కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ మే 10న

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ మే 10న
ప్రచురణ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో మే 10న పోలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 13న వెలువడనున్నాయి.

ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.

ఏప్రిల్ 13న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

నామినేషన్లకు గడువు ఏప్రిల్ 20.

ప్రస్తుత శాసనసభ గడువు మే 25తో ముగుస్తుంది.

కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

మొత్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రత్యేకంగా 1,320 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను మహిళలకు అప్పగిస్తారు.

తొలిసారిగా 'ఓట్ ఫ్రం హోం' సదుపాయాన్ని ఈసీ ప్రవేశపెట్టనుంది. 80 ఏళ్లు నిండిన ఓటర్లు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

ఈసారి ఎన్నికల్లో కొత్త ఓటర్లపై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.

ఈ ఎన్నికల్లో తొమ్మిది లక్షల మందికి పైగా ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది.

ఇవి కూడా చదవండి: