బేరూత్ పేలుళ్ల కేసు: లెబనాన్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఆరుగురు మృతి - Newsreel

లెబనాన్

ఫొటో సోర్స్, AFP

ప్రచురణ

లెబనాన్ రాజధాని బేరూత్‌లో నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు.

గత ఏడాది బేరూత్ నౌకాశ్రయాన్ని కుదిపేసిన భారీ పేలుళ్లపై విచారణకు వ్యతిరేకంగా షియా ముస్లిం సంస్థలు హెజ్బొల్లా, అమల్ నిరసనలు చేపడుతున్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి.

లెబనీస్ ఫోర్సెస్ (ఎల్‌ఎఫ్)కు చెందిన క్రిస్టియన్ స్నైపర్స్ ఈ కాల్పులు జరిపారని వార్తలు వచ్చాయి. అయితే, తాము ఎలాంటి కాల్పులూ జరపలేదని ఎల్‌ఎఫ్ వివరించింది.

గత ఏడాది చోటుచేసుకున్న బేరూత్ నౌకాశ్రయ పేలుళ్లలో 219 మంది మరణించారు. అయితే, దీనిపై విచారణ చేపడుతున్న జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.

అయితే, బాంబు పేలుళ్ల బాధితుల కుటుంబాలు మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించాయి.

ఆగస్టు 2020లో జరిగిన ఆ పేలుళ్లను తామే చేపట్టామని ఇప్పటివరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించుకోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)