రైతులు, ప్రభుత్వం మధ్య ముగిసిన చర్చలు.. తదుపరి భేటీ 5వ తేదీన - Newsreel

నరేంద్ర సింగ్ తోమర్

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిశాయి.

అయితే చర్చలను మాత్రం కొనసాగించాలని, డిసెంబర్ 5వ తేదీ శనివారం మరొకమారు భేటీ కావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అహాన్ని ప్రదర్శింకుండా రైతుల ప్రతినిధులతో చర్చలు జరుపుతోందని తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాగా, (నూతన వ్యవసాయ చట్టాల్లో) తాము కొన్ని లోపాలను ఎత్తిచూపామని, ప్రభుత్వం కూడా ఆ లోపాలను అంగీకరించిందని రైతుల ప్రతినిధి బల్‌దేవ్ సింగ్ సిస్రా తెలిపారు.

ఆ లోపాలను సరిదిద్దుతూ తాము సవరణలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, తాము మాత్రం సవరణలు వద్దని, చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని కోరామన్నారు.

అలాగే కనీస మద్దతు ధర అమలు చేయటాన్ని తప్పనిసరి చేయాలని, దీనికి చట్టం చేయాలని కోరామన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రకాశ్ సింగ్ బాదల్

ఫొటో సోర్స్, PTI

ప్రకాశ్ సింగ్ బాదల్: 'పద్మ విభూషణ్' వెనక్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం.. రైతుల ఆందోళనకు మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా తనకు లభించిన పద్మ విభూషన్ పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నట్లు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు.

ఈ మేరకు ఆయన రాష్ట్రపతి భవన్‌కు లేఖ రాశారు.

బాదల్ లేఖ

శాంతిపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఆశ్చర్యపరుస్తోందని బాదల్ పేర్కొన్నారు.

దేశ జనాభాలోని 70 శాతం ఉన్న రైతాంగం తరపున తాను ఈ లేఖ రాస్తున్నానని, 70 ఏళ్లుగా వారిని అన్నదాతలు అని కీర్తిస్తున్నామని గుర్తు చేశారు.

విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థితి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చింది రైతులేనని తెలిపారు.

అలాంటి రైతులు ఇప్పుడు తమ హక్కుల కోసం రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వెల్లడించారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు: 'బాధితులు కోరితే సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు సీసీటీవీ ఫుటేజి ఇవ్వాలి'

మానవ హక్కుల ఉల్లంఘనపై అనుమానాలు వచ్చినప్పుడు బాధిత పక్షాలు కోరితే సీబీఐ, ఈడీ సహా ఇతర విచారణ సంస్థలు ఇంటరాగేషన్‌కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది.

నిందితుల వాంగ్మూలాల ఆడియో-వీడియో రికార్డులతోపాటు, దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అవసరంపై పరమ్‌వీర్‌ సింగ్‌ సైనీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ నేతృత్వంలో జస్టిస్‌ కె.ఎమ్‌.జోసెఫ్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించి చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌(ఎన్‌సీబీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌( డీఆర్‌ఐ), ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)లాంటి సంస్థల కార్యాలయాల్లో సీసీ కెమెరాలను అమర్చాల్సిందిగా సుప్రీంకోర్టు తన తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

“రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ తీర్పు చాలా కీలకమైంది. దీనిపై రెండున్నర సంవత్సరాల కిందట మేం ఇచ్చిన ఆదేశాలు ఇంత వరకు అమలు కాలేదు. ఈసారైనా ఈ తీర్పు స్ఫూర్తిని పోలీసులు, ఇతర అధికారులు అమలుపరుస్తారని ఆశిస్తున్నాం” అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఈ తీర్పుపై తదుపరి చర్యలతోపాటు ఎప్పటిలోగా అమలు చేస్తారో తెలుపుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ/క్యాబినెట్‌ సెక్రటరీ/ వివిధ రాష్ట్రాలు/ కేంద్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ఈ రోజు నుంచి ఆరు వారాల్లోగా ఈ వివరాలు అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)