తస్నీమ్ మీర్: BWF అండర్-19లో నంబర్-1 స్థానాన్ని అందుకున్న తొలి భారతీయ షట్లర్

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

బ్యాడ్మింటన్ ప్లేయర్ తస్నీమ్ మీర్ బుధవారం నాడు బీడబ్యుఎఫ్ అండర్-19 వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించారు. 16 ఏళ్ల మీర్ జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 10,810 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

బీడబ్ల్యుఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్ 2011లో మొదలయ్యాయి. అప్పటికి జూనియర్ అయిన సైనాకు ర్యాంక్ లభించలేదు. సింధు మాత్రం అండర్-19లో ఆడుతున్న రోజుల్లో వరల్డ్ నంబర్-2గా స్థానం దక్కించుకున్నారు.

బాలుర సింగిల్స్‌లో షట్లర్లు లక్ష్య సేన్, సిరిల్ వర్మ, ఆదిత్య జోషిలు నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.

గుజరాత్‌కు చెందిన 16 ఏళ్ల తస్నీం నాలుగు జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చాంపియన్‌షిప్ గెల్చుకున్నారు. వాటిలో గత ఏడాది అంటే 2021లోనే మూడు టైటిల్స్ - బల్గేరియన్ జూనియర్ చాంపియన్‌షిప్, ఆల్ప్స్ ఇంటర్నేషనల్, బెల్జియన్ జూనియర్ చాంపియన్‌షిప్ - గెల్చుకున్నారు. దాంతో, ఆమెకు టాప్ ర్యాంక్ ఖరారైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)