తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
"భారత్ - చైనాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవు" - ఎస్ జైశంకర్
ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దుల్లో పరిస్థితులు మెరుగుపడకుండా భారత్ -చాలా మధ్య సంబంధాలు
సాధారణ స్థాయికి రావని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆయన
బెంగళూరులో భారత్-చైనా అంశం పై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా సరిహద్దుల్లో శాంతి
సామరస్యాలకు భంగం కలిగించాలని చూస్తే, అది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తుందని
అన్నారు.
లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి వైదొలగడంలో భారత
సేనలు పురోగతి సాధించాయని చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
రెండేళ్ల క్రితం లద్దాఖ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల తర్వాత
భారత్ కుచైనాతో సంబంధాలు దెబ్బ తిన్నాయా
అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
"నేను 2020, 2021లో ఏమి చెప్పానో, అదే
విషయాన్ని 2022లో కూడా చెబుతాను. భారత్ - చైనాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవు"
అని అన్నారు.
"సల్మాన్ రష్దీపై దాడి జరిగిందంటే ఇస్లాంను విమర్శించిన ఎవరిపైనైనా దాడి జరగొచ్చు" - తస్లీమా నస్రీన్
ఫొటో సోర్స్, Getty Images
సల్మాన్ రష్దీపై జరిగిన దాడికి బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్
స్పందించారు. ఈమెను బంగ్లాదేశ్ బహిష్కరించింది.
"ఆయనపై దాడి జరిగిందంటే ఇస్లాంను విమర్శించిన
ఎవరిపైనైనా దాడి జరగొచ్చు" అని అంటూ ఆమె ట్వీట్ చేశారు.
తస్లీమా నస్రీన్ 1994లో రాసిన పుస్తకంపై వ్యతిరేకత ఎదురవడంతో ఆమె
బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇండియాలో తల దాచుకోవాల్సి వచ్చింది.
"సల్మాన్ రష్దీ పై న్యూయార్క్ లో దాడి జరిగింది. నేను దిగ్బ్రాంతికి
లోనయ్యాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన పశ్చిమ దేశాల్లో నివసిస్తున్నారు.
అక్కడ ఆయనకు 1989 నుంచి రక్షణ లభిస్తోంది. ఆయన పై దాడి
జరిగిందంటే ఇస్లాంను విమర్శించిన ఎవరి పైనైనా దాడి జరగొచ్చు. నాకు ఆందోళనగా
ఉంది" అని ఆమె ట్వీట్ చేశారు.
'విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఉచితాల కిందకు రాదు'.. మోదీని టార్గెట్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త
సల్మాన్ రష్దీ ఎవరు? ఇండియాలో జన్మించిన ఈ రచయితను కొందరు ఎందుకు చంపాలనుకుంటున్నారు
వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, కాలేయానికి కత్తిపోట్లు, ఒక కంటికి తీవ్ర గాయం
రాయచోటిలో కోడలిని దారుణంగా హత్య చేసిన అత్త
కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
న్యూయార్క్: రచయిత సల్మాన్ రష్దీపై దాడి
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, సల్మాన్ రష్దీ
రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ నగరంలో దాడి జరిగింది.
‘‘ద శటానిక్ వెర్సస్’’ అనే పుస్తకం రాసిన తరువాత, దశాబ్దాలుగా ఆయన చంపేస్తామన్న బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.
బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్న సల్మాన్..న్యూయార్క్‌లోని ఛౌటౌక్వా సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ దాడి జరిగింది.
సల్మాన్‌ను పరిచయం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అక్కడున్న వారు వెంటనే వేదికపైకి వస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై సమాచారం అందడం లేదు.
దాడి చేసిన వ్యక్తిని ఘటన స్థలంలోనే అక్కడున్న వారు పట్టుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
విశాఖపట్నం: బీచ్‌లో ఇసుక నల్లగా మారడానికి కారణం ఏంటి, భయపడాల్సిన అవసరం ఉందా ?
రణ్‌వీర్ సింగ్: న్యూడ్ ఫొటోల వివాదంలో సమన్లు ఇవ్వనున్న ముంబయి పోలీసులు
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రణ్‌వీర్ సింగ్
మేగజైన్‌లో న్యూడ్ ఫొటోల వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు నటుడు రణ్‌వీర్ సింగ్‌కు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆగష్టు 22న పోలీసుల ముందు హాజరై దీనిపై స్టేట్‌మెంట్ ఇవ్వాలని వారు ఈ నోటీసులో కోరనున్నారు.
ఇవాళ రణ్‌వీర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన ముంబయిలో లేకపోవడంతో ఇవ్వకుండానే వెనుదిరిగారు.
ఇటీవల ఓ మేగజైన్‌కు రణ్‌వీర్ నగ్నంగా ఫొటో ఫోజులు ఇవ్వడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది అమ్మాయిలు కన్యత్వ సర్టిఫికేట్‌లు తీసుకురావాలి
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం: ఈ గొడవ వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా
గాంధీ-జిన్నా: విభజన విభేదాలున్నా ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారు?
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ కు సోషల్ మీడియాలో వేధింపులు-కేసు నమోదు
ఫొటో సోర్స్, @iamnainajaiswal
ఫొటో క్యాప్షన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్
హైదరాబాద్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిక నైనా జైస్వాల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని నైనా తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మానసిక సమస్యలున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
చైనాలో గృహరుణాల సంక్షోభం: పూర్తికాని అపార్ట్‌మెంట్లను ఆక్రమించుకుంటున్న ప్రజలు
వీసాలు లేకుండా భారతీయులు అమెరికాలో ఎలా అడుగుపెడుతున్నారు?
వచ్చే ఎన్నికల్లో నితీశ్ ప్రధాని పదవికి పోటీ పడతారా? ఆయన సమాధానం ఏంటి?
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్
కుమార్ వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారని వచ్చిన వార్తలను
కొట్టిపడేశారు. ఆయన శుక్రవారం పట్నాలో విలేఖరులతో మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
"నేను చేతులు జోడించి చెబుతున్నాను. నా మనసులో అటువంటి ఆలోచన ఏమీ
లేదు" అని అన్నారు.
ప్రధాని పదవిని పొందాలనే కోరిక నితీశ్‌ను కాటేయడం వల్లే ఆయన బీజేపీ
నుంచి వదొలిగారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
ఈ మేరకు విలేఖరులు అడిగిన ప్రశ్నకు నితీశ్ స్పందించారు.
"మేము చేతులు జోడించి చెబుతున్నాం. నాకలాంటి ఆలోచనలు లేవు.
ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యతతో పని చేసేలా చూస్తాను. అందరూ కలిసి పని చేస్తే
బాగుంటుంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడవచ్చు"
అని ఆయన సమాధానం చెప్పారు..
"జాతీయ జెండా ఎగరేయని ఇంటి ఫోటోను పంపించండి"- ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు
ఫొటో సోర్స్, FACEBOOK/MAHENDRA BHAT
స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇళ్ల పై జాతీయ జెండా ఎగరేయడం గురించి
ఉత్తరాఖండ్ బీజేపీ నేత మహేంద్ర భట్ చేసినవ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్
విమర్శించింది.
మహేంద్ర భట్ బుధవారం హల్డ్వానీలో ప్రసంగిస్తూ హర్ ఘర్ తిరంగా ప్రచారంలో
భాగంగా జాతీయ జెండాను ఇంటి పై ఎగరేయని వారి దేశ భక్తిప్రశ్నార్థకం అని అన్నారు.
"త్రివర్ణ పతాకం ఎగరేయని వారిని విశ్వాసంతో ఎప్పటికీ చూడలేం.
త్రివర్ణ పతాకం ఎగరేయని ఇంటి ఫోటో నాకు కావాలి. ఈ సమాజం అలాంటి ఇంటిని, కుటుంబాన్ని, దేశం పట్ల గౌరవం లేని వారిని ఈ సమాజం
చూడాలి" అని ఆయన అన్నారు.
"ఇంటి పై జెండా ఎగరేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? త్రివర్ణ పతాకం ఎగరేయని వారిని ఈ దేశం విశ్వసించలేదు" అని అన్నారు.
అయితే, కాంగ్రెస్ ఆయన చేసిన ప్రకటనను తప్పుగా
విశ్లేషించిందని ఆయన పీటీఐ వార్తాసంస్థతో అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం
పేర్కొంది.
"జాతీయ జెండా కొనుక్కునేందుకు ప్రజల దగ్గర డబ్బులు లేవని
కాంగ్రెస్ అంటోంది. ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా జెండాను అందచేస్తోంది. ఇందుకు
పార్టీ కూడా సహకరిస్తోంది" అని అన్నారు.
భట్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు చాలా ప్రతిపక్ష పార్టీలు
స్పందిస్తున్నాయి.
"ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏదైనా మాట్లాడే ముందు
రెండు సార్లు ఆలోచించాలి. నేను ప్రస్తుతం పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నాను. ఇక్కడ
చాలా ఇళ్ల పై జెండాలు లేవు. బీజేపీ ప్రభుత్వానికున్న దారుణమైన ఆర్ధిక పరిస్థితి
వల్ల వారు జెండా పెట్టుకోలేకపోయి ఉండవచ్చు" అని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత
గణేష్ గొడియల్ అన్నారు.