అర్ణబ్ గోస్వామి: రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. ‘తిన్నగా నిల్చో’మని చెప్పిన న్యాయమూర్తి

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్రలోని రాయగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తన ఇంటిలోకి ముంబయి పోలీసులు ప్రవేశించిన తరువాత అరెస్టు చేసే క్రమంలో పోలీసులు తనపై భౌతిక దాడికి దిగారని గోస్వామి ఆరోపించారు.
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
అలీబాగ్ కోర్టు అర్ణబ్ గోస్వామిని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది నవంబరు 18 వరకు వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారని 'బీబీసీ మరాఠీ' ప్రతినిధి మయాంక్ భగవత్ తెలిపారు.
కోర్టులో ఏం జరిగింది..?
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గోస్వామిని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాల్‌లోకి వచ్చిన తరువాత ఆయన పోలీసులు తనను కొట్టారని ఆరోపణలు చేశారు.
దాంతో కోర్టు మరోసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించగా ఆ మేరకు పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం ఆయన్ను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసులు, అర్ణబ్ తమతమ వాదనలు వినిపించారు. వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్ల పరిశీలనలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఫొటో సోర్స్, SATISH BATE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
మెడికల్ రీఎగ్జామినేషన్ తరువాత కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు 'సరిగా నిల్చోవాలని' న్యాయమూర్తి హెచ్చరించారు. హావభావాలనూ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.. దాంతో ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నారు.
అంతకుముందు కోర్టులోకి తేగానే ఆయన పెద్దపెద్ద కేకలు వేస్తూ పోలీసులు తనను కొట్టారని ఆరోపించారు. అదంతా ఆయన బంధువులు వీడియో తీశారు.
మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ కస్టడీ కోరారు. అర్ణబ్ విచారణకు సహకరించలేదన్న రాయగఢ్ పోలీసుల వాదన తప్పని ఆయన తరఫు లాయర్ చెప్పారు.
పోలీసు కస్టడీకి బలమైన కారణాలు, అందుకు ఆధారాలు కావాలని.. అవేమీ ఇవ్వనందున పోలీస్ కస్టడీకి ఇవ్వలేమని కోర్టు చెప్పింది. అర్ణబ్, ఈ కేసులో ఉన్న ఫిరోజ్ షేక్, నితేశ్ శార్దాలను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది.
కాగా అర్ణబ్ బెయిల్ కోసం కోర్టునాశ్రయించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అరెస్ట్ సమయంలో
అంతకుముందు అరెస్టు సమయంలో హైడ్రామా నడిచింది. తన భార్య, కుమారుడు, అత్తమామలనూ పోలీసులు కొట్టారని గోస్వామి ఆరోపించారు.
పోలీసులు గోస్వామిని కూడా కొట్టారంటూ రిపబ్లిక్ టీవీలో దృశ్యాలు ప్రసారం చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
కాగా అర్ణబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్‌కు గురయ్యామని 'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' ఒక ప్రకటనలో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అర్ణబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి రిపబ్లిక్ టీవీ ఛానల్‌విగా చెబుతూ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో పోలీసులు అర్నబ్ గోస్వామి ఇంట్లోకి ప్రవేశించడం.. అక్కడ రెండు వర్గాల మధ్య గొడవకు సంబంధించిన చిత్రాలు షేర్ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లిక్ చానల్‌లో చూపించిన వీడియోలో.. పోలీసులు అర్నబ్‌ను వ్యాన్‌లో కూర్చోబెట్టినట్లు ఉంది.
ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని ‘బీబీసీ మరాఠీ’ తెలిపింది.

ఫొటో సోర్స్, ANVAY NAIK
ఎవరీ అన్వయ్ నాయిక్? ఏమిటీ ఆత్మహత్య కేసు
రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్ణబ్ గోస్వామిని ఆ చానల్ స్టుడియో డిజైన్ చేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
అన్వయ్ నాయక్ 2018లో ఆత్మహత్య చేసుకున్నారు. గోస్వామి తన భర్తకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదని అన్వయ్ భార్య అప్పట్లో ఆరోపించారు.
గోస్వామి, రిపబ్లిక్ టీవీ ఆ ఆరోపణలను ఖండించాయి.
అన్వయ్ నాయక్, ఆయన తల్లి అలీబాగ్‌లోని తమ ఇంట్లో 2018 మేలో చనిపోయారు.
తన చావుకు కారణం అర్ణబ్ గోస్వామేనంటూ అన్వయ్ లేఖ రాసి చనిపోయారని అన్వయ్ భార్య అప్పట్లో ఆరోపించారు.
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇటీవల ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు.
"అన్వయ్ నాయిక్ భార్య, కూతురు నా దగ్గరకు వచ్చి అర్నబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారు. అందుకే మహారాష్ట్ర పోలీసులు అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తారు. అన్వయ్ నాయిక్ భార్య అక్షతా నాయిక్, కూతురు ప్రజ్ఞా నాయిక్ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది" అని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కొద్ది నెలల కిందట మహారాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు.
అర్ణబ్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మాట్లాడుతూ అనిల్ దేశ్‌ముఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఖండించిన ప్రకాశ్ జావడేకర్
అర్ణబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు.
‘మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నాను. మీడియాతో వ్యవహరించే పద్ధతి ఇది కాదు. ఇది ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ప్రతీకార చర్యల ప్రసక్తే లేదు: సంజయ్ రౌత్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అర్ణబ్ గోస్వామి అరెస్టుపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ మహారాష్ట్రలో చట్టాన్ని అమలు చేస్తారని అన్నారు. ఎవరికి వ్యతిరేకంగానైనా ఆధారాలు ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఉద్ధవ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునేలా చర్యలకు దిగలేదని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
‘సోనియా సేనా.. ఇంకా ఎంతమంది గొంతు నులుముతారు’
అర్ణబ్ గోస్వామి అరెస్ట్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ స్పందించారు.
''అర్ణబ్ గోస్వామి ఇంట్లోకి చొరబడి ఆయన్ను కొట్టారు.. జుత్తు పట్టి లాగారు. ఇలా ఎంతమంది ఇళ్లలో దూరుతారని నేను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది గొంతులను మీరు పట్టుకుంటారు? ఎంతమందిని జుత్తు పట్టి లాగుతారు? ఎన్ని గొంతులను మీరు నిశ్శబ్దంగా మారుస్తారు? సోనియా సేనా..!! ఎన్ని నోళ్లను మీరు మూయిస్తారు? ఈ స్వరాలు పెరుగుతూనే ఉంటాయి. మాకంటే ముందు ఎందరో అమరుల గొంతు నులిమారు'' అంటూ ఆమె వీడియో ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























