ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో, హాజరైన వారి ఐదుగురు పిల్లలు

దుబయ్‌లో జార్జియా రోడ్రిగ్స్, రొనాల్డో (2024లో)
ఫొటో క్యాప్షన్, దుబయ్‌లో జార్జినా రోడ్రిగ్స్, రొనాల్డో (2024 నాటి ఫోటో)
    • రచయిత, పాలిన్ కోలా
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన దీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్నారు.

మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జార్జియాతో రొనాల్డో వివాహం పోర్చుగల్‌లో సివిల్ వేడుక(చట్టబద్దంగా)గా జరిగింది. ఈ మేరకు రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో వారిద్దరి చేతి వేళ్లకు పెళ్లి ఉంగరాలు కనిపిస్తున్నాయి.

రొనాల్డో ఈ పోస్ట్ షేర్ చేసిన 30 నిమిషాల్లోనే 30 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ వేడుకను 'వెడ్డింగ్ ఆఫ్ ద ఇయర్'గా అభివర్ణించిన పోర్చుగీస్ మీడియా.. లిస్బన్ సమీపంలోని కాస్కాయిస్‌ పట్టణంలో ఆగస్టు 11న ఈ పెళ్లి జరిగిందని, వీరి ఐదుగురు పిల్లలు ఈ పెళ్లికి హాజరయ్యారని పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటో

ఫొటో సోర్స్, Ronaldo Instagram account

ఫొటో క్యాప్షన్, రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటో

రొనాల్డో, జార్జినా గత పదేళ్లుగా కలిసి ఉంటున్నారు. మాడ్రిడ్‌లోని గుచ్చి (Gucci) షోరూమ్‌లో జార్జినా పనిచేస్తున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో స్పానిష్ క్లబ్ 'రియల్ మాడ్రిడ్' తరఫున రొనాల్డో ఆడుతున్నారు.

నిరుడు ఆగస్టు 11న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

రొనాల్డో తన కెరీర్‌లో దాదాపు 1,000 గోల్స్ చేశారు. ఆయన లిస్బన్ కేంద్రంగా పనిచేసే స్పోర్టింగ్, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్, సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్‌లతో పాటు పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున ఆడారు.

రొనాల్డో ఇటీవలే తన ఆరో ప్రపంచకప్‌లో ఆడారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)