You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్ స్విండన్ ఆలయం: ఆరు నెలల్లో ఆరుసార్లు చోరీ, సీసీకెమేరాకు చిక్కిన దుండగులు
బ్రిటన్‌లోని స్విండన్ దేవాలయంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరు నెలల్లో ఆరు సార్లు చోరీ చేశారు.
ఈ దేవాలయంపై దాడులు చేసిన కొందరు దుండగులు.. దేవుడి విగ్రహాలు పెట్టే ప్రాంతాలను చిందరవందర చేశారు.
చివరిసారిగా అక్టోబరు 31న దాడి జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కేబుళ్లు, పైపులను దుండగులు తీసుకెళ్లిపోయారు.
‘‘మందిర నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు సామగ్రిని ఎత్తుకెళ్లడానికి వారు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు’’ అని విల్ట్‌షైర్ పోలీస్ విభాగం అధికారి డెట్ కాన్ హెలిన్ క్యారిక్ అన్నారు.
బ్రిటన్‌లోని డెర్బి రోడ్‌లోనున్న ఈ దేవాలయాన్ని గత మే నుంచి అక్టోబరు మధ్య దాదాపు ఆరుసార్లు దుండగులు దోచుకున్నారు.
ఈ ఆలయాన్ని స్విండన్ బరో కౌన్సిల్ గత నెలలో మూసివేసింది. భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో లోపలకు భక్తులకు పంపకూడదని నిర్ణయించినట్లు కౌన్సిల్ తెలిపింది.
ఇటీవల భారీ తాళాలు, షట్టర్లను ధ్వంసం చేసి దుండగులు లోపలకు ప్రవేశించారు. అక్టోబరు 31 రాత్రి 7.20 నుంచి 9 మధ్య ఈ దాడి జరిగింది.
ఆలయంలోకి చొరబడి, దోచుకున్న దుండగుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.
‘‘ఆలయం పరిసరాల్లో స్థానిక అధికారులు గస్తీని పెంచారు. దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. మా దగ్గర సీసీటీవీ ఫోటోలు కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తాం’’ అని క్యారిక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ జిల్లాల్లో జల విధ్వంసం... నిర్లక్ష్యం వల్లే డ్యామ్లు కొట్టుకుపోయాయా?
- హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి, 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)