ఆంధ్రప్రదేశ్: టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం-సుప్రీంకోర్టు విధించిన గడువులోగా నిర్వహించలేమని వెల్లడి-Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ఈ విషయం వెల్లడించారు.
జులై 31లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, కానీ ఆ గడువులోగా నిర్వహించడం సాధ్యం కాదని, అందుకే రద్దుకు నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి సురేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్‌తోపాటు పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘అన్ని కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ సుప్రీం కోర్టు విధించిన గడువులో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం సాధ్యం కాదు. జులై ఒకటిన పరీక్షలు ప్రారంభించినా అవి ముగియడానికి జులై 27 వరకు పడుతుంది. ఆ తర్వాత పేపర్లు దిద్దడానికి మరో 15 రోజులు పడుతుంది’’ అని మంత్రి సురేశ్ అన్నారు .
పరీక్షలు రద్దు కావడంతో మార్కులు నిర్ణయించే విధానాన్ని త్వరలోనే తెలియచేస్తామని మంత్రి చెప్పారు. ఫలితాల కోసం హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సుప్రీంకోర్టులో విచారణ
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై గురువారం సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం గురించి అఫిడవిట్‌లో ఎక్కడా పేర్కొన లేదని అన్నది. ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్క విద్యార్ధి ప్రాణం పోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పరీక్షల రద్దే అత్యుత్తమ మార్గంగా భావిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

మావోయిస్టులు హరిభూషణ్, సారక్క మృతి... తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటన
మావోయిస్టులు హరిభూషణ్ (యాప నారాయణ), సిద్దబోయిన సారక్క (భారతక్క) కరోనా లక్షణాలతో బాధపడుతూ చనిపోయారని నిర్ధరిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
హరిభూషణ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. సారక్క దండకారణ్యంలోని మాడ్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు అని ఆ లేఖలో పేర్కొన్నారు.
'వీరిద్దరూ జూన్ 21 న కరోనాతో మృతి చెందారు. జూన్ 22 న సంస్మరణ సభ నిర్వహించాం. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం' అని మావోయిస్టులు తమ ప్రకటనలో వెల్లడించారు.
హరిభూషణ్ 2015లో తెలంగాణ స్టేట్ సెక్రటరీగా, 2018 లో సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు. 33 ఏళ్ల ప్రస్థానంలో ఆయన గెరిల్లా జోన్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ (50) బస్తర్ అడవుల్లో గుండెపోటు లేదా కరోనాతో మృతి చెందినట్టు తమకు విశ్వసనీయమైన సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ బుధవారం నాడు మీడియాకు తెలిపారు.
మావోయిస్ట్ విధివిధానాలను ఖరారు చేసే 'సెంట్రల్ కమిటీ' సభ్యుడైన హరిభూషణ్‌పై రూ. 40 లక్షల రివార్డ్ ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసులకు, యాంటీ నక్సల్ బలగాల 'మోస్ట్ వాంటెడ్' లిస్ట్‌లో ఆయన ఉన్నారు.
హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మడగూడెం. ఇంటర్ చదివే రోజుల్లోనే దళంలోకి వెళ్లిన ఆయన అంచెలంచెలుగా మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ వరకు ఎదిగారు.

జాన్ మేకఫీ: తొలి యాంటీ-వైరస్ సృష్టికర్త స్పెయిన్ జైలులో అనుమానాస్పద మృతి

ఫొటో సోర్స్, Reuters
యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మేకఫీ బార్సెలోనా జైలు గదిలో మృతి చెందారు. పన్ను ఎగవేత అభియోగాలు ఎదుర్కొంటున్న మేకఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్‌లోని ఒక కోర్టు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు.
మేకఫీని బతికించేందుకు జైలు వైద్యులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిందని కేటలాన్ న్యాయ విభాగం తెలిపింది.
మేకఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు "ఆధారాలు సూచిస్తున్నాయని" ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచానికి తొలి కమర్షియల్ యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అందించిన సంస్థ మేకఫీ.
మేకఫీ తయారు చేసిన 'వైరస్‌స్కాన్' కంప్యూటర్ ప్రపంచంలో వేల కోట్ల డాలర్ల యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ వ్యాపారానికి నాంది పలికింది. తరువాత దాన్ని టెక్ దిగ్గజం ఇంటెల్ 760 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
జాన్ మేకఫీ 2020 అక్టోబర్‌లో స్పెయిన్ నుంచి టర్కీకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
కన్సల్టింగ్ వర్క్, ప్రసంగాలు, క్రిప్టోకరెన్సీ, తన జీవిత కథ హక్కుల అమ్మకం ద్వారా వందల కోట్లు సంపాదించినప్పటికీ నాలుగేళ్లుగా పన్నులు ఎగ్గొట్టారని ఆయనపై కేసు నమోదు చేశారు.
మేకఫీ తన ఆదాయాన్ని నామినీల బ్యాంకు ఖాతాల్లోనూ, క్రిప్టోకరెన్సీ ఖాతాల్లోనూ జమ చేసి పన్ను ఎగవేశారని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపించింది.
రియల్ ఎస్టేట్ ఆస్తులు, ఓ విహార నౌక, ఇంక రకరకాల సంపదను దాచిపెట్టారని, ఇతరుల పేర్లపై రిజిస్టర్ చేశారని ఆరోపించారు.
ఈ కేసును విచారించే అధికారాన్ని స్పెయిన్ జాతీయ కోర్టు బుధవారం అమెరికాకు అప్పగించింది.
తనను వ్యూహాత్మకంగా కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని గత కొన్నేళ్లుగా మేకఫీ ఆరోపిస్తూనే ఉన్నారు.
అయితే, అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపినట్లు స్పానిష్ వార్తాపత్రిక ఈఎల్ పెయిస్ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌లో జన్మించిన ఈ పారిశ్రామికవేత్త 1980లలో తన సొంత సాంకేతిక సంస్థను స్థాపించి, మేకఫీ వైరస్‌స్కాన్‌ను కనిపెట్టనప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చారు.
అయితే, తన సొంత కంప్యూటర్లలో మేకఫీగానీ, మరి ఏ ఇతర యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌గానీ వాడనని ఓసారి ఆయన బీబీసీకి తెలిపారు.
"ఐపీ అడ్రస్ ఎప్పటికప్పుడు మారుస్తూ, వైరస్ వస్తుందని అనుమానమొచ్చే సైట్ల జోలికి పోకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. ఉదాహరణకు పోర్న్ సైట్ల జోలికి ఎప్పుడూ పోను" అని 2013లో బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్ లియో కెలయన్‌కు మేకఫీ తెలిపారు.
2019లో మేకఫీ పన్నుల పట్ల వ్యతిరేక వ్యక్తం చేస్తూ, తాను ఎనిమిదేళ్లుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదని, ఎందుకంటే "పన్నులు విధించడం అక్రమం" అని ట్వీట్ చేశారు.
అదే ఏడాది, ఆయుధాలను దేశంలోకి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయనను డొమినిక్ రిపబ్లిక్‌లో కొన్నాళ్లు నిర్బంధించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న మియన్మార్ ఆర్మీ జనరల్స్
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- మియన్మార్‌లో ‘సరోంగ్ విప్లవం’: మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























