన్ మెన్ ఎలా మరణించాడన్న విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అమెరికాతో పోల్చితే అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలుండే కెనడాలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరగడం చాలా అరుదు.
2019లో ఇద్దరు యువకులు ముగ్గుర్ని కాల్చి చంపిన ఘటన జరిగింది. అంతకుముందు 1989లో క్యూబెక్‌లోని ఓ కాలేజీలోని తరగతి గతంలో పురుషులందర్నీ బయటకు పంపిన జరిపిన కాల్పుల్లో 14మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్; హెలికాప్టర్ మనీ అంటే ఏంటి... అది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరమా?
- సంతానోత్పత్తి కేంద్రాల మూసివేత.. తల్లులు కాలేమేమోనని భయపడుతున్న మహిళలు
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్: కేరళ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎలా విజయం సాధించింది?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)