ధన్యావాదాలు!
ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
ధన్యవాదాలు.
తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలు చేపడుతున్న చైనా... నీళ్లలోకి బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. టార్గెట్‌ను గురి తప్పకుండా అవి చేధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
అల్ ఖైదా అధినేత అల్ జవహరిని అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో హతమార్చామని అమెరికా చేసిన ప్రకటన మీద తాము దర్యాప్తు చేస్తున్నట్లు అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్పింది.
ఈ మేరకు తాలిబాన్ సర్కారు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అల్ జవహరి అఫ్గాన్‌లో ప్రవేశించినట్లు కానీ, కాబూల్‌లో నివసిస్తున్నట్లు కానీ తమకు ఎలాంటి సమాచారం లేదని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
అల్ జవహరిని హతమార్చామని అమెరికా చేసిన ప్రకటన విశ్వసనీయత మీద తాము దర్యాప్తు చేస్తున్నామని.. వాస్తవాన్ని ప్రజల ముందు పెడతామని ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్ ప్రతినిధి సుహెయిల్ షాహీన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అమెరికా మీద 9-11 దాడులకు బాధ్యుడని భావిస్తున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా 2011లో పాకిస్తాన్‌లో హతమార్చింది. అనంతరం అల్ ఖైదా సారథ్యం చేపట్టిన అల్ జవహరిని గత వారాంతంలో కాబూల్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, ERIC SMITH/THE UNIVERSITY OF TEXAS AT ARLINGTON
మెక్సికో అడవుల్లో ఆరు కొత్త జాతుల చిట్టి కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ చిట్టి కప్పలు ఎంత చిన్నవంటే.. బ్రిటన్ 50 పెన్నీల నాణెం మీద ఒక కప్పను పెడితే.. ఆ నాణెం మీద ఇంకా చాలా ఖాళీ మిగిలిపోయేంత చిన్నవి.
వీటి నిడివి అర అంగుళం (15 మిల్లీమీటర్లు) లోపే ఉంది. ప్రపంచంలోని అతి చిన్న కప్పజాతుల్లోకి ఇవి వస్తాయి.
ఇవి ఇంత చిన్నవిగా ఉండటం వల్ల, వీటి రంగు వల్ల, మిగతా చిట్టి కప్పల జాతులకు దగ్గరి పోలికలు ఉండటం వల్ల.. ఇప్పటివరకూ వీటిని వేరే జాతులుగా గుర్తించలేకపోయారు.

ఫొటో సోర్స్, THE UNIVERSITY OF TEXAS AT ARLINGTON
‘‘ఈ కప్పలు అడవుల్లోని చీకట్లో, తేమతో నిండిన ఆకుల చెత్తలో జీవిస్తాయి. అక్కడ ఏం జరుగుతోందనేది మనకు నిజంగా తెలీదు. వీటి ప్రవర్తన గురించి, వీటి సమాజం గురించి, వీటి ప్రజననం గురించి కూడా ఏమీ తెలీదు’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుడు టామ్ జాన్సన్ చెప్పారు.
ఈ జాతులు ప్రధానంగా దక్షిణ మెక్సికోలోని సియెర్రా మెద్రె డెల్ సుర్ ప్రాంతంలో గల పైన్-ఓక్ అడవుల్లోనే కనిపిస్తున్నాయి.
ఈ కప్పల జాతులను అంతరించిపోయే దశలో ఉన్న జాతులుగా వర్గీకరించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. దీనికి కారణం.. ఈ కప్పల ఆవాస ప్రాంతాల నాణ్యత క్షీణిస్తోంది. ఇవి నివసించటానికి అనువైన ప్రాంతాలు ఇతరత్రా ఎక్కువగా లేవు.

ఫొటో సోర్స్, THE UNIVERSITY OF TEXAS AT ARLINGTON

ఫొటో సోర్స్, Facebook/KCR
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ & హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్’ అని దీన్ని పిలుస్తున్నారు.
నేరాలను నిర్మూలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం తెలంగాణ పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Facebook/KTR
అక్కడ రాత్రికి రాత్రే 82 అడుగుల వెడల్పుతో ఒక్కసారిగా భూమి కుప్పకూలిపోయింది. ఆ సింక్ హోల్ రోజు రోజుకూ పెద్దదవుతోంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
చైనా హెచ్చరికలు లెక్క చేయకుండా తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించారు. ఈ నేపథ్యంలో తైవాన్ సమీపంలో చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది.
దీన్ని ఖండిస్తూ జీ7 దేశాలు ప్రకటన విడుదల చేశాయి. జపాన్ కూడా జీ7 కూటమిలో ఉంది.
ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన చైనా జపాన్ విదేశాంగ శాఖ మంత్రితో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలు చేపడుతున్న చైనా... బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.
తైవాన్ నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ తీరాల్లో అనేక డాంగ్‌ఫెంగ్ బాలిస్టిక్ మిసైల్స్‌ను నీళ్లోకి చైనా ప్రయోగించినట్లు రాయిటర్స్ తెలిపింది.
టార్గెట్‌ను గురి తప్పకుండా అవి చేధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
చైనా మిసైల్స్‌ను లాంచ్ చేస్తున్న నేపథ్యంలో తాము అప్రమత్తమైనట్లు తైవాన్ రక్షణశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో బాలిస్టిక్ మిసైల్స్‌ను ట్రాక్ చేయగల అమెరికా విమానం జపాన్ నుంచి బయలుదేరి తైవాన్‌కు ప్రయాణమైనట్లు తైవాన్‌లోని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, తైవాన్ జలాల సమీపానికి బయలుదేరినట్లు అమెరికా నేవీ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బ్యాన్‌లాల్‌సింగ్‌చద్దా’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే దీని వెనుక ఆమిర్‌ఖాన్ కుట్ర ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. ‘ఈ ఏడాది వచ్చిన హిందీ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. భారతీయ సంస్కృతి ఉన్న దక్షిణాది సినిమాలు మాత్రమే ఆడాయి. ఆ హాలీవుడ్ రీమేక్ ఎలాగు ఆడదు.’ అని ఆమె అన్నారు.
హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ అయిన ‘లాల్ సింగ్ చద్దా’లో నాగ చైతన్య నటించారు. తెలుగు చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరులోగల 100 ఏళ్ల నాటి శివాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారంటూ ఆందోళనలు చెలరేగాయి.
హిందుత్వ కార్యకర్తలు చాలా మంది శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.
అయితే తాము శివాలయాన్ని కూల్చడం లేదని గుడి చుట్టూ ఉన్న గోడను మాత్రమే పడగొడుతున్నామని మున్సిపల్ అధికారులు అంటున్నారు.
స్థానికులు వేసిన పిటీషన్ ఆధారంగా గుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చాల్సిందిగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు లలిత్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫారసు చేశారు.
జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ లలిత్ ఆ పదవి చేపడితే 49వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, భారత్ జాతీయ పతాకంతోపాటు జమ్మూ కశ్మీర్ జెండా కూడా ఉన్న ఫొటోను తన ట్విటర్ ప్రొఫైల్ పిక్‌లో పెట్టారు.
‘ఆజాదీకి కా అమృత మహోత్సవ్’లో భాగంగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే.
తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్న ఫొటోను ఆమె తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. అందులో భారత్ జెండాతో పాటు ప్రస్తుతం రద్దయిన జమ్మూ కశ్మీర్ జెండా కూడా ఉంది.
‘జెండా అనేది సంతోషానికి, గర్వపడటానికి ప్రతీక అయినందున నా ప్రొఫైల్ పిక్ మార్చాను.
మా రాష్ట్ర జెండాకు భారత జాతీయ జెండాకు ఉన్న అవినాభావ సంబంధం విడదీయలేనిది. కానీ ఆ బంధాన్ని తెంచేసి మా జెండాను దూరం చేశారు.
మా జెండాను మా నుంచి దూరం చేయొచ్చు. కానీ మా అందరి ఆలోచనల నుంచి తుడిచి వేయలేరు.’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఆర్టికల్-370 రద్దుతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగిపోయింది. దాంతో పాటే జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక జెండా కూడా రద్దయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది