రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్... క్వారెంటైన్‌లో కేజ్రీవాల్ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు కోవిడ్ సోకిందని తెలిపారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని రాహుల్ గాంధీ కోరారు.

క్వారెంటైన్లో కేజ్రీవాల్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయన భార్య సునీతకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారు. దాంతో, కేజ్రీవాల్ కూడా క్వారెంటైన్లోకి వెళ్లారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)