You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా డబుల్ వేరియంట్ ఇన్ఫెక్షన్‌తో 90 ఏళ్ల మహిళ మృతి
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్
- ప్రచురణ
ఒకే వ్యక్తికి రెండు కోవిడ్ వేరియంట్లు సోకే అవకాశం ఉందా? అవును, సోకవచ్చన్నదే ఇప్పుడు సరైన జవాబు.
బెల్జియంలో 90 ఏళ్ల ఓ మహిళకు కోవిడ్ వేరియంట్లు ఆల్ఫా, బీటాలు ఒకేసారి సోకడంతో, తీవ్ర అనారోగ్యం పాలై మరణించారు.
దీంతో, రెండు కోవిడ్ వేరియంట్లు ఒకే సమయంలో సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో చనిపోయిన ఆమె కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకోలేదు.
ఆ మహిళకు ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి ఇన్ఫెక్షన్లు సోకి ఉండవచ్చని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు అనుమానిస్తున్నారు.
ఇలాంటి కేసు రిపోర్ట్ కావడం ఇదే తొలిసారి కానీ డబుల్ ఇన్ఫెక్షన్లు సంక్రమిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అరుదే కానీ అసాధ్యం కాదు
ఈ ఏడాది జనవరిలో ఇద్దరు వ్యక్తులకు రెండు కరోనా వేరియంట్లు ఒకే సమయంలో సోకాయన్న విషయాన్ని బ్రెజిల్ సైంటిస్టులు తెలియజేశారు. ఆ రెండు వేరియంట్లలో ఒకటి 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్'గా గుర్తించిన గామా వేరియంట్.
మరోచోట పోర్చుగీసులో ఇటీవలే ఒక 17 ఏళ్ల అబ్బాయికి కరోనా సోకింది. దాని నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే ఆ అబ్బాయికి మరో కోవిడ్ వేరియంట్ సోకిందని తనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.
కాగా, చనిపోయిన 90 ఏళ్ల మహిళకు సోకిన రెండు వేరియంట్లూ 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' జాబితాలోనివే. ఆమె అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రిలో చేర్చారు. తరువాత, శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రం కావడంతో మరణించారు.
ఆమెను ఆస్పత్రిలో చేర్చిన తరువాత చేసిన పరీక్షల్లో ఆమెకు రెండు వేర్వేరు కోవిడ్ వేరియంట్లు సోకినట్లు నిర్థరించారు.
"ఆ సమయంలో బెల్జియంలో ఆల్ఫా, బీటా వేరియంట్లు రెండూ విజృంభిస్తూ ఉన్నాయి. కాబట్టి, ఆమెకు ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి ఈ రెండు వేరియంట్లు సంక్రమించి ఉండవచ్చు. అయితే, ఆమెకు ఇన్ఫెక్షన్లు ఎక్కడి నుంచి, ఎలా సంక్రమించాయన్నది మాత్రం తెలియలేదు. రెండు వేరియంట్లు సోకడం వల్లే ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించిందా అనేది చెప్పడం కష్టం" అని బెల్జియంలోని ఓఎల్‌వీ ఆస్పత్రి వైద్యులు అన్నే వాంకీర్‌బర్గెన్ తెలిపారు.
ఆందోళనకరమైన వేరియంట్స్
సాధారణంగా వైరస్‌లు ఉత్పరివర్తనం చెందడం ద్వారా అభివృద్ధి చెందుతాయి. దాంతో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయి.
కరోనావైరస్ కూడా పలు ఉత్పరివర్తనాలకు గురైంది. వీటిల్లో మానవులకు చాలా ప్రమదాకరమైన వాటిని 'వేరియంట్స్ ఆఫ్ కన్సర్'గా గుర్తించారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
అయితే, ఇప్పటికి అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు ఈ కొత్త వేరియంట్లపై కూడా ప్రభావం చూపిస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.
మరో పక్క, ఇంతకన్నా మేలు కలిగించే కొత్త వ్యాక్సీన్ల తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.
"రెండు వేర్వేరు వేరియంట్లను ఒకే వ్యక్తిలో గుర్తించడం ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. ఇవి ఒకే వ్యక్తి ద్వారా సంక్రమించి ఉండవచ్చు. లేదా వేరు వేరు వ్యక్తుల ద్వారా సోకి ఉండవచ్చు" అని వార్విక్ విశ్వవిద్యాలయంలో వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ అన్నారు.
అయితే, ఇలా రెండు వేరియంట్లు సోకినప్పుడు వ్యాక్సీన్లు బాగా పనిచేస్తాయా లేదా, ఈ పరిస్థితి కోవిడ్ 19 సంక్షోభాన్ని మరింత దిగజారుస్తుందా అనే దానిపై లోతైన పరిశోధన జరగాలని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 మిక్స్ అండ్ మ్యాచ్: వేర్వేరు వ్యాక్సీన్లు తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ
- కరోనావైరస్తో చాలామంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు?
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం, దీనిని ఎలా గుర్తించాలి?
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)