కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం అమెరికా 1,22,666 కరోనావైరస్ కేసులతో చైనాను దాటేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 25 మరణాలు నమోదు అయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారంతా నన్ను క్షమించాలి - ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ

    ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఆలిండియా రేడియోలో ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు.

    లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల విధించిన ఆంక్షల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారంతా తనను క్షమించాలని ప్రధాని కోరారు.

    రోజుకూలీల కష్టాలను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు.

    21 రోజుల లాక్‌డౌన్‌ను పాటించి, ఇళ్లకే పరిమితం కావాల్సిన ప్రజల్లో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని, వాళ్లు వాళ్ల ప్రాణాలతోనే కాకుండా సన్నిహితుల ఆరోగ్యంతో కూడా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని తెలిపారు.

    హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనావైరస్ బారి నుంచి బయటపడిన ఒక ఐటీ ఉద్యోగితోను, ఆగ్రాలో చికిత్స పొంది కోవిడ్-19 వ్యాధి నయమైన ఒక కుటుంబ యజమానితోనూ మోదీ మాట్లాడారు.

    ఇది యుద్ధం లాంటి పరిస్థితేనని ఒక డాక్టర్‌తో మాట్లాడుతూ మోదీ అన్నారు.కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుంటాయని, విదేశాల్లో కూడా ఇలాగే జరిగిందని, ఆ పరిస్థితి భారత్‌లో రాకూడదన్నదే తమ ప్రయత్నమని మోదీ చెప్పారు.

    రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మోదీ ప్రశంసించారు.

    నరేంద్ర మోదీ
  2. కరోనాపై పోరులో భారత్‌ను ఇండియా వదిలేయ కూడదు - కైలాశ్ సత్యార్థి

    కరోనాపై పోరాటంలో పేద భారతదేశాన్ని ఆధునిక ఇండియా వదిలేయకూడదని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ‘‘రోజువారీ కూలీల పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకలితో కానీ, మందులు లేక కానీ ఒక్క చిన్నారి మరణించినా అది మనందరికీ కళంకం. కోవిడ్-19పై పోరులో భారత్‌ను ఇండియా వెనకాల వదిలేయ కూడదు’’ అని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం

    కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది.

    ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, పంచదార పంపిణీ చేస్తున్నారు.

    నిత్యావసర వస్తువులను తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

    కాగా, కరోనావైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి మనిషికి ఐదు అడుగుల దూరం ఉండేలా అధికారులు గుర్తులు పెట్టి, క్యూలైన్లను నియంత్రిస్తున్నారు.

    చాలామంది ప్రజలు ముక్కు, నోటికి గుడ్డలు, మాస్కులు పెట్టుకుంటున్నారు.

    1.40 కోట్ల మందికి రేషన్

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రేషన్ కార్డులు ఉన్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1.40 కోట్లు.

    ఏప్రిల్‌ నెలాఖరులోగా మూడు సార్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    ఒక్కో రేషన్ కార్డుకు ప్రతిసారీ ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు చొప్పున మొత్తం 15 కేజీల బియ్యం, మూడు కేజీల కంది పప్పును ప్రభుత్వం అందించనుంది.

    ఏప్రిల్‌ నెల కోటా మొదటి విడత సరుకులను లబ్దిదారులు ఈరోజు తీసుకుంటున్నారు.

    రెండో విడత సరుకులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామని పౌరసరరాలశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు.

    ఇంటింటికీ వెళ్లి ఎందుకు ఇవ్వట్లేదు?

    సరుకులను రేషన్‌ షాపుల్లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పంపిణీ చేస్తారు.

    సరుకుల కోసం వచ్చే వారు ఒక్కొక్కరు కనీసం ఒక మీటర్‌ దూరంలో నిల్చునేలా ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశారు.

    లబ్దిదారుల నుంచి బయోమెట్రిక్ అవసరం లేదని ప్రభుత్వం అదేశాలు ఇచ్చింది.

    వీఆర్వో/సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌తో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ చేస్తారు.

    రేషన్‌ షాపుల వద్ద సబ్బు, శానిటైజర్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అదేశాలు ఇచ్చారు.

    ‘‘లబ్ధిదారులందరికీ సరుకులు అందిస్తాం తమకు సరుకులు అందుతాయో లేదో అనే ఆందోళన వద్దు. లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా ఏర్పాటు చేశాం. సరుకులు తీసుకునేందుకు అందరూ ఒక్కసారిగా వెళ్లకుండా రేషన్‌ షాపు వద్దకు నలుగురు చొప్పున వెళ్లి డీలర్లకు సహకరించాలి. ఇంటింటికీ పంపిణీ పరిశీలన చేసినా సాధ్యం కాదని నిర్దరణకు వచ్చాం. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నప్పటికీ తొలుత వారికి సరుకులు అందించి, అక్కడి నుంచి మళ్లీ లబ్దిదారులకు చేర్చడం కన్నా, ఒక్క దశలోనే నేరుగా అందించడం మేలు అని నిర్ణయించాం’’ అని కోన శశిధర్ చెప్పారు.

    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ

    ఫొటో సోర్స్, BBC Sport

    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
    ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ సరుకుల పంపిణీ
  4. కరోనావైరస్ గణాంకాలు

    కరోనావైరస్
  5. న్యూయార్క్ రాష్ట్రం మొత్తాన్నీ క్వారంటైన్ చేద్దామనుకున్నా - ట్రంప్

    కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా న్యూయార్క్ రాష్ట్రం మొత్తాన్నీ క్వారంటైన్ చేద్దామనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

    ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదైన దేశం అమెరికానే.

    శనివారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,22,666 కేసులు నమోదు కాగా, అందులో దాదాపు సగం, 52 వేల కేసులు న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

    కాగా, న్యూయార్క్ గవర్నర్ ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టడంతో ట్రంప్ వెనక్కు తగ్గారు.

    వీడియో క్యాప్షన్, ట్రంప్ ప్రకటన
  6. ఆరు లక్షలు దాటిన కరోనా ఇన్ఫెక్షన్లు

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది.

    ఒక్క యూరప్‌లోనే ఈ ఇన్ఫెక్షన్‌తో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 20 వేలకు మించి పోయింది.

    వివిధ దేశాల్లో నమోదవుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్యను ఎప్పటికప్పుడు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తోంది. ఆ పోర్టల్‌లోని సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదు లక్షల నుంచి ఆరు లక్షలకు చేరుకోవడానికి రెండు రోజుల సమయమే పట్టింది.

    మార్చి 6 వరకు వివిధ దేశాల్లో మొత్తంగా లక్ష కేసులు నమోదయ్యాయి. మార్చి 18న ఆ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. మార్చి 21న మూడు లక్షలుగా మారింది. మార్చి 24 వచ్చేసరికి నాలుగు లక్షల మార్కును దాటింది.

    అత్యధిక కేసులు నమోదైన ఐదు దేశాలు ఇవే..

    అమెరికా : 104,865

    ఇటలీ : 86,498

    చైనా : 81,996

    స్పెయిన్ : 72,248

    జర్మనీ : 53,340

    ఈ రోజు ఏం జరిగిందంటే...

    ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆరు లక్షలు దాటింది.

    యూరప్‌లో మరణించినవారి సంఖ్య 20 వేలకు మించిపోయింది.

    స్పెయిన్‌లో 24 గంటల్లోనే 832 మంది మరణించారు. మొత్తంగా మరణాల సంఖ్య 5,690కి పెరిగింది. ఆ దేశంలో ఇప్పటివరకూ మొత్తంగా 72 వేల కేసులు నమోదవ్వగా, అందులో 12,285 మంది కోలుకున్నారు.

    బ్రిటన్‌లో ఈరోజు 260మంది మరణించారు.

    కరోనావైరస్ మొట్ట మొదటగా వ్యాపించిన చైనాలోని వుహాన్ నగరం రెండు నెలల మూసివేత తర్వాత మళ్లీ పాక్షికంగా తెరుచుకుంది.

    ఐదు నిమిషాల్లో కరోనావైరస్ ఉందో, లేదో నిర్ధారించే పరీక్ష కిట్‌లకు అమెరికా ఆమోదం తెలిపింది.

  7. వారి ఆకలి తీర్చండి: మేధావుల లేఖ

    లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకు దూరంగా చిక్కుకుపోయిన వలస కార్మికులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని అభ్యర్థిస్తూ వివిధ రంగాలకు చెందిన 200 మందికిపైగా మేధావులు ఓ ఉమ్మడి లేఖ విడుదల చేశారు. విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు,సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, రాజకీయ విశ్లేషకులు ఈ జాబితాలో ఉన్నారు.

    బాధిత కార్మికులకు కనీసం ఆహారం, వైద్యం, పారిశుద్ధ్య వసతులు అందేలా చూడాలని ప్రభుత్వానికి వారు ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సరైన ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని, దేశ కార్మిక శక్తిలో 90 శాతంపై పడే దుష్ప్రభావాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

    రవాణా వసతులు లేకపోవడంతో వలస కార్మికులు వందల కి.మీ.ల దూరంలోని గ్రామాలకు తిండీతిప్పలు లేకుండా కాలినడకను వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    అంగన్వాడీలు, పంచాయతీ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉచితంగా ఆహారం అందించే కేంద్రాలు పెట్టాలని కోరారు. ఏ పత్రాలూ అడగకుండా, వచ్చిన వారందరి ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు.

    ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన కార్మికులను శానిటైజ్ చేసిన బస్సులు, రైళ్ల ద్వారా వారి సొంత ప్రాంతాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

    సమస్య తీవ్రం కాకముందే, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

  8. పేదల ఇబ్బందులను ఇంకా పెంచొద్దు: భారత ప్రభుత్వానికి ఆమ్నెస్టీ సంస్థ విజ్ఞప్తి

    ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో లక్షల సంఖ్యలో వలస కార్మికులు, పేదలు కనీస అవసరాలకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

    ప్రభుత్వ విధానాలు, చర్యలు పేదలు, నిస్సహాయుల ఇబ్బందులను తగ్గించేలా ఉండాలని, వాటిని మరింత తీవ్రం చేసేలా ఉండకూడదని విమర్శించింది.

    కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవడం ముఖ్యమేనని, కానీ ఈ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వర్గాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే అవసరమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ అన్నారు.

    ‘‘దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఆహారం, మంచినీరు లాంటి కనీస అవసరాలకు దూరంగా లక్షల మంది పేదలు చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం యంత్రాంగం వారికి కరోనావైరస్ కన్నా పెద్ద ముప్పుగా పరిణమించింది. ప్రభుత్వం అణిచివేత ధోరణితో కాకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన సంక్షోభ పరిస్థితులున్నా సరే, హింస ఎంత మాత్రమూ సరికాదు’’ అని అవినాశ్ అన్నారు.

    లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్వారంటీన్‌లో ఉన్నవారి హక్కులను కూడా పరిరక్షించాలని, వారి కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

  9. వేల సంఖ్యలో రోడ్లపైకి చేరిన వలస కార్మికులు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "ఇళ్లకు లేదా స్వగ్రామాలకు వెళ్లడానికి దిల్లీ, ఘాజియాబాద్, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు బారులు తీరారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా వీరిలో ఉండటం బాధాకరం. రిక్షాలు, బస్సులు, ఇతర వాహనాల్లోనే కాదు... కాలి నడకన తమ సొంత ఊళ్లకు చేరేందుకు పరుగులు తీస్తున్నారు.

    ఈ ప్రభుత్వం ఏం కోరుకుంటోందో అర్థం కావడం లేదు" అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.

  10. క్వారంటైన్ కు సిద్ధంగా ఉంటేనే ఏపీలోకి రండి: సీఎం వైఎస్ జగన్

    వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

    ఏపీలో ఈరోజు మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

    ప్రకాశం జిల్లా చీరాలలో భార్యాభర్తలిద్దరికీ ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది. కర్నూలులో మరొకరు కూడా కరోనావైరస్ బారిన పడ్డారు.

    14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడేవారినే ఏపీలోకి అనుమతించండని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

    స్వచ్ఛందంగా వచ్చే వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసొలేషన్ లో పెట్టాలని ఆదేశించారు.

    "విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలి. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలి" అని అధికారులను ఆదేశించారు.

    తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై జగన్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు.

    నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు.

  11. ఇకపై కరోనావైరస్ మెడికల్ బులెటిన్ లేదు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

    ఇకపై కరోనావైరస్‌కు సంబంధించిన రోజువారీ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. శుక్రవారం నుంచి ఇది విడుదల చేయడం ఆగిపోయింది. అయితే అధికారులు కూడా కరోనావైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేయడం లేదు.

    అయితే, దీనిపై ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించింది.

    తెలంగాణ ప్రభుత్వం కరోనాపై హెల్త్ బులిటెన్ ఇవ్వకపోవడం బీజేపీని ఆశ్చర్యానికి గురి చేస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు అన్నారు.

    “ప్రతిరోజూ ఎందరికి వ్యాధి సోకింది వంటి వివరాలతో బులిటెన్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదు. ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వకపోతే, దానివల్ల కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. ప్రజల్లో అయోమయం నెలకొంటుంది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ రోజూవారీ హెల్త్ బులిటెన్లు ఇవ్వడం ప్రారంభించాలి” అని కృష్ణసాగర్ డిమాండ్ చేశారు.

  12. తెలంగాణలో మొదటి కరోనావైరస్ మరణం

    దిల్లీ వెళ్లి వచ్చిన ఒక వృద్ధుడు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు. మరణం తరువాత ఆయనకు పరీక్షలు చేయగా కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధరణైంది.

    ఇప్పటివరకూ మొత్తం 65 కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.

    రెండు కుటుంబాల్లో అందరికీ కరోనావైరస్ సోకడంతో శుక్ర, శనివారాల్లో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

    “కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదయ్యాయి. వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

    ఎంతమంది బాధితులున్నా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అందుకు అవసరమైన సౌకర్యాలు, సామగ్రి అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడా రెడ్ జోన్ లేదు. ఈరోజు నమోదైన మూడు కేసులూ దిల్లీ వెళ్లివచ్చినవారికి సంబంధించినవే” అని రాజేందర్ వెల్లడించారు.

    ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ ప్రక్రియలు నిర్వహించిన నలుగురు సిబ్బంది కరోనావైరస్ బారినపడ్డారని ఈటల తెలిపారు.

  13. కరోనావైరస్ నుంచి కోలుకున్న 101 ఏళ్ల వృద్ధుడు

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇటలీలో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, ఈశాన్య ఇటలీలో ఉన్న రిమిని నగరంలో నివసించే ఓ 101 ఏళ్ల వృద్ధుడు కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారనే వార్త అక్కడ అందరిలో సంతోషాన్ని నింపుతోంది.

    ఆయనను మిస్టర్ పీ అని పిలుస్తున్నారు. కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో గతవారం హాస్పటల్‌లో చేరిన మిస్టర్ పీ గురువారం డిశ్చార్జ్ అయ్యారు.

    101 ఏళ్ల వృద్ధుడు కోలుకోవడం కరోనావైరస్‌పై పోరాటానికి మాలో ఎంతో ఆశలు రేకెత్తిస్తోందని రిమినీ డిప్యూటీ మేయర్ గ్లోరియా లిసీ వ్యాఖ్యానించారు.

    మిస్టర్ పీ కరోనావైరస్‌పై విజయం సాధించారని ఆమె వ్యాఖ్యానించారు.

  14. స్పెయిన్‌లో పెరుగుతున్న కోలుకునేవారి సంఖ్య

    స్పెయిన్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య 5600 దాటింది. అంటే మరణాల సంఖ్యలో గత 24 గంటల్లో 17శాతం పెరుగుదల చోటుచేసుకుంది.

    ఇప్పటివరకూ 72248మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శుక్రవారం నాడు ఈ సంఖ్య 64059గా ఉంది. అంటే, ఇన్ఫెక్షన్లు 12.8శాతం పెరిగాయి.

    కానీ, ఇక్కడ గుర్తించాల్సిన సంతోషకరమైన విషయం ఏంటంటే, కరోనావైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ 24 గంటల్లో 2928 మంది కోలుకోవడంతో మొత్తం ఇప్పటివరకూ 12285 (31శాతం పెరుగుదల) మంది ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు.

  15. దుకాణాలు మూయమంటే పోలీసులపై రాళ్లు రువ్వారు

    అస్సాంలోని న్యూబొంగై పోలీస్ స్టేషన్ పరిధిలోని భావ్లాగుడి బొడీ బజార్‌లో పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. లాక్ డౌన్ నేపథ్యంలో బజారులోని దుకాణాలను మూయించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు రాళ్లదాడి చేసినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. రాళ్లదాడికి పాల్పడినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ఐసోలేషన్ కేంద్రాలుగా రైలు బోగీలు.. రైల్వే శాఖ ముమ్మర ఏర్పాట్లు

    దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించడంతో రైళ్లు కూడా తిరగడం లేదు. దీంతో రైలు బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి పరీక్షిస్తోంది రైల్వే శాఖ. దీనివల్ల కేసులు ఎంతగా పెరిగినా ఐసోలేషన్ వసతి కల్పించవచ్చని.. పైగా రైలు బోగీలు కావడంతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీటిని తరలించి ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతి జోన్ పరిధిలో వారానికి 10 బోగీలను ఇలా మార్చేలా రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే తయారుచేసిన ఐసోలేషన్ బోగీల ఫొటోలను విడుదల చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. హోంక్వారంటీన్‌లో ఉన్నవారు ఇల్లు దాటి బయటకొస్తే తెలిసిపోయేలా ఏపీ పోలీసుల యాప్

    కరోనావైరస్ కట్టడి కోసం ఏపీ పోలీసులు హౌస్ క్వారంటీన్ యాప్‌ తీసుకొచ్చారు. హౌస్‌ క్వారంటీన్‌లో ఉన్నవారంతా ఈ యాప్‌లో మొబైల్‌ నంబర్, ఆరోగ్య వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. దీంతో ఈ యాప్‌ ద్వారా వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచడానికి అవకాశమేర్పడుతుంది. ఈ యాప్ సహాయంతో కోవిడ్‌ బాధితుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవడంతోపాటు అవసరమైన వైద్య సేవలకు సంబంధించిన సూచనలూ అందుతాయి. కోవిడ్‌ బాధితులు ఇంటి నుంచి 50 మీటర్లు దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులను వారి వివరాలతో జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నియంత్రించనున్నారు. సాంకేతిక నిపుణులైన పోలీసుల అధికారుల బృందం ఈ హౌస్‌ క్వారంటీన్‌ యాప్‌ను రూపొందించింది. యాప్‌ను శుక్రవారం ఒక్క రోజే క్వారంటీన్‌లో ఉన్న ఐదు వేల మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

    ప్రతీకాత్మక చిత్రం

    ఫొటో సోర్స్, Getty Images

  18. విద్యుత్ బిల్లులు ఆలస్యంగా చెల్లించినా జరిమానాలు వద్దు: కేంద్ర ఇంధన శాఖ

    దేశమంతా లాక్‌డౌన్ అమలవుతున్న ఈ సమయంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి కంకణబద్ధులై ఉన్నట్లు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.

    విద్యుత్ బిల్లులు ఎవరైనా ఆలస్యంగా చెల్లించినా వారికి జరిమానాలు విధించవద్దంటూ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థను ఆదేశించింది.

    రాష్ట్రాల్లోని నియంత్రణ సంస్థలకూ ఈ ఆదేశాలు జారీచేయాలని రాష్ట్రాలకూ సూచించింది. ఉత్పత్తి, పంపిణీ సంస్థల మధ్య బకాయిల సమస్యలున్నప్పటికీ అవేమీ విద్యుదుత్పత్తి, సరఫరాలపై ప్రభావం చూపరాదని ఇంధన శాఖ పేర్కొంది.

  19. ఏపీలో 13 పాజిటివ్ కేసులు.. శాంపిళ్ల కలెక్షన్, పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

    ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం(27.03.2020) వరకు పరీక్షించిన శాంపిళ్లలో 13 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారని.. 378 శాంపిళ్లు నెగటివ్‌గా తేలాయని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం 22 శాంపిళ్లలు పరీక్షించగా అన్నీ నెగటివ్‌గా తేలాయని.. ఇంకో 37 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని ప్రకటించింది. కోవిడ్-19 లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన రోగుల శాంపిళ్ల కలెక్షన్, పరీక్షలు నిర్వహించడానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కరోనా పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలన్నీ 24*7 పనిచేస్తాయి. శాంపిళ్ల కలెక్షన్ కోసం ప్రత్యేకంగా వాహనాలు, బృందాలు ఏర్పాటుచేశారు. విదేశాల నుంచి ఇప్పటివరకు 29264 మంది రాష్ట్రానికి వచ్చారని, వారిలో 29,115 మంది వారివారి ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉన్నారని.. 149 మంది హాస్పిటళ్లలో ఉన్నారని ఆరోగ్య శాఖ చెప్పింది.

  20. భారత్‌లో మరణాలు ఎక్కడెక్కడంటే..

    దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో అయిదుగురు కరోనావైరస్ సోకి మరణించారు. గుజరాత్‌లో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో 1, దిల్లీ 1, హిమాచల్ ప్రదేశ్ 1, జమ్ముకశ్మీర్ 1, పంజాబ్ 1, తమిళనాడు 1, పశ్చిమ బెంగాల్‌లో 1 మరణం నమోదయ్యాయి.