తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ

‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. ప్రధాని చేసిన అవినీతి, బంధుప్రీతి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    అవినీతీ, బంధుప్రీతి అనే రెండు అంశాలు దేశానికి ప్రధాన సమస్య మారాయంటూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చేసిన ప్రసంగంపై స్పందించేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తాను ఈ విషయం పై మాట్లాడబోనని, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ స్పందించకుండా వెళ్లిపోయారని వెల్లడించింది.

    మరోవైపు నరేంద్ర మోదీ ప్రసంగం నిరాశాపూరిత ప్రసంగమని కాంగ్రెస్ నేత పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు.

    రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు ఇస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, ఉపాధి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానాలు చేశారని, ఈ వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నిద్రపట్టక ఆయన నిరాశాపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఖేరా అన్నారు.

    బీజేపీలోనే అసలైన కుటుంబవాదం, బంధు ప్రతీ ఉన్నాయని ఖేరా ఆరోపించారు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన వ్యక్తి క్రికెట్‌లో అత్యున్నత పదవి పొందినట్లు తనకు గుర్తు లేదని అన్నారు.

    ఓ మంత్రి కొడుకు ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ కాలేదని, కానీ ఆయనిప్పుడు ఒక థింక్ ట్యాంక్ అధినేతగా వ్యవహరిస్తున్నారని ఖేరా అన్నారు. మోదీ తన మంత్రుల మీద తానే విమర్శలు చేసుకున్నారని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. వైఎస్ జగన్: ‘తెలుగు వాడు రూపొందించిన జెండా నేడు దేశానికే గుండె’

    జెండా వందనం చేస్తున్న వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, Facebook/YSRCP

    విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

    ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను జగన్ తిలకించారు.

    తరువాత మాట్లాడిన జగన్... భారతదేశపు ఆత్మకు, ప్రజలందరి ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీకని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

    • మన తెలుగువాడు పింగళి వెంకయ్యగారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె.
    • అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన శాంతియుత స్వతంత్ర సంగ్రామ పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదుమొత్తంగా ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది.
    • గత 75 సంవత్సరాల్లోఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది.
    సాయుధ దళాల గౌరవం వందనం స్వీకరిస్తున్న జగన్

    ఫొటో సోర్స్, Facebook/YSRCP

  3. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది: కేసీఆర్

    kcr

    ఫొటో సోర్స్, trs

    తెలంగాణవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

    కేంద్రం సమాఖ్యస్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రాల అధికారాలను కుదిస్తోందని, రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్నవారే ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంచేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

    గాంధీ,నెహ్రు,పటేల్‌లతో పాటు దేశ స్వాతంత్ర్య పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్, రాంజీగోండు,మౌల్వీ అలావుద్దీన్, సంగెం లక్ష్మీబాయి, పీవీ నర్సింహరావ్ వంటి తెలంగాణ వీరులు ప్రముఖ పాత్రపోషించారని కేసీఆర్ గుర్తు చేశారు.

    తెలంగాణ రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తోందని చెప్పిన కేసీఆర్ తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు కలుగుతున్న లబ్ధి వివరాలు వెల్లడించారు.

    తెలంగాణ ఇప్పటివరకు లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. మరో 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ ప్రక్రియ చేపట్టామని కేసీఆర్ చెప్పారు.

    తెలంగాణ రాష్ట్ర అప్పులపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించిన కేసీఆర్... ‘కేంద్రం లెక్కల ప్రకారం 2019-20 నాటికి తెలంగాణ మొత్తం అప్పు 2,25,450కోట్లు. 2014 లో తెలంగాణ ఏర్పడే నాటికి 75,577 కోట్ల అప్పు ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1,49,873 కోట్ల అప్పు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. దేశంలోని 22 రాష్ట్రాలు తెలంగాణకన్నా ఎక్కువగా అప్పులు చేశాయి’ అన్నారు.

    ‘పసిపిల్లలు తాగే పాలు నుంచి స్మశానవాటికల నిర్వహణ వరకు ప్రజల అవసారలపై కేంద్రం పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతిపై భారం మోపుతోంది. సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’అనే పేరు తగిలించి అవమానిస్తోంది. కేంద్రం అసమర్థత వల్ల ఆర్థికాభివృద్ది కుంటుపడింది. ద్రవ్యోల్భణతో ధరలు ఆకాశాన్నంటాయి.నిరుద్యోగం పెరిగింది. తన వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు విద్వేశ రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతోంది. రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్ట్ దాడులకు పాల్పడుతున్నారు’ అంటూ కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేశారు.

  4. రాజస్థాన్: ‘కుండలో నీళ్లు తాగినందుకు’ దళిత బాలుడిని కొట్టిన టీచర్.. 23 రోజుల తరువాత చనిపోయిన విద్యార్థి.. అసలు ఏం జరిగింది

  5. ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్‌సైట్లను రెండు, మూడేళ్లుగా అప్‌డేట్ చేయడం లేదు, ఎందుకు?

  6. చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

  7. కుటుంబపాలన, అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నాను, దేశ రాజకీయాలను శుద్ధి చేస్తాను.. మీ ఆశీర్వాదం కావాలి: మోదీ

    narendra modi

    ఫొటో సోర్స్, pmo

    ‘ఒకవైపు బతికేందుకు జీవించేందుకు చోటులేదు. మరోవైపు దోచుకున్నది దాచుకునేందుకు చోటు లేదు. అవినీతిపై పోరాడాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ఆధార్ మొబైల్ ద్వారా రూ. 2 లక్షల కోట్లు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా చూశాం

    నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నాను. నాకు ఆశీర్వాదం ఇవ్వండి. మద్దతు ఇవ్వండి. తద్వారా నేను ఈ పోరాటంలో విజయం సాధించి, సామాన్యుల జీవితాలపై అవినీతి ప్రభావం లేకుండా చేస్తా

    అవినీతిపైన పోరాటం చేస్తాం. అవినీతిపరులపైనా సానుభూతి వస్తోంది.

    జైలుకు వెళ్లిన తర్వాత కూడా వాళ్ల ప్రతిష్ట పెరుగుతోంది. సమాజంలో అపరిశుభ్రతపై, అవినీతిపరులపై కోపం లేకపోతే..

    దౌర్భాగ్యం.. రాజకీయ.. కుటుంబ పాలన.. చాలా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశ టాలెంట్, సామర్థ్యానికి నష్టం జరుగుతోంది. అవినీతికి ఒక కారణం ఇదే.. ప్రతి సంస్థలోనూ అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం పెరగాలి.

    రాజకీయాల్లో కుటుంబ పాలన చాలా అన్యాయం చేసింది. వారి రాజకీయమంతా కుటుంబ ఎదుగుదల కోసమే. దేశం కోసం కాదు.

    దేశ రాజకీయాలను, సంస్థలను శుద్ధి చేసేందుకు.. కుటుంబ యోగ్యత ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇది అనివార్యం. ఈ మనఃస్థితి దేశానికి మంచిది కాదు. మీ భవిష్యత్ కోసం, మీ మంచి కోసం పోరాడుతున్నాను. రాజకీయ పోరాటానికి మీ మద్దతు కావాలి. ప్రజాస్వామ్యానికి నేను జవాబుదారీని’’ అన్నారు మోదీ.

  8. నరేంద్ర మోదీ: మహిళలను అగౌరవపర్చబోమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి

    narendra modi

    ఫొటో సోర్స్, PMO

    మహిళలను అగౌరవపర్చడం ఆపుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

    అంతరిక్షం నుంచి మహాసముద్రాల లోతుల వరకు ప్రతి అంశంలో పరిశోధనలకు ఈ దేశ యువతకు అన్నిరకాలుగా మద్దతు లభించేలా కృషి కొనసాగుతోందన్నారు.

    ఆ క్రమంలోనే స్పేస్ మిషన్, డీప్ ఓసన్ మిషన్ విస్తరిస్తున్నట్లు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్ర్యం సాధించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు జైహింద్ అంటూ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  11. ప్రధాని చేసిన అవినీతి, బంధుప్రీతి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్

  12. 35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త

  13. జాతీయ గీతాన్ని 75సార్లు ఆలపించి రికార్డు సృష్టించిన అర్చన

  14. సల్మాన్ రష్దీ: ఎన్‌‌టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?

  15. ఈజిప్టు: చర్చిలో అగ్నిప్రమాదం... సుమారు 41 మంది మృతి

    మంటలతో కాలిపోయిన చర్చి

    ఫొటో సోర్స్, Getty Images

    ఈజిప్టులోని ఒక చర్చిలో అగ్నిప్రమాదం జరిగి సుమారు 41 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    కాప్టిక్ అబు సిఫిన్ చర్చిలో ప్రార్థనల కోసం సుమారు 5 వేల మంది వచ్చారని, ఈ సమయంలో విద్యుత్ తీగల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని భద్రతా దళాలు చెప్పినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

    మంటల వల్ల చర్చి ప్రవేశ ద్వారం మూసుకు పోవడంతో తొక్కిసలాట జరిగింది.

    ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    ‘కరెంటు పోవడంతో జనరేటర్ వేశారు. కరెంటు వచ్చిన తరువాత లోడ్ ఎక్కువ అయింది. దీంతో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి’ అని దగ్గర్లోని మరొక చర్చిలో ఫాదర్‌గా ఉన్న ఫరీద్ ఫామీ, న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీకి తెలిపారు.

    ప్రమాదం జరిగిన చర్చి ఉన్న ప్రాంతం

    ఫొటో సోర్స్, Reuters

  16. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి, కానీ పెట్రోలు ధర వారంలో 50శాతం పెరిగింది

  17. మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?

  18. పాత ఇంటిని పడగొడుతుంటే బయటపడ్డ ఇనుప పెట్టే... తెరచి చూడగా?

    విజయనగరం జిల్లా రాజంలో ఓ పాత ఇంటిని పడగొడుతుంటే ఓ ఐరన్ లాకర్ బయటపడింది. కానీ కూలీలు ఆ సంగతి యజమానికి చెప్పలేదు.

    విషయం తెలుసుకున్న యజమాని నిలదీయగా... అందులో తమకూ వాటా కావాలని గొడవ పెట్టుకున్నారు.

    ఇంతకు ఆ పెట్టలో ఏముంది?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  19. పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా, ఆ మాట నిజమేనా

  20. ఒకే చైనా విధానానికి భారత్ మద్దతు ప్రకటించాలి - చైనా రాయబారి సన్ వీడోంగ్

    సన్ వీడోంగ్

    ఫొటో సోర్స్, ANI

    అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత మొదటిసారి భారత్‌కు చైనా రాయబారి సన్ వీడోంగ్ ప్రకటన చేశారు.

    ఆయన శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. చైనా అవలంబిస్తున్న "ఒకే చైనా" విధానానికి భారత్ మద్దతు తెలపాలని చైనా ఆశిస్తున్నట్లు చెప్పారు.

    ఒకే చైనా విధానం గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

    "ఒకే చైనా విధానం విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదని భావిస్తున్నాం" అని వీడోంగ్ అన్నారు.

    తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో ఇరు దేశాలు చర్చలు కొనసాగించాలని ఆయన అన్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చైనా అవలంబిస్తున్న ఒకే చైనా విధానం గురించి ప్రస్తావించలేదు. విధానాల పట్ల భారత్ వైఖరి అందరికీ తెలుసని దానిని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

    పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత సుమారు 160 దేశాలు ఒకే చైనా విధానానికి మద్దతు తెలిపాయని వీడోంగ్ అన్నారు. తైవాన్‌ను చైనా అంతర్భాగంగా పరిగణిస్తుంది.

    భారత్ గతంలో ఒకే చైనా విధానాన్ని సమర్ధించింది. కానీ గత దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక పత్రాల్లో లేదా బహిరంగంగా ఈ ప్రకటనను చేయలేదు.