ఆన్‌లైన్ లిక్కర్ యాప్.. లక్ష దాటిన డౌన్‌లోడ్‌లు : ప్రెస్ రివ్యూ

కరోనావైరస్ వ్యాప్తి న‌డుమ‌‌ లిక్కర్ షాపుల ఎదుట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్‌ చేయడం కష్టతరంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాప్తి న‌డుమ‌‌ లిక్కర్ షాపుల ఎదుట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్‌ చేయడం కష్టతరంగా మారింది.
ప్రచురణ

కేర‌ళ‌లో ఆన్‌లైన్ లిక్కర్ బుక్కింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు లక్షదాటిన‌ట్లు న‌మస్తే తెలంగాణ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

కరోనావైరస్ వ్యాప్తి న‌డుమ‌‌ లిక్కర్ షాపుల ఎదుట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్‌ చేయడం కష్టతరంగా మారింది. దీంతో కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ లో లిక్కర్ బుక్కింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది.

కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ బేవక్యూగా నామ‌క‌ర‌ణం చేసిన ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చిన గంటలకే 1 లక్షమందికి పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

బేవక్యూ అనేది ఆన్ లైన్ లో లిక్కర్ డెలివరీ యాప్ . సామాజిక దూరం పాటించేలా ఆన్ లైన్ లో లిక్కర్ బుక్ చేసుకున్న కష్టమర్లు అందిస్తుంది అంటూ కేరళ ప్రచారం చేస్తుంది.

సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కరోనా కేసులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో దిల్లీ ప్రభుత్వం మద్యం షాపుల్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

క‌రోనావైర‌స్ క‌ట్ట‌డికి న‌ర‌బ‌లిచ్చిన పూజారి

కరోనావైరస్‌ను తరిమికొట్టాలంటే దేవతలను సంతృప్తి పరచాలంటూ ఓ వ్యక్తిని పూజారి బ‌లిచ్చిన‌ట్లు ఈనాడు దిన‌ప‌త్రిక‌ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

ఒడిశా కటక్‌ జిల్లాలోని బందహుడా గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

బుధ‌వారం రాత్రి సరోజ్‌ కుమార్‌ ప్రధాన్‌(52)ను ప‌దునైన గొడ్డ‌ల‌తో 72ఏళ్ల పూజారి సన్సారీ ఓజా తల నరికి హతమార్చాడు. గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు నేరం తానే చేసినట్లు ఓజా అంగీకరించాడు.

కరోనావైరస్‌ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని పోలీసుల విచారణలో ఓజా చెప్పాడు.

ఘటన సమయంలో నిందితుడు ఫూటుగా తాగున్నాడని, ఉదయం తప్పు తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని వెల్లడించారు.

థియేటర్‌లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి.

ఫొటో సోర్స్, GettyImages

ఫొటో క్యాప్షన్, థియేటర్‌లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి.

సినిమా షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతులు

సినిమా, టీవీ షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలంగాణ‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడించారని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి. కళ్యాణ్, కె.ఎస్.రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖుల‌తో స‌మావేశం అనంతంర శ్రీనివాస్ గురువారం మాట్లాడారు.

ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని సినీ ప్ర‌ముఖులు కోరారు.

థియేటర్‌లను తెరిచిన అనంతరం ఎదురయ్యే సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. షూటింగ్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చ జరిగింది.

ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు.

థియేటర్‌లకు ప్రత్యేక విద్యుత్ టారీఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్‌లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిస్తామ‌ని శ్రీనివాస్‌ వివరించారు.

ఎయిర్ బ‌స్ A320 విమానాన్ని ప్ర‌త్యేకంగా బుక్‌ చేసుకోవ‌డానికి సుమారు రూ.20 ల‌క్ష‌లు అవుతుంది.

ఫొటో సోర్స్, GettyImages

ఫొటో క్యాప్షన్, ఎయిర్ బ‌స్ A320 విమానాన్ని ప్ర‌త్యేకంగా బుక్‌ చేసుకోవ‌డానికి సుమారు రూ.20 ల‌క్ష‌లు అవుతుంది.

కూతురి కోసం 180 సీట్ల విమానం బుక్ చేసిన లిక్క‌ర్ వ్యాపారి

క‌రోనావైర‌స్ ఎక్క‌డ సోకుతుందోనన్న భ‌యంతో త‌న కూతురి కోసం ఏకంగా 180 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న విమానాన్ని ఓ లిక్క‌ర్ వ్యాపారి బుక్‌చేసిన‌ట్లు వెలుగు దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా భోపాల్‌లో చిక్కుకుపోయిన త‌న కుమార్తె, ఆమె ఇద్ద‌రు బిడ్డ‌లు, ఒక ప‌నిమ‌నిషిని దిల్లీ పంప‌డం కోసం ఆయ‌న ఎయిర్ బ‌స్ A320ని బుక్‌చేశారు.

180 మంది కూర్చుని ప్ర‌యాణించ‌గ‌లిగే ఆ విమానం ప్ర‌త్యేకంగా దిల్లీ నుంచి సోమ‌వారంనాడు భోపాల్ చేరుకుంది. అక్క‌డి నుంచి ఆ వ్యాపారి కుమార్తె, మ‌న‌వ‌రాళ్లు, ఒక ప‌ని మ‌నిషి… మొత్తం న‌లుగురితోనే తిరుగు ప్ర‌యాణ‌మైంది.

ఎయిర్ బ‌స్ A320 విమానాన్ని ప్ర‌త్యేకంగా బుక్‌ చేసుకోవ‌డానికి సుమారు రూ.20 ల‌క్ష‌లు అవుతుంద‌ని ఏవియేష‌న్ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)