అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం కేసు విచారణ ప్రారంభం – News Reel

జార్జ్ ఫ్లాయిడ్

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ

అమెరికాలో ఆఫ్రికన్ సంతతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో నిందితుడైన మాజీ పోలీసు అధికారి డెరెక్ షావిన్‌పై విచారణ సోమవారం ప్రారంభమైంది. ఈ విచారణ సుమారు నాలుగు వారాల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

మరోవైపు, కేసు విచారణ ప్రారంభమయ్యే ముందు, ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ర్యాలీగా బయలుదేరి మిన్నియాపాలిస్ నగరంలో శాంతి సమావేశం నిర్వహించారు.

గత ఏడాది మే నెలలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపాలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో నిందితుడు పోలీసు డెరెక్ షావిన్ మోకాలితో జార్జ్ ఫ్లాయిడ్‌ను గొంతుపై అదిమపట్టారు. దాంతో ఫ్లాయిడ్ మర‌‍ణించారు.

“దయచేసి వదిలిపెట్టండి, నాకు ఊపి ఆడటంలేదు” అంటూ జార్జ్ ఫ్లాయిడ్ ప్రాధేయపడినా ఆ పోలీస్ అధికారి కనికరించకుండా తొమ్మిది నిమిషాల పాటు గొంతును మోకాలితో అదిమిపట్టారు.

ఈ కారణంగానే జార్జ్ ఫ్లాయిడ్ మరణించారని అభియోగాలు నమోదయ్యయి. అయితే, తాను నిర్దోషినని షావిన్ వాదించారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికా అంతటా జాతి వివక్షకు, హింసకు వ్యతిరేకంగా హింస చెలరేగింది. అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పోస్టు ఇప్పిస్తానని ప్రొఫెసర్‌ను మోసగించిన వ్యక్తి అరెస్టు

ఫొటో సోర్స్, ANI

విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పోస్టు ఇప్పిస్తానని ప్రొఫెసర్‌ను మోసగించిన వ్యక్తి అరెస్టు

మంగుళూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను మోసం చేసిన కేసులో రామ్‌సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ అరెస్టయ్యారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

రాయచూర్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌ పోస్టు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యయాయి.

ప్రొఫెసర్ నుంచి మొత్తం రూ .30 లక్షలు డిమాండ్ చేసిన ప్రసాద్.. అడ్వాన్సుగా రూ .17.5 లక్షలు తీసుకున్నారని పోలీసులు చెప్పారు. తాను మోసపోయినట్టు గ్రహించిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, ugc

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి.. 37 మందికి గాయాలు

విజయనగరం జిల్లాలోని సుంకరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

విశాఖపట్నం-విజయనగరం హైవే మీద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు సుంకరిపేట వద్ద ఢీకొన్నాయి.

అదే సమయంలో వాటిలో ఒక బస్సును వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ముగ్గురు మృతి చెందారు. సుమారు 37 మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

చికిత్స బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇండోనేసియా చమురు రిఫైనరీలో మంటలు

ఫొటో సోర్స్, EPA

ఇండోనేసియాలోని చమురు రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం...

ఇండోనేసియాలోని అతిపెద్ద చమురు రిఫైనరీల్లో ఒకటైన బలాంగన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ఘటనలో కనీసం ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

కర్మాగారంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ముందుజాగ్రత్తగా స్థానికంగా ఉంటున్న 950 మంది సురక్షిత ప్రాంతానికి తరలిచాంరు.

బలాంగన్ రిఫైనరీని ఇండోనేసియా ప్రభుత్వ చమురు సంస్థ పెర్టామినా నడుపుతోంది.

దేశంలోని కీలకమైన చమురు రిఫైనరీల్లో ఇది కూడా ఒకటి. గ్రేటర్ జకర్తా ప్రాంతానికి ఇంధన, పెట్రో కెమికల్స్ అవసరాలను ఈ రిఫైనరీనే తీరుస్తోంది.

ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)