జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

దక్షిణ జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ప్రజలను ఆందోళనలో పడేసింది. అధికారుల సమాచారం ప్రకారం, భూకంపం ధాటికి కుమామోటోలోని ఒక షాపింగ్ మాల్‌లో పలువురు ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:27 గంటలకు జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో ఈ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దాదాపు గంట వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)