విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో భారీ ప్రమాదం.. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం పడి మంటలు, 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ‘బీబీసీ’తో చెప్పారు.

ప్లాంట్ ఎస్ఎంఎస్‌ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలడంతో ఉక్కు ద్రవం పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు.

భారీగా మంటలు చేలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు.

చనిపోయినవారిలో ఎస్ఎంఎస్-2 విభాగం చీఫ్ సహా అయిదుగురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ హోం మంత్రి అనిత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలంలో ఉద్యోగులతో మాట్లాడుతున్న ఏపీ హోం మంత్రి అనిత

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో కొందరు కార్మికులు మరణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ వెళ్లారు.

ప్రమాదానికి కారణాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.

సహాయక చర్యలు, భద్రతా చర్యలు, బాధిత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు.

గాయపడిన ఉద్యోగులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకోవడానికి, ఇతర సమాచారం పొందడానికి అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

08912590100, 08912590102 నంబర్లను కంట్రోల్ రూంలో అందుబాటులోకి తెచ్చారు.

ఈ నంబర్లకు ఫోన్ చేసి బాధితులకు సంబంధించిన వారు సమాచారం తెలుసుకోవచ్చు.

అంబులెన్సులు

‘విశాఖకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి’

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నట్లు వెల్లడించారు.

ప్రమాదం నేపథ్యంలో తాను విశాఖకు బయలుదేరినట్లు వెల్లడించిన శ్రీనివాస వర్మ.. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా సంఘటనా స్థలానికి వస్తున్నట్లు తెలిపారు.

బాధిత కుటుంబా లకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)