అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?

  2. సీజేపీని చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

    జితేంద్ర సింగ్, కాక్రోచ్ జనతా పార్టీ, చర్చలు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, కేంద్రమంత్రి జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు సిద్ధమని జితేంద్ర సింగ్ చెప్పారు.

    జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు.

    “ప్రభుత్వం తరఫున మేము చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. అవసరమైనంత సమయం ఇవ్వడానికి కూడా సిద్ధం” అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

    “సీజేపీ ప్రతినిధులతో చర్చల కోసం ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం నుంచి నాలుగు సార్లు అధికారిక ప్రతిపాదనలు పంపింది” అని కేంద్ర మంత్రి చెప్పారు.

    కేంద్రమంత్రి జేపీ నడ్డా కార్యాలయంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరగవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

    “మాకెలాంటి భేషజాలు లేవు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, నేను వ్యక్తిగతంగా చర్చలకు హాజరవుతాం. సంప్రదింపుల ద్వారా పరిష్కారం ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.

  3. ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన అధికారం ఏంటి?

    యువత నిరసన, దిల్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.

    అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.

    దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.

    జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.

    దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.

    జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.

  4. సీదిరి అప్పలరాజు అరెస్ట్: యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారా?

  5. ‘యువత భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించింది మీరే’.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆరోపణ

    rahul gandhi

    ఫొటో సోర్స్, Getty Images

    యువత సంక్షేమం, భవిష్యత్ కంటే ఏదీ ముఖ్యం కాదంటూ నరేంద్ర మోదీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై రాహుల్ గాంధీ స్పందించారు.

    ‘యువత భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించింది మీరే. విద్యావ్యవస్థను పూర్తిగా గుప్పిట్లోకి తీసుకుని, నాశనం చేయడానికి మీరే అనుమతించి ప్రోత్సహించారు. అందుకు బాధ్యులైన అందరినీ కాపాడారు’ అన్నారు.

    విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించాలని, విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ మూడు డిమాండ్లు చేశారు.

  6. మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు

  7. ‘యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదు’

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Antonio Masiello/Getty Images

    యువత సంక్షేమం, భవిష్యత్ కంటే మరేదీ ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన, కఠిన శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు మోదీ చెప్పారు.

    ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, అథారిటీలను ఆదేశించినట్లు తెలిపారు.

    విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చేపడుతున్న చర్యలలో ఇది కూడా ఒకటని అన్నారు.

    యువత భవిష్యత్‌కు నష్టం చేకూర్చాలని ప్రయత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లో తాము వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు.

  8. దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు బంద్

    Rajiv Chowk Metro station

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీలో నిరసనల నేపథ్యంలో గురువారం (23.07.2026) కూడా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7.30 నుంచి మూసివేస్తున్నామని, తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలకు వీలుండదని ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.

    మూసివేసిన స్టేషన్లు ఇవే..

    1) లోక్ కల్యాణ్ మార్గ్

    2) రాజీవ్ చౌక్

    3) పటేల్ చౌక్

    4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

    5) బారాఖంభా రోడ్

    6) సుప్రీంకోర్ట్

    7) సేవా తీర్థ్

    8) జన్‌పథ్

    9) మండీహౌస్

    10) సెంట్రల్ సెక్రటేరియట్

    11) ఐటీఓ

    12) దిల్లీ గేట్

    13) ఇంద్రప్రస్థ

    14) ఖాన్ మార్కెట్

    15) జోర్ బాగ్

    16) శివాజీ స్టేడియం

    అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే సౌకర్యం ఎప్పటిలా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

  9. కాక్రోచ్ ఉద్యమం: బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అస్త్రంగా మారనుందా?

  10. ‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు, వారే మన భవిష్యత్’, – ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, PTI

    కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ కాన్ఫరెన్స్‌లో ధర్మేంద్ర ప్రధాన్ గురించి, నిరసన చేస్తోన్న విద్యార్థుల గురించి, ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసన గురించి మాట్లాడారు.

    ‘‘మన విద్యార్థులకు ఎందుకిలా జరుగుతోంది అనేదే ప్రశ్న? మన విద్యార్థులు చేసిన తప్పు ఏంటి? భద్రతా బలగాలు వారి ముందు ఆయుధాలు పట్టుకుని నిల్చున్నాయి. వాళ్లు చేసిన తప్పేంటి?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    ‘‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ టెర్రరిస్టులు కాదు, వారే మన భవిష్యత్’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    దీనికి బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.

    ప్రధాని నరేంద్ర మోదీ నివాసం బయట జరిగిన నిరసన గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘భారత విద్యార్థులు వీధుల్లోకి వస్తే, ప్రతిపక్షం కూడా వీధుల్లోకి రావాలని మేం భావించాం. ఇదే ప్రధాన కారణం’’ అని అన్నారు.

    ప్రధాని నివాసానికి వెళ్లే ముందు, తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గరకు వెళ్లి, సభలో విద్యార్థుల సమస్యపై మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పుడు ఓం బిర్లా తాను ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారని పేర్కొన్నారు.

    ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని, మొత్తం విషయాన్ని పక్కకు పెట్టేశారని రాహుల్ గాంధీ అన్నారు.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఆయన, ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రతీక. విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థుల గౌరవం కోసం, ఆ 'ధర్మేంద్ర ప్రధాన్' అనే ప్రతీకను తొలగించాల్సిందే" అని డిమాండ్ చేశారు.

  11. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.

  12. ఎవరు ఆర్డర్ పెడుతున్నారో తెలీదు, వందల్లో వస్తున్న ఫుడ్ పార్శిళ్లు... ఎక్కడంటే..

  13. రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే మోదీ ప్రభుత్వంలో మంత్రులు చర్చల కోసం ఎందుకు వచ్చారు?

  14. సీజేపీ నిరసన: సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులకు దిల్లీ హైకోర్టు ఆదేశం

    జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Getty Images

    జూలై 20న జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల చర్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది .

    బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలు కేవలం బాధితులపై వ్యక్తిగత ఫిర్యాదులు దాఖలు చేయడానికి మాత్రమే సూచించేవికావని పేర్కొంది.

    "ఇది ఒకే ఒక్క సంఘటన అయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. వారిని వ్యక్తిగత ఫిర్యాదు చేసుకోమని పోలీసులు కోరడం సరైనదే కావచ్చు. కానీ ఇది అలాంటి కేసు కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.

    దీని తర్వాత కోర్టు పోలీసులను తమ సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

    సీసీటీవీ ఫుటేజ్, ఇతర వీడియో సాక్ష్యాలను భద్రపరచాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.

    ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది.

  15. ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు

  16. షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు

  17. కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’

    సౌరవ్ దాస్

    ఫొటో సోర్స్, ANI/X

    ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

    ‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.

    తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?

  19. సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ

  20. ‘రాహుల్ గాంధీతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’

    తమిళనాడు

    ఫొటో సోర్స్, R. Satish BABU / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం విజయ్

    లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ పార్టీ ఖండించింది.

    రాహుల్ గాంధీని నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా చేసిన దాడని తమిళగ వెట్రి కళగం(టీవీకే)ఆరోపించింది.

    ‘‘దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి. నీట్ పరీక్ష విశ్వసనీయత మొదటినుంచీ ప్రశ్నార్థకంగా ఉంది. విద్యార్థులపై నిరంతర మానసిక ఒత్తిడి పెరిగింది. వారి కలలు ప్రశ్నార్థకంగా మారాయి. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి ’’ అని టీవీకే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.