నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ ప్రకటన

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాడలిన్ హాల్పర్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
తన భార్య ఉషా వాన్స్ నాలుగో బిడ్డకు జన్మనిచ్చినట్లు అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ప్రకటించారు.
ఆదివారం ఉదయం మగబిడ్డ అలెక్ నీల్ వాన్స్ జన్మించినట్లు ఆయన సోషల్ మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు.
"ఉషా, బాబు ఇద్దరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిట్టితమ్ముడిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు" అని ఆయన తెలిపారు. అత్యుత్తమ వైద్యసేవలు అందించిన వాల్డర్ రీడ్ ఆస్పత్రిలోని వైద్యులకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
వార్త సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, పదవిలో ఉండగా ఉపాధ్యక్షుడు తండ్రి కావడం గత 150 ఏళ్లలో ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.
జేడీ వాన్స్, ఉషా దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఇవాన్ (9), వివేక్ (6), మిరాబెల్ (4) ఉన్నారు.
భారతీయ మూలాలున్న ఉషా చిలుకూరి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో శివారు ప్రాంతంలో పుట్టిపెరిగారు. ఆమె తండ్రి ఒక మెకానికల్ ఇంజినీర్ కాగా, తల్లి మాలిక్యులర్ బయాలజిస్ట్. భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ నుంచి వారు అమెరికాకు వలస వెళ్లారు.
యేల్ లా స్కూల్లో విద్యార్థిగా ఉన్న సమయంలో 2010లో ఉషా, జేడీవాన్స్ కలుసుకున్నారు. "సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా" అనే అంశంపై చర్చా వేదికలో పాల్గొన్న సమయంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Pool/Getty Images
అమెరికాలో జననాల రేటు పెరుగుదలపై గళం విప్పిన ట్రంప్ ప్రభుత్వంలోని ప్రముఖుల్లో జేడీ వాన్స్ ఒకరు.
మరో బిడ్డను కనేందుకు ఉషా మొదట సుముఖంగా లేరని, కానీ గత ఏడాది సంప్రదాయవాది చార్లీ కిర్క్ హత్య తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నట్లు ఇటీవల ప్రచురితమైన తన పుస్తకంలో వాన్స్ రాశారు.
"మా స్నేహితుడిని ఖననం చేసిన కొద్దిరోజులకే ఆమె నాలుగోసారి గర్భం దాల్చారు."
"మా నుంచి ఒక ప్రాణాన్ని లాక్కున్నారు, కానీ మాకు మరో ప్రాణం దక్కింది" అని ఆయన రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































