వికాస్ దుబే: కాన్పూర్‌లో 8 మంది పోలీసుల హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వికాస్ దుబే

ఫొటో సోర్స్, MP police

ఫొటో క్యాప్షన్, వికాస్ దుబే
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ మేరకు నిర్ధరించారు.

వికాస్ దూబేను అరెస్ట్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు సాధించిన విజయంగా నరోత్తమ్ తెలిపారు. ఆయన ఇంకా మధ్యప్రదేశ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వికాస్ దుబేను అరెస్ట్ చేసినందుకు ఆ రాష్ట్ర పోలీసులను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు.

తమ ప్రభుత్వం ఏ నేరస్థుడినీ వదిలిపెట్టబోదని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వికాస్ దుబే పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకు తిరిగాడు?

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వికాస్ దుబే అనేక కేసుల్లో నిందితుడు.

ఇటీవల ఆయనను అరెస్టుచేయ‌డానికి వ‌చ్చిన పోలీసుల‌పై ఆయన, ఆయన అనుచరులు ఆటోమేటిక్ ఆయుధాల‌తో కాల్పులు జ‌రిపారు.

దీంతో ఎనిమిది మంది పోలీసులు మ‌ర‌ణించారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌, గ్రామం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దుబే, అత‌డి అనుచ‌రుల కోసం కొన్ని పోలీసు బృందాల‌తోపాటు ప్ర‌త్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అత‌డి ఆచూకీ చెప్పినవారికి భారీ నజరానా కూడా ప్రకటించారు.

వికాస్ దుబే

ఫొటో సోర్స్, Sameeratmaj mishra

ఫొటో క్యాప్షన్, వికాస్ దుబే

హత్య, హత్యాయత్నం కేసులు.. పార్టీలతో సంబంధాలు

వికాస్ దూబేపై 60 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం కేసులూ ఉన్నాయి.

మ‌రోవైపు వికాస్ దుబేకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేనప్పటికీ యూపీలోని రాజకీయ పార్టీలన్నిటితోనూ సంబంధాలున్నట్లు చెబుతారు.

ఇటీవ‌ల జిల్లా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వికాస్ దుబే స‌తీమ‌ణి పోటీచేశారు.

ఆ స‌మ‌యంలో విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్ల‌పై స‌మాజ్‌వాదీ పార్టీ జెండా రంగులు క‌నిపించాయి.

మ‌రోవైపు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్‌, పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌ల ఫోటోలు పోస్ట‌ర్‌పై ఉన్నాయి.

కానీ, పోస్ట‌ర్‌పై పార్టీ ఎన్నిక‌ల గుర్తు క‌నిపించ‌లేదు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రులుగా బ‌రిలోకి దిగేట‌ప్ప‌టికీ చాలా మంది ఇలాంటి పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తార‌ని ఎస్పీ నాయ‌కుడు ఒక‌రు వివ‌రించారు.. దుబేకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మరోవైపు ఈ రోజు ఉదయమే కాన్పూర్‌లో వికాస్ దుబే అనుచరులు కొందరు పోలీస్ ఎన్‌కౌంటర్లో మరణించారు.

ప్రభాత్ మిశ్రా అనే నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి ఈ రోజు కాన్పూర్ తెస్తుండగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడని.. పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరపగా పోలీసులు తిరిగి కాల్చడంతో చనిపోయాడని కాన్పూర్ ఏడీజీ వెల్లడించారు.

మిశ్రాను బుధవారం హరియాణాలోని ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపేసిన ఘటన సమయంలో వికాస్ దుబేతో ఉన్న బహువా దుబే కూడా గురువారం ఉదయం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ మేరకు ఎటావా ఎస్ఎస్‌పీ ఆకాశ్ తోమర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)