లెబనాన్ పేలుడులో వందమందికిపైగా మృతి
లెబనాన్ రాజధాని బేరూత్‌లో భారీ పేలుడు సంభవించింది. 100 మందికిపైగా ఈ పేలుడులో చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు.
బేరూత్‌లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలో దట్టమైన పొగ మేఘం కమ్ముకోవడం కనిపించింది.
అక్కడి ఓ గోదాంలో ఆరేళ్లుగా విధ్వంసక పదార్థాలు నిల్వ ఉంచడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భద్రత చర్యలు లేకుండా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడం' ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాద'ని లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు.
పేలుడుకు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోంది. బాధ్యులకు 'గరిష్ఠ శిక్ష' తప్పదని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)