కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం అమెరికా 1,22,666 కరోనావైరస్ కేసులతో చైనాను దాటేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 25 మరణాలు నమోదు అయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. జీఎస్‌టీ, కస్టమ్స్, ఎక్సయిజ్ పన్నుల గురించి ఆర్థిక మంత్రి ఏమన్నారు?, జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే గడువు పొడిగింపు

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలకు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. వార్షిక టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు వడ్డీని, ఆలస్య రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

    అయిదు కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా పెనాల్టీ, లేట్ ఫీజులు చెల్లించనవసరం లేదు. వడ్డీని తగ్గించిన 9 శాతం రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీన సర్వర్ మీద భారం పడకుండా చేసేందుకు వివిధ రంగాలకు వేరు వేరు తేదీలను ప్రకటిస్తారు.

    కస్టమ్స్-ఎక్సైజ్ సబ్‌కా విశ్వాస్ పథకం కింద వివాదాలను పరిష్కరించుకునే గడువును మార్చి 31 నుంచి 2020 జూన్ 30కి పొడిగించారు. కోటిన్నర కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలపై ఎలాంటి జరిమానాల భారం ఉండదు. లాక్‌డౌన్ వల్ల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు రాత్రింబవళ్ళు కస్టమ్ క్లియరెన్స్ సేవలు కొనసాగుతాయి.

  2. అనంతపురంలో మాస్కులు తయారు చేస్తున్న మహిళా సంఘాలు

    ఏపీలోని అనంతపురం నగరంలో మహిళా సంఘాలు భారీ ఎత్తున మాస్కులను తయారుచేస్తున్నాయి.

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడడంతో అధికారులు వీరితో మాస్కులను తయారుచేయిస్తున్నారు.

    అనంతపురం
  3. ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల గడువు పెంపు

    ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ లకు ఆన్లైన్ దరఖాస్తులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా గడువు పొడిగించారు.

    ఎంసెట్‌ అభ్యర్థులు ఏప్రిల్ 5వరకు ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు.

    ఈసెట్‌, ఐసెట్‌లకు ఏప్రిల్ 9 వరకు గడువు పొడిగించారు.

  4. తెలంగాణలో మరో 3 పాజిటివ్ కేసులు.. మొత్తం 36

    తెలంగాణలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి.

    దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36కి చేరింది.

    లండన్ నుంచి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు వచ్చిన 49 ఏళ్ల పురుషుడు, జర్మనీ నుంచి రంగారెడ్డి జిల్లా చందానగర్ వచ్చిన 39 ఏళ్ల మహిళ, సౌదీ అరేబియా వెళ్లొచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణయింది.

    వైద్యులు

    ఫొటో సోర్స్, Getty Images

  5. మహారాష్ట్రలో కరోనాతో మరొకరి మృతి.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 101 కేసులు

    మహారాష్ట్రలో కరోనావైరస్ సోకిన 65 ఏళ్ల వృద్ధుడొకరు కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

    మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 101కి పెరిగిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

    ఏపీలో మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేశారు. మార్చి 31 తరువాత పరిస్థితుల ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

    పరీక్షలు

    ఫొటో సోర్స్, Getty Images

  7. రాజ్యసభ ఎన్నికలు వాయిదా

    మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చి 31 తరువాత సమీక్షించి తదుపరి ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. "దేశంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ నెలకొని వుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట చేరడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రజాప్రతినిధులైనా సరే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేస్తున్నాం" అని ఈసీ వెల్లడించింది. రాజ్యసభకు ఖాళీ అయిన 55 సీట్లలో ఏకగ్రీవమైన 37 మినహా మిగతా 18 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

    parliament

    ఫొటో సోర్స్, Getty Images

  8. నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు మినహా దేశమంతా లాక్ డౌన్

    దేశంలోని 32 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లోని 560 జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు ఉండగా నాలుగు చోట్ల మినహా మిగతా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, లక్షదీవులలో ఇంకా లాక్‌డౌన్ విధించలేదు.