అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ ప్రకటించింది. తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు ఆపుతున్నట్లు పేర్కొంది.
అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది.
మూసివేసిన స్టేషన్లు ఇవే..
1) లోక్ కల్యాణ్ మార్గ్
2) రాజీవ్ చౌక్
3) పటేల్ చౌక్
4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్
5) బారాకంబా రోడ్
6) సుప్రీంకోర్ట్
7) సేవా తీర్థ్
8) జన్‌పథ్
9) మండీహౌస్
10) సెంట్రల్ సెక్రటేరియట్
11) ఐటీఓ
12) దిల్లీ గేట్
13) ఇంద్రప్రస్థ
14) ఖాన్ మార్కెట్
15) జోర్ బాగ్
16) శివాజీ స్టేడియం
‘18 నెలలు ప్రయత్నించినా పిల్లలు కలగలేదు’.. మగవాళ్లలో సంతానలేమి సమస్యలను పెద్దగా పట్టించుకోరెందుకు
అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, https://x.com/RahulGandhi
ఫొటో క్యాప్షన్, ఛత్రసాల్ స్టేడియంలో రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు మంగళవారం చేపట్టిన ధర్నా, తనను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం తరువాత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు తనను ఉంచిన ఛత్రసాల్ స్టేడియంలో రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఒక కాలికి మాత్రమే షూ వేసుకుని కనిపించారు.
‘సోమవారం జరిగిన ఘటనలపై చర్చకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని తర్వాత స్పష్టమైంది. దీంతో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలని, విద్యార్థుల సమస్యలు, దేశంలోని సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నాం.
భారత విద్యావ్యవస్థ ఎందుకు నాశనమైంది, పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి?విద్య ఎందుకు భారత్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది, పిల్లలను చదివించడానికి ప్రజలు ఆర్థికంగా ఎందుకు పూర్తిగా నష్టపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పూలేదు.
విద్యార్థులు కోరినట్టుగా అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ మొత్తం వ్యవహారంపై
పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరపాలి.
ప్రతిపక్షనేతగా నేను ప్రధాని మోదీకి ఓ సలహా ఇస్తున్నా. సోమవారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థల్లో వీలయినంత తొందరగా సంస్కరణలు తేవాలి.
విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?
రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.
‘పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.
‘నీట్ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు కాదు’ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్.
విద్యార్థుల సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతల తరలింపు, కొందరి విడుదల

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.
లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు వీరంతా ధర్నా చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విపక్ష నేతలలో కొందరిని ఈ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఛత్రసాల్ స్టేడియంలో కాసేపు ఉంచిన తర్వాత పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. "ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలి. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. వారిని కొట్టారు, తలలు పగలగొట్టారు.. చివరికి విద్యార్థినుల బట్టలు కూడా చింపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నుంచి ఆశించే ప్రవర్తన ఇదేనా? మేం ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతాం" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మన దేశ భవిష్యత్తైన పిల్లల మాట వినడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? వారి డిమాండ్ చాలా న్యాయమైంది. ప్రజాప్రతినిధులుగా వారి గొంతుకను వినిపించడం, బలోపేతం చేయడం మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. ఎక్కడ అవసరమైతే అక్కడ మా గొంతు వినిపిస్తాం. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి మేం ఒకే మాటపై ఉన్నాం. కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక బిల్లును ఎందుకు తీసుకురావడం లేదు?" అని తెలిపారు.
"ప్రభుత్వం నిన్న తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ రోజు కూడా అదే క్రూరత్వాన్ని పునరావృతం చేసింది. వీరు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకులు. జితేంద్ర సింగ్ మాకు నోటీసు ఇవ్వమని, ఆ తర్వాత చర్చ గురించి ఆలోచిస్తామని చెప్పారు; కానీ మాకు అది ఇష్టం లేదు. మేం నిన్న నోటీసు ఇచ్చాం, ఈ రోజు కూడా ఇచ్చాం" అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
ప్రధాని నివాసం వద్ద ధర్నా: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, Congress/X
దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Congress/X
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. "ఇది ముగింపు కాదు, రాహుల్ గాంధీ నాయకత్వంలో సరికొత్త విప్లవానికి ఇది ఆరంభం మాత్రమే. వాళ్లు మమ్మల్ని జైల్లో పెట్టవచ్చు, లాఠీఛార్జ్ చేయవచ్చు, లేదా వేధించవచ్చు. కానీ, పేపర్ లీకుల వల్ల భవిష్యత్తును కోల్పోయి, తమ కుటుంబాల ఆశలు ఆవిరైపోయిన భారతదేశంలోని కోట్లాది మంది బిడ్డలకు మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాల్సింది" అన్నారు.
నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...
ఒకే కాన్పులో ఒకేలా ఉన్న నలుగురు శిశువుల జననం
నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం.. ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన 'మంగళ్ మిలన్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.
సమావేశం అనంతరం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రసంగం గురించి మీడియాకు తెలియజేశారు.
‘నీట్ పరీక్షకు సంబంధించి, అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని, పదమూడు మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ప్రధానమంత్రి చెప్పారు" అని కిరణ్ రిజిజు చెప్పారు.
‘విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ పరీక్ష మళ్లీ నిర్వహించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను ప్రకటించామని ప్రధాని మోదీ అన్నారు. పేపర్ లీక్ వంటి సంఘటనలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు’ అని రిజిజు చెప్పారు.
పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సిక్కిం: సొరంగ నిర్మాణంలో ప్రమాదం.. 8 మంది మృతి

ఫొటో సోర్స్, Namchi District Admin
ఫొటో క్యాప్షన్, గౌహతిలో సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. సిక్కింలోని నామ్చి జిల్లాలోని సమర్‌దుంగ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదం తర్వాత ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు.
ఎన్‌హెచ్‌పీసీకి చెందిన తీస్తా జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని నామ్‌చి జిల్లా డిప్యూటీ కమిషనర్ అనుప తమ్లింగ్ తెలిపారు.
సోమవారం కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో లోపలకు వెళ్లే దారి మూసుకుపోయింది. సొరంగంలో గ్యాస్ లీక్ అవ్వడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని అధికారులు చెబుతున్నారు
“సంబంధిత శాఖల నుండి అందిన సమాచారం ప్రకారం సొరంగంలో కనీసం 25 మంది చిక్కుకుపోయారు. లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి” అని జిల్లా డిప్యూటీ కమిషనర్ బీబీసీతో చెప్పారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులు చాలా దూరంలో ఉన్నారని, అక్కడ ఆక్సిజన్ కొరత గ్యాస్ లీకేజీ సమస్య ఉందని అనుప తమ్లింగ్ తెలిపారు.
కాక్రోచ్ పార్టీ నిరసనలపై బాలీవుడ్ నటులు ఏమన్నారంటే

ఫొటో సోర్స్, Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ అనంతరం సినీ నటులు కొందరు ఈ నిరసనకు మద్దతు పలికారు.
నటులు సోనూసూద్, రితేష్ దేశ్‌ముఖ్, రణ్‌వీర్ షోరే, నటి జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు.
“మన విద్యార్థులకు కర్రలు అవసరం లేదు. వారిని కౌగిలించుకునే చేతులు కావాలి” అని నటుడు సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
“దేశ యువతకు మేము అండగా నిలుస్తాం. వారి గొంతు తప్పకుండా వినిపించాలి. దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది వాళ్లే. మనం వారి మాట విందాం. వారికి అండగా ఉందాం. ముందుకు సాగడానికి వారికి అవకాశం ఇద్దాం. మన యువత శక్తి, ధైర్యం మనం కోరుకునే దేశ నిర్మాణంలో సాయపడతాయి” అని రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియా అన్నారు.
“మంత్రి ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సి. అలా చేసి ఉంటే ప్రభుత్వం పరువు నిలబడి ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూర్చకుండా లేదా తనకు తానే సమస్యలు సృష్టించుకోకుండా ఈ పరిస్థితి నుండి బయటపడగలదని నేను అనుకోవడం లేదు” అని నటుడు రణవీర్ షోరే ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు మద్దతుగా నటి భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు
“ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదు. ఈరోజు మనం హింసాత్మక దృశ్యాలను చూశాం. ఈ ఉద్యమంలో యువత హింసకు పాల్పడకుండా, దాని మార్గం నుండి పక్కకు తప్పుకోకుండా చూడటం మన బాధ్యత. ప్రజాస్వామ్యాలు చర్చలు, సంప్రదింపులపై ఆధారపడి ఉంటాయి. బలహీన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గం. ఈ నమ్మకాన్ని మనం వమ్ము కానివ్వకూడదు” అని ఆమె అందులో రాశారు.
పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?
పార్లమెంట్ మార్చ్ తర్వాత అభిజీత్ దీప్కే తమ మద్దతుదారులకు క్షమాపణ ఎందుకు చెప్పారు?

ఫొటో సోర్స్, Sanjeev Verma/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దిల్లీ పోలీసుల అణచివేత నుంచి నిరసనకారులను రక్షించేందుకు తామింకా మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. తమ మద్దతుదారులకు ఆయన క్షమాపణలు చెప్పారు.
“నా మద్దతుదారులందరికీ, ముఖ్యంగా పోలీసు అధికారుల చేతిలో దెబ్బలు తిన్న అమ్మాయిలకు క్షమాపణలు చెబుతున్నాను. మేం ఇంకా మెరుగ్గా చేసి ఉండాల్సింది. దిల్లీ పోలీసుల అమానుష చర్యల నుండి మిమ్మల్ని కాపాడటానికి నేను ఇంకా బాగా పని చేసి ఉండాల్సింది” అని ఆ సందేశంలో తెలిపారు.
“20 మందికి పైగా విద్యార్థుల మరణానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడటం కోసం ప్రభుత్వం మరెంతో మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి సిద్ధపడింది. మీరు గాయపడి ఇది చూస్తున్నట్లయితే, నాకు మెసేజ్ చేయండి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను” అని అభిజీత్ దీప్కే తన సందేశంలో పేర్కొన్నారు.
తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.
సోమవారం సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు, వారిపై లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ సంఘటనల్లో అనేక మంది గాయపడ్డారు.
నిరసనకారులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసు చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
సీజేపీ నిరసనకారులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ దిల్లీలో చేపట్టిన నిరసన, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వారిపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ వాడకంపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీసుల చర్యపై విచారణ జరిపి, నిరసనకారుల హక్కులను పరిరక్షించాలని ఆ సంస్థ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది.
‘దిల్లీలో నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు లాఠీలు, టియర్ గ్యాస్ ఉపయోగించాయన్న ఆరోపణలపై భారత అధికారులు తక్షణమే విచారణ జరపాలి" అని హ్యూమన్ రైట్స్ వాచ్ఆసియా డిప్యూటీ డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.
