టోక్యో ఒలింపిక్స్: రేస్ నుంచి మనికా బాత్రా, సుమిత్ నాగల్ అవుట్

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి.
టేబుల్ టెన్నిస్ విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్ నుంచి మనికా బాత్రా అవుట్ అయ్యారు.
ఆస్ట్రేలియాకు చెందిన, వరల్డ్ నంబర్ 17, సోఫియా పోల్కనోవా చేతిలో 4-0 తేడాతో మనికా ఓడిపోయారు. అంటే ఒక్క గేమ్‌లోనూ మనికా పైచేయి సాధించలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు టెన్నిస్‌లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో రష్యాకు చెందిన డేనిల్ మెద్వెదేవ్ చేతిలో భారత్ ఆటగాడు సుమిత్ నాగల్ ఓడిపోయాడు.
66 నిమిషాల్లోనే 6-2, 6-1 స్కోర్‌తో సుమిత్‌ను మెద్వెదేవ్ ఓడించాడు.
మొదటి సెట్ నుంచీ సుమిత్‌పై మెద్వెదేవ్ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్లాడు.
మొదటి రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డేనిస్ ఇస్టోమిన్‌ను సుమిత్ ఓడించాడు.
అయితే, రెండో రౌండ్‌లో ఓటమితో ఆయన పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
విమెన్స్ డబుల్స్ తొలి రౌండ్లోనే సానియా మీర్జా, అంకితా రైనా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images
ఫెన్సింగ్‌లో భవానీ దేవి ఓటమి.. అదే బాటలో ఆర్చరీ పురుషుల జట్టు
మొదటగా ఫెన్సింగ్‌లో ట్యునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీను 15-3 తేడాతో భవానీ దేవి మట్టి కరిపించారు. ఇది ఫెన్సింగ్‌లో తొలి ఈవెంట్.
తర్వాతి దశలో ఫ్రాన్స్‌కు చెందిన మనన్ బ్రూనెట్ చేతిలో 15-7 తేడాతో భవానీ ఓడిపోయారు.
ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి భారత భారత క్రీడాకారిణి భావానీనే.

ఫొటో సోర్స్, ADEK BERRY/AFP via Getty Images
మరోవైపు పురుషుల ఆర్చరీ టీమ్ కూడా మొదట్లో మంచి ప్రదర్శన ఇచ్చింది.
ప్రీ కార్టర్స్‌లో కజఖ్‌స్తాన్ జట్టును అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లు ఓడించారు.
తర్వాతి దశ, క్వార్టర్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టుతో భారత ఆర్చరీ జట్టు తలపడింది.
అయితే, 6-0 తేడాతో దక్షిణ కొరియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది.
మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భారత్ క్రీడాకారుడు శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
పోర్చుగల్‌కు చెందిన టియాగో అపోలోనియాను 4-2 తేడాతో ఆయన ఓడించారు.
విమెన్స్ సింగిల్స్ సెకండ్ రౌండ్‌లో పోర్చుగల్ క్రీడాకారిణి యూ విస్ చేతిలో సుతీర్థ ముఖర్జీ ఓడిపోయారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























