You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.
1. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా?
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా?
వస్తే బీజేపీలో చేరతారా లేదా?
కేవలం క్యాంపెయిన్ చేస్తారా లేక తెరవెనక నుంచే కథ నడిపిస్తారా?
లేక చివరిదాకా ఊరించి రజనీకాంత్‌లాగ నీరుగారిపోతారా?
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశం నేపథ్యంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
2.ఎన్‌డీటీవీలో ఎంత వాటాను అదానీ సొంతం చేసుకున్నారు.. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
అదానీ గ్రూపు ఎన్‌డీటీవీలో పెద్ద వాటాను కొనుగోలు చేసింది.
మరో 26 శాతం వాటాను కొనటానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
ఈ డీల్‌ను అర్థం చేసుకునేందుకు 5 ముఖ్యాంశాలివే.
ఇవి కూడా చదవండి
3. 'ముధోల్ హౌండ్' కుక్క ప్రత్యేకతలేంటి... దాన్ని ప్రధాని మోదీ భద్రతా బృందంలోకి ఎందుకు తీసుకుంటున్నారు?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతా బృందంలోకి స్వదేశీ జాతికి చెందిన ముధోల్ వేట కుక్కలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ కుక్కలు భారతీయ ఇళ్లల్లో సాధారణంగా తినే తిండినే తింటాయి. వీటికి రోజుకు రెండు సార్లు మొత్తం అరకేజీ మొక్క జొన్న, గోధుమలు, కందిపప్పు పెడితే చాలు.
ముధోల్ జాతి కుక్కల లక్షణాలు ఆశ్చర్యపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
4. అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు మూలంగా ఓ అద్భుతం బయటపడింది. అక్కడ 11.3 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ల పాదముద్రల్ని గుర్తించారు. దాదాపు పూర్తిగా ఎండిపోయిన ఒక నది ఒడ్డున వీటిని నిపుణులు కనుగొన్నారు.
భారీగా ఉన్న ఈ అడుగుల గుర్తులు డైనోసార్ల పాదముద్రల్లా ఉన్నాయి. నది ఒడ్డున అనేక పొరలుగా పేరుకుపోయిన బురద అడుగు భాగంలో ఇవి కనిపించాయి.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
5. పుచ్చకాయలు తింటే ఒకప్పుడు మనుషులు చనిపోయేవారా... ఆ విష పదార్థాలు ఇప్పుడు ఏమయ్యాయి?
పుచ్చకాయలను వేల ఏళ్ల నుంచీ ఆహారంగా తీసుకుంటున్నారు. ఈజిప్టులో 4,300 ఏళ్ల క్రితం అక్కడి ప్రజలు వీటిని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
అయితే, ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో అత్యంత ప్రాచీనమైన పుచ్చకాయల విత్తనాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 6,000 ఏళ్లనాటివని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ ప్రాచీన పుచ్చకాయల విత్తనాలకు శాస్త్రవేత్తలు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే పుచ్చకాయల కంటే ఇవి చాలా భిన్నమైనవని వారి పరిశోధనలో తేలింది.
పూర్తి కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
- కాల్ సెంటర్ ఉద్యోగుల ఇండియన్ ఇంగ్లీష్‌ను అమెరికన్ ఇంగ్లీష్‌గా మార్చే స్టార్టప్.. ఈ టెక్నాలజీ జాతి వివక్ష నుంచి రక్షిస్తుందా లేదా?
- నోయిడా ‘‘ట్విన్ టవర్స్’’ను పేలుడు పదార్థాలతో ఎలా కూలగొడుతున్నారు?
- మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- మీ పిల్లలు అసాధారణ ప్రజ్ఞావంతులని గుర్తించడం ఎలా... వండర్ కిడ్స్ అంటే ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)