You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గ్లాస్గోలో జరుగుతున్న ఈ గేమ్స్ ఎంత ప్రత్యేకం?
కామన్వెల్త్ గేమ్స్... ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే భారీ అంతర్జాతీయ క్రీడోత్సవం ఇది. గతంలో బ్రిటిష్ కామన్‌వెల్త్ కూటమిలో భాగమైన దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి.
జులై 23న మొదలై ఆగస్టు 2 వరకు జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికగా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించి ఇది 23వ ఎడిషన్.
1930లో 'బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్' పేరిట ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి.
21వ శతాబ్దంలో బర్మింగ్‌హామ్, గోల్డ్ కోస్ట్, గ్లాస్గో, దిల్లీ, మెల్‌బోర్న్, మాంచెస్టర్ నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. 2026 పోటీల్లో 74 దేశాలు, విభిన్న క్రీడాంశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.
ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ లాగా గ్రేట్ బ్రిటన్ ఈ క్రీడల్లో ఒకే జట్టుగా పాల్గొనదు. గ్రేట్ బ్రిటన్‌లో భాగమైన దేశాలన్నీ ఇక్కడ వేర్వేరు జట్లుగా బరిలోకి దిగుతాయి. అంటే ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ కలిసి ఒకే జట్టుగా కాకుండా ఒకదానిపై ఒకటి పోటీపడతాయన్నమాట.
బ్రిటిష్ సామ్రాజ్యంతో చారిత్రక సంబంధాలున్న దేశాలు పాల్గొనే ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌ను ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌కు చిన్న ఎడిషన్‌గా భావిస్తారు.
వీటిని ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి, ఒలింపిక్స్-పారాలింపిక్స్ క్రీడల మధ్య వచ్చే విరామ కాలంలో నిర్వహిస్తారు.
అలాగే, పారా క్రీడాంశాలకు (Para-events) సాధారణ క్రీడలతో సమానంగా చోటు కల్పించిన తొలి ఇంటర్నేషల్ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌గా కూడా కామన్వెల్త్ గేమ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఏయే క్రీడలు ఉన్నాయి?
కామన్‌వెల్త్ గేమ్స్-2026 ఎడిషన్‌లో మొత్తం 10 క్రీడాంశాలు భాగంగా ఉన్నాయి. 2014 గ్లాస్గో గేమ్స్‌లోని 17 క్రీడలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ.
ఈసారి హాకీతో పాటు రాకెట్‌తో ఆడే క్రీడలన్నింటినీ ఈ టోర్నీ నుంచి తొలగించారు.
అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, జూడో వంటి క్రీడలకు తుదిజాబితాలో చోటు దక్కింది.
అథ్లెటిక్స్, ఈత, ట్రాక్ సైక్లింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో పారా క్రీడాంశాలను కూడా నిర్వహిస్తున్నారు.
కామన్‌వెల్త్ గేమ్స్-2026 క్రీడల జాబితా
- అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్ మాత్రమే)
- స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్
- ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్
- ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్
- నెట్‌బాల్
- వెయిట్ లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్
- బాక్సింగ్
- జూడో
- బౌల్స్, పారా బౌల్స్
- 3x3 బాస్కెట్‌బాల్, 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్
ఏయే దేశాలు పాల్గొంటున్నాయి?
కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGA)కి చెందిన 74 సభ్య దేశాలు ఈసారి గ్లాస్గో పోటీల్లో పాల్గొంటున్నాయి.
వీటిలో 55 దేశాలు, 9 బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 4 దేశాలు, 3 క్రౌన్ డిపెండెన్సీలు, న్యూజీలాండ్ రాజ్యాంగంతో అనుసంధానమైన 2 అసోసియేటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఎక్స్‌టర్నల్ టెరిటరీకి చెందిన జట్లు ఈ క్రీడల్లో తలపడుతున్నాయి.
2026లో తొలిసారిగా ఈ క్రీడల్లో పాల్గొంటున్న గాబన్, టోగో దేశాలకు బ్రిటిష్ సామ్రాజ్యంతో ఎలాంటి చారిత్రక సంబంధాలు లేవు. ఈ రెండు దేశాలు 2022లో కామన్‌వెల్త్ కూటమిలో చేరాయి.
కామన్వెల్త్ గేమ్స్-2026లో పాల్గొంటున్న దేశాలివే
- ఆంగ్విలా
- ఆంటిగ్వా అండ్ బార్బుడా
- ఆస్ట్రేలియా
- బంగ్లాదేశ్
- బార్బడోస్
- బెలిజ్
- బెర్ముడా
- బోట్స్‌వానా
- బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్
- బ్రూనై దారుస్సలామ్
- కామెరూన్
- కెనడా
- కేమాన్ ఐలాండ్స్
- కుక్ ఐలాండ్స్
- సైప్రస్
- డొమినికా
- ఇంగ్లండ్
- ఎస్వాతిని
- ఫాక్‌లాండ్ ఐలాండ్స్
- ఫిజి
- గాబన్
- ఘనా
- జిబ్రాల్టర్
- గ్రెనెడా
- గెర్న్‌సీ
- గయానా
- భారత్
- ఐల్ ఆఫ్ మ్యాన్
- జమైకా
- జెర్సీ
- కెన్యా
- కిరిబాటి
- లెసోథో
- మలావి
- మలేసియా
- మాల్దీవులు
- మాల్టా
- మారిషస్
- మోంట్ సెరాట్
- మొజాంబిక్
- నమీబియా
- నౌరు
- న్యూజీలాండ్
- నైజీరియా
- నియు
- నార్ఫోక్ ఐలాండ్
- నార్తర్న్ ఐలాండ్
- పాకిస్తాన్
- పపువా న్యూ గినియా
- రువాండా
- సెయింట్ లూసియా
- సమోవా
- స్కాట్లాండ్
- సీషెల్స్
- సియెర్రా లియోన్
- సింగపూర్
- సాలమన్ ఐలాండ్స్
- దక్షిణాఫ్రికా
- శ్రీలంక
- సెయింట్ హెలీనా
- సెయింట్ కీట్స్ అండ్ నేవిస్
- సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్
- ది బహమాస్
- ది గాంబియా
- టోగో
- టోంగా
- ట్రినిడాడ్ అండ్ టొబాగో
- టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్
- తువాలు
- ఉగాండా
- వనౌటు
- వేల్స్
- జాంబియా
అత్యుత్తమ రికార్డు ఉన్న దేశాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు అత్యధిక పతకాలు సాధించిన దేశాలు
- ఆస్ట్రేలియా: 2,604 పతకాలు (1,003 స్వర్ణాలు, 834 రజతాలు, 767 కాంస్యాలు)
- ఇంగ్లండ్: 2,322 పతకాలు (773 స్వర్ణాలు, 783 రజతాలు, 766 కాంస్యాలు)
- కెనడా: 1,647 పతకాలు (510 స్వర్ణాలు, 548 రజతాలు, 589 కాంస్యాలు)
- న్యూజీలాండ్: 706 పతకాలు (179 స్వర్ణాలు, 232 రజతాలు, 295 కాంస్యాలు)
- భారత్: 564 పతకాలు (203 స్వర్ణాలు, 190 రజతాలు, 171 కాంస్యాలు)
- స్కాట్లాండ్: 502 పతకాలు (132 స్వర్ణాలు, 143 రజతాలు, 227 కాంస్యాలు)
- దక్షిణాఫ్రికా: 416 పతకాలు (137 స్వర్ణాలు, 132 రజతాలు, 147 కాంస్యాలు)
- వేల్స్: 334 పతకాలు (75 స్వర్ణాలు, 104 రజతాలు, 155 కాంస్యాలు)
- నైజీరియా: 271 పతకాలు (82 స్వర్ణాలు, 84 రజతాలు, 105 కాంస్యాలు)
- కెన్యా: 258 పతకాలు (91 స్వర్ణాలు, 80 రజతాలు, 87 కాంస్యాలు)
ఇప్పటివరకు ఒక్క పతకం కూడా గెలవని దేశాలు
- ఆంగ్విలా
- ఆంటిగ్వా అండ్ బార్బుడా
- బెలిజ్
- బ్రూనై
- ఎస్వాతిని
- ఫాక్‌లాండ్ ఐలాండ్స్
- గాబన్ (2026లో తొలిసారి పోటీపడుతోంది)
- జిబ్రాల్టర్
- మాల్దీవులు
- మోంట్‌సెరాట్
- రువాండా
- సెయింట్ హెలెనా
- సియెర్రా లియోన్
- టోగో (2026లో తొలిసారి పోటీపడుతోంది)
- టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్
- తువాలు